Brahmamudi serial today Episode: రాజ్ తీసుకొచ్చిన శారీ కట్టుకుని కావ్య సంబరపడుతుంటే.. ఇంతలో రాజ్ ఫోన్ చేస్తాడు. నాకు నిద్దుర పట్టడం లేదని చెప్తాడు. ఎందుకని కావ్య అడగ్గానే.. ఏమో మనసేం బాగాలేదని చెప్తాడు రాజ్. అయితే మనసునే అడగండి ఎందుకు బాగాలేదో అంటుంది కావ్య. దీంతో రాజ్ నేను చేసిన తప్పుకు నా మనసేం చెప్తుందండి అంటాడు రాజ్. మీరేం తప్పు చేశారు అని కావ్య అడగ్గానే.. ఒక ఆడపిల్ల ఇంట్లో ఒంటరిగా ఉంటే ఇంటికి రావడం. అలా అంత సేపు అక్కడే స్పెండ్ చేయడం ఏం బాగాలేదు కదండి అంటాడు. దీంతో కావ్య అలాంటిదేం లేదండి మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అని కావ్య చెప్తుంది.
నేను తిరిగి వస్తుంటే మీ మామయ్యగారు చూశారు కదా ఆయనేమీ అనలేదా… అని రాజ్ అడుగుతాడు. ఏమీ అనలేదని పైగా మీరు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీలయ్యారు అంటూ నోరు జారుతుంది కావ్య. దీంతో రాజ్ నేను వచ్చినందుకు ఆయన హ్యాపీగా ఫీల్ కావడం ఏంటండి అని అడుగుతాడు. వెంటనే తేరుకున్న కావ్య అదే మిమ్మల్ని చూడగానే మంచి అభిప్రాయం ఏర్పడిందట. అందుకే ఆయన హ్యాపీగా ఉన్నారు అని సర్ధి చెప్తుంది. దీంతో మంచితనం మన బ్లడ్ లోనే ఉంది లేండి.. మనల్ని చూస్తే ఎవరైనా ఇట్టే ఇంప్రెస్ అవుతారు అంటాడు. అందుకే యామిని ఇంత దారుణానికి ఒడిగట్టింది అని మనసులో అనుకుంటుంది కావ్య. తర్వాత ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకుంటారు.
కావ్య కాఫీ చేస్తుంటే.. అపర్ణ వస్తుంది. ఏం చేస్తున్నావే అని అడుగుతుంది. దీంతో అపర్ణ కోపంగా కావ్యను తిడుతుంది. వెంటనే నా కొడుకుతో మాట్లాడాలి అంటుంది. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని కావ్య అడుగుతుంది. దీంతో అపర్ణ అంతా నా కర్మనే అత్తను అయ్యుండి నా కొడుక్కి సైట్ కొట్టమని నీకు సలహాలు ఇవ్వాల్సి వస్తుంది అనగానే కావ్య అత్తయ్యా కొడుక్కి సైటు కొట్టమని మీరు పరాయి వాళ్లకు చెప్పట్లేదు కదా..? మీ కొడలికే కదా చెప్తున్నారు. పర్వాలేదు నేను ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అని అడుగుతుంది. దీంతో చెప్తాను విను నిన్న వాడు నీకో చీర ఇచ్చాడు కదా..? అది నీకు నచ్చింది కదా..? అని అడగ్గానే చాలా బాగా నచ్చింది అత్తయ్యా.. నాకు ఏది ఇష్టమో అదే కచ్చితంగా తెచ్చారు అంటుంది. మరి ఆ విషయం వాడికి చెప్పావా..? అని అపర్ణ అడగ్గానే రాత్రే ఫోనులో చెప్పాను అంటే కావ్యను తిడుతూ ఫోనులో కాదు వెంటనే నువ్వు వాడి దగ్గరకు వెళ్లి చేయి పట్టుకుని మరీ నచ్చిందని చెప్పు అంటుంది. సరే అంటూ కావ్య వెళ్లిపోతుంది.
