BigTV English

Brahmamudi : ‘బ్రహ్మముడి ‘ కోసం మానస్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Brahmamudi : ‘బ్రహ్మముడి ‘ కోసం మానస్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Brahmamudi : బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ కు లేడీస్ ఎంతగా అట్రాక్ట్ అయిపోయారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని సీరియల్స్ కోసమే అన్ని పనులు మానుకొని టీవీల దగ్గర కూర్చుంటున్నారు. అయితే స్టార్ మా చానల్లో ఎక్కువగా ప్రేక్షకుల మనసు దోచుకున్న సీరియల్స్లలో బ్రహ్మముడి సీరియల్ మొదటి స్థానంలో ఉంది. ఒకప్పుడు కార్తీకదీపం ఆ స్థానంలో ఉంది. ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ నెంబర్ వన్ స్థానంలో ఉందని తెలుస్తుంది. ఈ సీరియల్ లో హీరో హీరోయిన్లుగా నటించిన వారి రెమ్యూనరేషన్ గురించి తెలుసుకోవాలని జనాలు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ సీరియల్ లో హీరోగా నటిస్తున్న రాజ్ అలియాస్ మానస్ రెమ్యూనరేషన్ ఎంతో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


బ్రహ్మముడి రాజ్ రెమ్యూనరేషన్..

స్టార్ మాలో చాలా కాలంగా నంబ‌ర్‌వ‌న్ సీరియ‌ల్స్‌లో ఒక‌టిగా కొన‌సాగుతోంది బ్ర‌హ్మ‌ముడి.ఒక‌ప్పుడు టీఆర్‌పీ రేటింగ్‌లో బ్ర‌హ్మ‌ముడి నంబ‌ర్‌వ‌న్‌లో నిలుస్తూ వ‌చ్చింది. కార్తీక దీపం 2, గుండె నిండా గుడి గంట‌లు వంటి సీరియ‌ల్స్‌కు గ‌ట్టి పోటీ ఇచ్చింది. సీరియ‌ల్ టైమ్ ఛేంజ్ కావ‌డంతో రేటింగ్ దారుణంగా ప‌డిపోయింది. నంబ‌ర్ వ‌న్ ప్లేస్ నుంచి ఒక్క‌సారిగా టాప్ టెన్‌లోకి ప‌డిపోయింది. ప్ర‌స్తుతం మ‌ధ్యాహ్నం ఒంటిగంట‌కు స్టార్ మాలో ఈ సీరియ‌ల్ టెలికాస్ట్ అవుతోంది.. అయితే ఈ సీరియల్ లో లీడ్ రోల్ లో నటిస్తున్న మానస్ రెమ్యూనరేషన్ పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీరియల్ కోసం రోజుకు 60,000 రెమ్యూనరేషన్ ను అందుకుంటున్నాడు. అంటే నెలకు దాదాపు 12 లక్షలు అందుకుంటున్నాడని తెలుస్తుంది.


Also Read :నేల మీద పడుకొనేవాడిని.. ఆకలితో పడుకున్న.. కన్నీళ్లు తెప్పిస్తున్న స్టోరీ…

మానస్ రియల్ లైఫ్..

1990న విశాఖపట్నంలో జన్మించారు మానస్ నాగులపల్లి. ఆయన పూర్తి పేరు మాస్టర్ రామ్ తేజ. చిన్నతనం నుంచే మానస్ అన్నింట్లోను ప్రతిభను చాటుకున్నారు. డ్యాన్సులు, యాక్టింగ్‌లోనే కాకుండా చదువుల్లో కూడా ఆయన టాపర్. మంచి ర్యాంక్ సాధించిన ఆయన ఏకంగా మెగాస్టార్ చిరంజీవి తో ప్రశంసలు అందుకొన్నాడు.. మానస్ 2000 ఒకటి సంవత్సరంలో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. నందమూరి బాలకృష్ణ నటించిన నరసింహానాయుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో కనిపించిన ఆయన క్షీరసాగర మథనం, అర్జున్, వీడే లాంటి సినిమాల్లో హీరోగానూ అలరించారు. ఈ ఫేమ్‌తో బిగ్‌బాస్ తెలుగులో అవకాశం దక్కించుకుని మరింత పాపులర్ అయ్యాడు. అలా ఒక్కో సినిమాతో తన క్రేజ్ ని పెంచుకుంటూ ప్రస్తుతం బుల్లితెరపై తన హవాని కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే పలు సీరియల్స్ లో నటించిన మానస్ ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ లో నటిస్తున్నారు. ఈ సీరియల్ తో పాటు పలు సీరియల్స్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అదేవిధంగా బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలలో మెరుస్తూ జనాలను అలరిస్తున్నాడు.

ఇక రియల్ లైఫ్ విషయానికొస్తే.. ఈమధ్య పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మానస్ తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తుంటాడు..

Related News

Dhee Bhoomika : ఢీ కంటెస్టెంట్ కి భారీ యాక్సిడెంట్… కారు తుక్కు తుక్కు

Smriti Irani: ఒక్క ఎపిసోడ్ లక్షల్లో రెమ్యూనరేషన్.. ఏమాత్రం తగ్గని మాజీ మంత్రి క్రేజ్!

Bindas Brothers: పేరుకే సెలబ్రిటీలం… సంపాదన మాత్రం నిల్.. బిందాస్ బ్రదర్స్ కన్నీటి కష్టాలు!

Big TV Kissik talks: తట్టుకోలేక సూసైడ్ అటెంమ్ట్ చేశా.. కిస్సిక్ షోలో అమర్‌దీప్ ఎమోషనల్!

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today August 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర విషయంలో ఆరుతో బాధపడ్డ మిస్సమ్మ

Big Stories

×