BigTV English

Actor Sameer : నేల మీద పడుకొనేవాడిని.. ఆకలితో పడుకున్న.. కన్నీళ్లు తెప్పిస్తున్న స్టోరీ…

Actor Sameer : నేల మీద పడుకొనేవాడిని.. ఆకలితో పడుకున్న.. కన్నీళ్లు తెప్పిస్తున్న స్టోరీ…

Actor Sameer : టాలీవుడ్ ఇండస్ట్రీలో నటులుగా రాణిస్తున్న వాళ్లు ఒకప్పుడు ఎన్నో కష్టాలలో అనుభవించి ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ నటులుగా కొనసాగుతున్నారు. జీవితం అందరికీ చేతికి అందించిన పండులాగా ఉండదు. ఎంతోమంది ఆకలిని దిగమింగుకొని కన్నీళ్లను తాగుతూ బ్రతుకు మీద ఆశతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో నటులుగా కొనసాగుతున్న వారంతా ఒకప్పుడు ఆకలి దప్పులను అనుభవించిన వారే.. ఈమధ్య సినీ నటులు వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ తమ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను బయటపెడుతున్నారు. తాజాగా సీనియర్ నటుడు సమీర్ కూడా తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి ఓ ఛానల్ లో మాట్లాడుతూ బయటపెట్టారు. ఆయన తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అవేంటో ఒకసారి చూద్దాం..


సమీర్ జీవితంలో అన్నీ కష్టాలే..

సినీ నటుడు సమీర్ గురించి ప్రత్యేకంగా పరిచయాల అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో ప్రత్యేక పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్న నటుడు సమీర్. ఈయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన జీవితంలో మొదట ఎలాంటి కష్టాలను అనుభవించారో బయటపెట్టాడు. ఆయన మాట్లాడుతూ.. చిన్నప్పుడే మా అమ్మ నాన్న విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత నన్ను బంధువుల ఇంట్లో ఉంచారు. అయితే నన్ను భారంగా చూసిన బంధువులు ఎప్పుడు ఇంటికి చుట్టాలు వచ్చినా నా గురించి పరిచయం చేసే వాళ్ళు కాదు. చుట్టాలు వస్తున్నారు లోపలికి వెళ్ళు అని పంపించేవారు. తర్వాత వాళ్లు వచ్చి వెళ్లిపోయిన సంగతి కూడా నాకు తెలియనివ్వకుండా చేసేవారు. ఎందుకంటే నేను సినిమాల్లో ట్రై చేస్తున్నానని వాళ్ళకి చెప్పుకోడానికి చిన్నతనంగా ఉండడంతో వాళ్ళు ఎవరికీ నన్ను పరిచయం చేసేవాళ్ళు కాదు. ఓ రోజు సినిమా షూటింగ్ కి వెళ్లి లేట్ అవ్వడంతో ఇంటికి వస్తే తలుపు తీయలేదు. అపార్ట్మెంట్ కింద ఉన్న సెల్లార్లో పడుకొని ఉదయాన్నే మళ్ళీ ఇంటికి వెళ్లేవాడిని.. అలా మెల్లగా వాళ్ళు నన్ను ఇంట్లోంచి పంపించేశారు.


Also Read :ఈ ఫోటోలోని బుడ్డోడు ఓ స్టార్ హీరో కొడుకు.. గుర్తు పట్టారా..?

ఆ తర్వాత రెంట్ కొట్టుకోవడానికి డబ్బులు లేక అక్కడ ఇక్కడ ఉంటూ చిన్న చిన్నగా డబ్బులు సంపాదించుకొని ఒక రూమ్ ను రెంటుకు తీసుకున్నాను. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు రావడంతో నా నటనతో ఒక్కో సినిమాలో నటిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని పొందాను అని సమీర్ అన్నారు.. నాకు మంచి పేరు వచ్చిన తర్వాత ఇప్పుడు అదే చుట్టాలు ఇంటికి చుట్టాలు వస్తున్నారు నువ్వు ఎప్పుడు వస్తున్నావు అని నాకు ఫోన్ల మీద ఫోన్లు చేసి రప్పిస్తున్నారు. మన దగ్గర డబ్బులు  ఉంటే ఆటోమేటిక్గా చుట్టాలు అందరూ మన చుట్టూనే ఉంటారని డైరెక్ట్ గా చెప్పేసాడు. ఆ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం వైరల్ అవ్వడంతో సమీర్ పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సమీర్ సినిమాలు.. 

సినీ నటుడు సమీర్ సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఏదో విధంగా డబ్బులు సంపాదించుకుని రెంట్ కట్టుకుని బయట ఉండడం మొదలు పెట్టాను. అప్పటి నుంచి నో రిలేటివ్స్, అలా నేను ఇండస్ట్రీకి వచ్చి 29 ఏళ్ళు అయ్యింది. ఈ జర్నీలో 490 సినిమాలు చేసాడని ఆయన అన్నారు. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తున్నారు..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×