యామిని, వైదేహి హాల్లో వెయిట్ చేస్తుంటారు. ఉదయాన్నే రామ్‌ను బయటకు తీసుకెళ్లాలని నువ్వు రెడీ అయ్యావు కానీ రామ్ ఇంకా రాలేదు కదా అని వైదేహి అడుగుతుంది. దీంతో పర్వాలేదు మమ్మీ బావ వచ్చే వరకు వెయిట్ చేస్తాను. కానీ ఇవాళ బావను వదలను అని చెప్తుండగానే.. రాజ్ వస్తాడు. దీంతో యామిని వచ్చావా బావ నీ కోసమే వెయిట్ చేస్తున్నాను అని చెప్తుంది. దీంతో రాజ్ ఎక్కడికి యామిని అని అడుగుతాడు. బయటకు బావ అని చెప్తుంది యామిని. బయటకు అంటే ఎక్కడికి అని రాజ్ అడుగుతాడు. దీంతో అదేంటి బావ ఒక ఇంపార్టెంట్ పని మీద మనం బయటకు వెళ్లాలి అని చెప్పాను కదా..? మర్చిపోయావా అటుంది యామిని. ఓ అవును కదా మర్చిపోయాను అంటూ కళావతి గారు ఫోన్ చేయలేదు కదా..? యామిని ఏదో ఇంపార్టెంట్ అంటుంది. ఓ రెండు మూడు గంటలు తనతో వెళ్లి వస్తే తర్వాత నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది అని మనసులో అనుకుని ఓకే యామిని వెళ్దాం పద అంటాడు.
సరే అంటూ ఇద్దరూ వెళ్లిపోతుంటే.. ఇంతలో కావ్య ఫోన్ చేస్తుంది. రాజ్ పక్కకు వెళ్లి ఫోన్ మాట్లాడతాడు. కావ్య మిమ్మల్ని ఒకసారి కలవాలని అడుగుతుంది. దీంతో రాజ్ సాయంత్రం కలుద్దామని చెప్తే.. లేదు లేదు ఇప్పుడే అర్జెంట్‌గా కలవాలి అంటుంది. సరే అంటూ ఫోన్ కట్ చేసి ఫ్రెండ్ కాల్ చేశాడు ఏదో ప్రాబ్లం అంటున్నాడు వాడు చాలా అర్జెంట్ గా రమ్మన్నాడు అంటే మనం కూడా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం కదా అంటుంది యామిని.. దీంతో రాజ్ లేదు యామిని వాడు చాలా అర్జెంట్ అని చెప్పాడు అని రాజ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
తర్వాత రాజ్, కావ్య కాఫీ షాపులో కూర్చుని మాట్లడుకుంటుంటే.. వెనకాలే వచ్చిన యామిని చూస్తూ ఇరిటేటింగ్ గా ఫీలవుతుంది. రాజ్ తనకు పెద్ద పార్టీ కావాలని అడుగుతాడు. పెద్ద పార్టీ అంటే పబ్బుకు తీసుకెళ్లి తాగించి డాన్సులు చేయాలా ఏంటి అంటుంది. అలా అడిగితే వస్తారా ఏంటి అని రాజ్ అంటాడు. మీరైతే అడిగి చూడండి వచ్చేది లేనిది ఆలోచిస్తాను అంటుంది. రాజ్ వెళ్లిపోతాడు. ఇంతలో యామిని వచ్చి కావ్యతో గొడవ పడుతుంది. కావ్య కోపంగా యామినిని తిడుతుంది. మా ఇద్దరి మధ్య ఉన్న బంధం చాలా గొప్పది. ఇద్దరి మధ్య పెళ్లి జరిగింది అంటే వారికి జన్మజన్మల అనుబంధం ఉంటేనే జరుగుతుంది అని చెప్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?