Nayanatara : తమిళ స్టార్ హీరోయిన్ లేడీ బాస్ నయనతార గురించి ఎంత చెప్పినా తక్కువే. తమిళ ఇండస్ట్రీ తో పాటు తెలుగులో కూడా ఈమెకు మంచి డిమాండ్ ఉంది. ఇండస్ట్రీలో అత్యంత ఎక్కువ పారితోషకం తీసుకుంటున్న సినిమా హీరోయిన్లలో ఈమె పేరు ఏం మొదటగా వినిపిస్తుంది. స్టార్ హీరోలతో సమానంగా ఈమె రెమ్యూనరేషన్ ఉంటుందన్న విషయంలో డౌట్ లేదు. అయితే ఈమధ్య పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ తీసుకుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే బ్యాక్ టు బ్యాక్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ చేతినిండా సినిమాలను పెట్టుకునే ప్రయత్నం చేస్తుందని తెలుస్తుంది. అయితే నయనతార మరోసారి రెమ్యూనరేషన్ ను పెంచేసిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న నయన్..
మన ఇండియాలో సినిమాలకు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరు తమిళ స్టార్ హీరోయిన్ నయనతార. ఒక టీవీ యాడ్‌లో కేవలం 50 సెకన్లు నటించి ఏకంగా రూ.5 కోట్లు సంపాదించింది. నయనతారకు దాదాపు 40 ఏళ్ల వయసు వచ్చినా, 25 ఏళ్ల హీరోయిన్‌లా చాలా ఫిట్‌గా, అందంగా కనిపిస్తోంది.. ఈమె ఒక్కొక్క సినిమాకి దాదాపు 20 కోట్లకు పైగా వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈమెతో చేసే సినిమా సూపర్ హిట్ అవడంతో దర్శక నిర్మాతలు కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఆమెకు ఎంత అడిగితే అంత ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. అదే నయనతారకు ప్లస్ అయింది. అలా ఆమె సినిమా సినిమాకు రెమ్యూనరేషన్ పెంచుకుంటూ పోతుంది. ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాలకు దాదాపు 30 కోట్లకు పైగా వసూలు చేస్తుందని వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఆ వార్త మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
Also Read: కన్నడ హీరో సీక్రెట్ రిలేషిప్.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?
నయన్ పర్సనల్ లైఫ్..
నయనతార తమిళ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టింది. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇప్పుడు అత్యంత ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా హిస్టరీలో నిలిచింది. అయితే వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటున్న సమయంలోనే తమిళ హీరో శింబుతో ప్రేమలో పడింది. అతనితో ప్రేమాయణం నడిపింది. వీరిద్దరి ఇంకా పెళ్లి పీటల మీదకి ఎక్కబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. సడన్ గా ఏమైందో తెలియదు కానీ ఇద్దరు విడిపోయారు. ప్రభుదేవాతో దాదాపు మూడున్నర సంవత్సరాలు ప్రేమలో ఉంది. 2009లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా టాక్ నడిచింది కానీ, ఆ తర్వాత వీరు విడిపోయారు.. ఆ తర్వాత డైరెక్టర్ విఘ్నేశ శివన్ కాంబోలో ఓ మూవీ వచ్చింది. ఆ టైంలో ఇద్దరు ప్రేమలో పడ్డారు. కొన్నేళ్లు ప్రేమ పక్షుల్లాగా తిరిగారు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ఒకవైపు తల్లి కథను బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి సరసన ఓ సినిమాలో నటిస్తుంది.