E-Paper
Advertisement

Sreeleela: శ్రీలీలను చెల్లెమ్మా అంటూ పిలిచిన అభిమాని…భలే కౌంటర్ ఇచ్చిన నటి!

Sreeleela: శ్రీలీలను చెల్లెమ్మా అంటూ పిలిచిన అభిమాని…భలే కౌంటర్ ఇచ్చిన నటి!
Advertisement

Sreeleela: శ్రీలీల హీరోయిన్ గా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. భాషతో సంబంధం లేకుండా ఈ ముద్దుగుమ్మ తెలుగు హిందీ తమిళ భాషలలో సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. త్వరలోనే శ్రీలీల ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో శ్రీలీల ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఖమ్మంలో సందడి చేసిన శ్రీ లీల…

ఇలా ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు పెద్ద ఎత్తున షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఈమె ఖమ్మం జిల్లాలో మాంగల్య షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హీరోయిన్లు వస్తున్నారంటే పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలోనే శ్రీలీలను చూడటానికి కూడా అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు. శ్రీ లీల అభిమానులకు హాయ్ చెబుతూ సందడి చేయడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ అందరూ ఆమెతో సెల్ఫీలు తీసుకోవడం కోసం ఆటోగ్రాఫ్ తీసుకోవడం కోసం ఎగబడ్డారు.

రాఖీ పండుగకు గిఫ్ట్ ఇవ్వాలి..

Advertisement

అభిమానులు ఆటోగ్రాఫ్ అడగడంతో శ్రీలీల ఒక అభిమానికి ఆటోగ్రాఫ్ ఇచ్చింది. దీంతో అభిమాని చెల్లెమ్మ ఆటోగ్రాఫ్ ఇచ్చింది అంటూ తనని చెల్లి అని పిలవడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇలా అభిమాని తనని చెల్లి అని పిలవడంతో వెంటనే శ్రీలీల వచ్చే రాఖీ పండుగకు నాకు గిఫ్ట్ ఇవ్వాలి అంటూ తనదైన శైలిలోనే మాట్లాడటంతో ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో పై నేటిజన్ లు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. శ్రీలీలను చెల్లమ్మ అన్నాడంటే ఆ గుండెకు ఎంత ధైర్యం అడ్డు కొంతమంది కామెంట్లు చేయగా మరికొందరు గిఫ్ట్ అడుగుతూ భలే కౌంటర్ ఇచ్చిందిగా శ్రీలీల టైమింగ్ వేరే లెవెల్ అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

ఉస్తాద్ భగత్ సింగ్ పైనే శ్రీలీల ఆశలు…

Advertisement

ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె తమిళ సినిమా ఇండస్ట్రీలో ధనుష్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నారు అలాగే బాలీవుడ్ సినిమాలో షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి 19వ తేదీ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈమె ఈ సినిమా ప్రమోషన్లలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక శ్రీ లీల ఆశలన్నీ కూడా ఈ సినిమా పైనే ఉన్నాయి. గత కొంతకాలంగా స్టార్ హీరోల సినిమాలలో నటిస్తున్నప్పటికీ శ్రీలీలకు మాత్రం సరైన సక్సెస్ రాలేదని చెప్పాలి. మరి ఈ సినిమా అయిన ఈ ముద్దుగుమ్మకు సక్సెస్ ఇచ్చేనా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Jabardasth Apparao: జబర్దస్త్ అప్పారావు ఫేస్ నల్లగా మారడానికి ఆ సినిమానే కారణమా.. ఏమైందంటే?

Related News

సాయి పల్లవి కోసం.. ‘రామాయణ్’ సాంగ్‌లో ఆ నటిని బ్లర్ చేశారా?

ఫాహ్.. ఈ ఫన్నీ సౌండ్‌కు స్ఫూర్తి కమెడియన్ వేణు మాధవ్?

ఎమ్మెస్ సుబ్బలక్ష్మిగా రష్మిక..ఆమె ఫస్ట్ రియాక్షన్ ఇదే!

విడాకుల వార్తలకు చెక్ పెట్టిన కియారా సిద్దార్థ్ మల్హోత్రా!

పూర్తి అబ్బాయిగా మారిన స్నిగ్ధ.. గర్ల్ ఫ్రెండ్ కూడా?

అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ కు బిగ్ షాక్.. గచ్చిబౌలిలో కేసు నమోదు!

టికెట్ ధరల పెంపు.. సినిమాకే నష్టం.. నిర్మాతలు ఆలోచించండి!

ఇట్స్ అఫీషియల్ వాయిదా పడిన ప్రశాంత్ నీల్ ‘418’ ..కారణం ఇదేనా?

Big Stories

Advertisement
×