Brahmamudi: బుల్లితెరపై కొన్ని సీరియల్స్ లో నటిస్తున్న నటీనటులు బయట సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తున్నారు. సీరియల్ లో చూసేది వీళ్ళనేనా అన్న అనుమానం కూడా కలిగేలా చేస్తున్నారు. సీరియల్లో చాలా పద్ధతిగా చీరలు కనిపిస్తున్న కొందరు ముద్దుగుమ్మలు బయట మాత్రం హాట్ డ్రస్సులతో అందాల ఆరబోత చేస్తున్నారు. వాళ్ల ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతుంటాయో మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అలాంటి వారిలో బ్రహ్మముడి సీరియల్ నటి రుద్రాణి అలియాస్ షర్మిత గౌడ కూడా ఉన్నారు. ఈమె అక్కడ పద్ధతిగా కనిపిస్తూ ఇక్కడ మాత్రం బికినీలో దర్శనమిచ్చి యూత్ కి నిద్ర పట్టకుండా చేస్తుంది. ఈమె పెట్టే ఫోటోలు వైరల్ అవుతుంటాయి. అయితే ఈమె బ్రహ్మముడి సీరియల్ కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది.. మరి ఆ సీరియల్ లో నటిస్తున్నందుకు ఈమె ఒక్క రోజుకి ఎంత తీసుకుంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
బ్రహ్మముడి సీరియల్ రుద్రాణి రెమ్యూనరేషన్..
స్టార్ మా చానల్లో సక్సెస్ఫుల్గా కొనసాగుతున్న డైలీ సీరియల్ లలో బ్రహ్మముడి సీరియల్ ముందు వరుసలో ఉంటుంది. ఈమధ్య ఈ సీరియల్కు జనాల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇందులో నటిస్తున్న ప్రతి ఒక్కరికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా విలన్ పాత్రలో నటించిన రుద్రాణి అలియాస్ షర్మిత గౌడకు ఏ రేంజులో ఫాలోయింగ్ ఉంటుందో అందరికి తెలుసు. ఈమె ఆ సీరియల్ లో నటించేందుకు గాను ఒక్క రోజుకు 20,000 తీసుకుంటుందని తెలుస్తుంది. అంటే నెలలో ఎన్ని రోజులు షూటింగ్ ఉంటే అన్ని రోజులకు ఆమె 20,000 తీసుకుంటుంది. మొత్తంగా 7 లక్షల వరకు నెలకు ఆమె రెమ్యూనరేషన్ ఉండే అవకాశాలు ఉన్నట్లు టాక్.. కన్నడ బ్యూటీ అయిన ఈమె ట్రావెల్ ఖర్చులు, ఫుడ్ ఖర్చులు కూడా ప్రొడక్షన్ భరిస్తుంది.. ఎటు లేదనుకున్నా ఈమె కోసం 10 లక్షలు నెలకు ఖర్చు అవుతుంది.. ప్రస్తుతం ఈ సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకుపోవడంతో క్రేజ్ కూడా పెరిగిపోయింది.
Also Read : రెమ్యూనరేషన్ పెంచేసిన నయనతార.. ఒక్కో సినిమాకు ఎంతంటే..?
షర్మిత రియల్ లైఫ్..
కన్నడకు చెందిన నటి, మోడల్. కర్ణాటకలోని చిక్‌మగళూర్‌లో పుట్టి పెరిగింది. తొలుత మోడల్‌గా రాణిస్తున్న సమయంలో టెలివిజన్ రంగంలోకి ప్రవేశించింది. జనకి రాఘవ సీరియల్ ద్వారా 2017లో కన్నడ టెలివిజన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.. ఆ సీరియల్ లో తన నటనకు జనాలు ఫిదా అయిపోయారు. అలా ఒక్కో సీరియల్ తో తన టాలెంట్ నిరూపించుకుంటుంది. తెలుగులో బ్రహ్మముడి సీరియల్ తో ఎంట్రీ ఇచ్చింది. ఆ సీరియల్‌లో పోషించిన నెగిటివ్ రోల్‌కు మంచి ఆదరణ లభించింది. ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు రావడంతో పాటు ఆ రోల్ భారీగా ఆఫర్లను తీసుకొచ్చేలా చేసింది. 34 ఏళ్ల వయసులో ఉన్న షర్మిత బికినీ ఫోటో షూట్ చేస్తూ నెట్టింట మంటలు పుట్టిస్తుంది. ఆమె ఫోటోలు సోషల్ మీడియా బాగా వైరల్ అవుతున్నాయి..