Neet Exam: ఇవాళ(మే5th) దేశ వ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ జరగనుంది. పరీక్ష కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఎగ్జామ్ రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తున్నారు అధికారులు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు జరుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు జరుగుతుంది. దేశవ్యాప్తంగా 25 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 14 నగరాల్లో 552 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశాడు.
తెలంగాణ నుంచి 72వేల 507 మంది విద్యార్ధులు హాజరుకానున్నారు. రాష్ట్రంలో 190 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్క హైదరాబాద్‌లోనే 62 పరీక్షా కేంద్రాలుండగా.. 26 వేల మంది ఇక్కడే పరీక్ష రాయనున్నారు. గత ఏడాది ఉత్తరాది రాష్ట్రాల్లో నీట్ ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి. దీంతో ఈ అంశం జాతీయ స్థాయిలో వివాదాస్పదం అయింది. దీంతో ఈ సారి కేవలం ప్రభుత్వ కేంద్రాల్లో మాత్రమే పరీక్ష నిర్వహిస్తోంది. పరీక్షా కేంద్రాల దగ్గర మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఈసారి పాతపద్దతిలోనే పరీక్ష నిర్వహణ జరుగుతోంది. కోవిడ్‌కు ముందు ఒక్కో సబ్జెక్టు నుంచి 45 ప్రశ్నల చొప్పున నాలుగు సబ్జెక్టుల నుంచి మొత్తం 180 ప్రశ్నలు ఇచ్చేవారు. అందులో అన్ని ప్రశ్నలకు జవాబు చేయాల్సి ఉండేది. కోవిడ్ తర్వాత పరీక్ష విధానం మారింది. ఒక్కో సబ్జెక్టు నుంచి 50 ప్రశ్నలు ఇచ్చి.. అందులో 45 ప్రశ్నలకు జవాబు చేసేలా మార్పులు చేశారు. కానీ.. ఇప్పుడు మళ్లీ పాత పద్దతినే అనుసరిస్తున్నారు. మొత్తం 180 ప్రశ్నలు ఇస్తే.. అన్నింటికీ జవాబులు రాయాల్సి ఉంటుంది.
అయితే ఈసారి దేశ వ్యాప్కంగా సుమారు 23 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాసే అవకాశం ఉందని అంచనా. 2024లో 24.06 లక్షల మంది దరఖాస్తు చేయగా.. 23.33 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గతేడాది 66 వేల మంది అప్లై చేయగా.. 64 వేల మంది ఎక్జామ్ రాశారు. ఈసారి కూడా గతేడాది మాదిరిగానే రాష్ట్రం నుంచి విద్యార్ధులు పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది.
అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి సహా 29 నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. నీట్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్ధులకు దేశవ్యాప్తంగా 776 మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు అవకాశం లభిస్తుంది. జాతీయ స్థాయిలో 1.17 లక్షల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో 6,500 మేర సీట్లు ఉన్నాయని తెలిపారు.
Also Read: తగ్గేదేలే.. అటు ఎండలు.. ఇటు వానలు.. ఏపీ, తెలంగాణలో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..!
నీట్ ఎంట్రన్స్ పరీక్షలను అత్యంత పగడ్భంధీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షను ప్రశాంతంగా నిర్వహించడానికి.. ఎగ్జామ్స్ సెంటర్స్ వద్ద విస్తృత బందోబస్తీ ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధుల బయోమెట్రిక్ హాజరు తీసుకోవడానికి.. సరిపడ బయోమెట్రిక్ మిషన్ ను సమకూర్చుకోవాలని సూచించారు. విద్యార్ధులు పరీక్షా కేంద్రానికి అరగంట ముందే రావాలని సూచించారు. నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ నిబంధనను కఠినంగా అమలు చేస్తానన్నారు.
గతేడాది కూడా నీట్ నిర్వహణపై పలు వివాదాలు కాగా, హైరేంజ్‌లో విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ ఏడాది ఎలాంటి వివాదాలు జరగకుండా, మరింత కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కఠిన ఆంక్షల మధ్య విద్యార్థులు ఎలా ఎగ్జామ్స్ రాయబోతున్నారో వేచి చూడాలి. ఇసారైన ఎలాంటి వివాదాలు,లీకులు లేకుండా స్టూడెంట్స్‌కి పరీక్షలు జరుగుతాయని ఆశిస్తున్నారు.