BigTV English
Advertisement

OTT Movie : అంతుచిక్కని వ్యాధితో వరుస మరణాలు… మతిపోగొట్టే ట్విస్ట్ లున్న సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్

OTT Movie : అంతుచిక్కని వ్యాధితో వరుస మరణాలు… మతిపోగొట్టే ట్విస్ట్ లున్న సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్

OTT Movie : కరోనా టైమ్ లో ప్రపంచమంతా ఎంతగా విలవిల్లాడిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మళ్ళీ అలాగే ప్రపంచాన్ని తుడిచి పెట్టేసే అంతు చిక్కని వ్యాధి వస్తే… ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది కదూ. అచ్చం ఇలాంటి స్టోరీ లైన్ తోనే ఓ హాలీవుడ్ మూవీ తెరకెక్కింది. ఆ మూవీ ఓటీటీలో ఉంది? కథ ఏంటో తెలుసుకుందాం పదండి.


కథలోకి వెళ్తే…
“ది వరల్డ్ ఎండర్ వైరస్” అనే ప్రాణాంతక వ్యాధి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి, జనాభాను దాదాపుగా నాశనం చేసే సమయంలో కథ మొదలవుతుంది. ఈ వైరస్ సోకిన వారు క్షణాల్లో చనిపోతారు. రక్తం లేదా వ్యాధి సోకిన వారిని తాకడం ద్వారా ఈ రోగం వేగంగా వ్యాపిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో ఇద్దరు సోదరులు బ్రియాన్ (క్రిస్ పైన్), డానీ (లౌ టేలర్ పుచ్చి)… వాళ్ళ స్నేహితురాలు బాబీ (పైపర్ పెరాబో), ఒక చిన్న అమ్మాయి కేట్ (ఎమిలీ వాన్‌క్యాంప్)తో కలిసి టర్టిల్ బీచ్ అనే సముద్రతీరాన ఉన్న హోటల్‌కు చేరుకోవడానికి జర్నీ మొదలు పెడతారు. ఈ గ్యాంగ్ తమ బాల్య జ్ఞాపకాలతో నిండిన ఈ హోటల్ ను సురక్షిత స్థలంగా భావిస్తారు.

కారులో ప్రయాణిస్తూ కఠిన నియమాలను పాటిస్తారు. వ్యాధి సోకిన వారిని తాకవద్దు, నీట్ గా ఉండాలి, ఎవరినీ నమ్మవద్దు, వ్యాధి సోకినవారు ఇప్పటికే చనిపోయినట్లు భావించాలి అనేవి ఆ రూల్స్. బ్రియాన్ అందరినీ కాపాడడం కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటాడు, కానీ డానీ, బాబీ మానవత్వం చూపాలని అనుకుంటారు. ఈ ప్రయాణంలో వ్యాధి సోకిన వ్యక్తులు, ఆహారం, పెట్రోల్ కొరత వంటి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు.


మార్గం మధ్యలో ఫ్రాంక్ అనే తండ్రి, వ్యాధి సోకిన అతని కుమార్తెని కలుస్తారు. తమ కార్లో గ్యాస్ అయిపోయిందని, హాస్పిటల్ కు చేరుకోవడానికి సహాయం చేయమని కోరుతారు. బ్రియాన్ సహాయం చేయడం ప్రమాదకరమని భావిస్తాడు, చివరకు వారితో కలిసి ప్రయాణించడానికి ఒప్పుకుంటారు. తర్వాత కారు పాడైపోవడంతో వీళ్ళంతా ఒక రిసార్ట్‌లో చిక్కుకుంటారు, అక్కడ వ్యాధి సోకిన వ్యక్తులతో భయంకర పరిస్థితులు ఎదురవుతాయి. ఈ సంఘటనలో బాబీ అనుకోకుండా వైరస్‌కు గురవుతుంది, కానీ ఆమె ఆ విషయాన్ని దాచిపెడుతుంది. ఇక అందరూ కలిసి ఒక సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) బేస్‌ను చేరుకుంటారు, మరి అక్కడికి వెళ్ళాక ఎదురైన షాకింగ్ ట్విస్ట్ ఏంటి? హీరోయిన్ ఆ రోగంతో చనిపోయిందా? చివరకు ప్రాణాలతో మిగిలింది ఎవరు? వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు ? అనే ఇంట్రెస్టింగ్ విషయాలను సమాధానాలు కావాలంటే ఈ మూవీపై ఓ లుక్కేయండి.

Read Also : పట్టపగలే కన్న కూతురిని కిరోసిన్ పోసి తగలబెట్టే తల్లిదండ్రులు… ఈ వైరల్ హర్రర్ మూవీని చూశారా?

ఏ ఓటీటీలో ఉందంటే?
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమాకు ఆలెక్స్ పాస్టర్, డేవిడ్ పాస్టర్ దర్శకత్వం వహించారు. క్రిస్ పైన్, లౌ టేలర్ పుచ్చి, పైపర్ పెరాబో, ఎమిలీ వాన్‌క్యాంప్, క్రిస్టోఫర్ మెలోని ప్రధాన పాత్రలు పోషించిన ఈ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ కోవిడ్ టైమ్ లో బాగా వైరల్ అయ్యింది. ఈ మూవీ పేరు “Carriers”. ఇక ఈ మూవీ మూడు ఓటీటీలలో అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), నెట్ ఫ్లిక్స్ (Netflix), ఆపిల్ టీవీ (Apple TV) ఓటీటీలలో ఈ మూవీని చూడవచ్చు.

Related News

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

OTT Movie : రాకుమారిని వెంటాడే నాగ బంధనం… ఆత్మను ప్రేమించే నరుడు… ఓటీటీలో సరికొత్త థ్రిల్లర్

OTT Movie : భర్త ఉండగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో… మన తెలుగు సినిమానే కాపీ కొట్టారు మావా

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

Big Stories

×