BigTV English

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ఛార్జీల మోత, కారణం అదేనా?

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ఛార్జీల మోత, కారణం అదేనా?

Hyderabad Metro: తెలంగాణ ఆర్టీసీలో ప్రవేశపెట్టిన మహాలక్ష్మి స్కీమ్ ప్రభావం ఫలితాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయా? మహాలక్ష్మి  ఎఫెక్టు మెట్రోపై ప్రభావం పడిందా? హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపుకు అదే కారణమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. లేకుంటే పెంచేందుకు అధికారులు ఈ తరహా కుంటిసాకులు చెబుతున్నారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.


ఇదీ అసలు కారణం?

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు త్వరలో ఛార్జీల భారం తప్పేలా లేదు. మే నెల రెండో వారం నుంచి కొత్త ఛార్జీలు పెంచాలని భావిస్తోంది. ప్రస్తుతం ఎల్ అండ్ టీ ఛైర్మన్ అమెరికాలో ఉన్నారు. ఆయన అక్కడి నుంచి రాగానే ఛార్జీల పెంపుపై తుది నిర్ణయం వెల్లడికానుంది. ఛార్జీలు పెంపు ద్వారా ఏడాదికి సుమారు రూ. 150 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఛార్జీల పెంపుదల విషయమై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందట ఆ సంస్థ.


వరుస నష్టాలను అధిగమించేందుకు ఛార్జీల పెంపు అనివార్యంగా మారినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రూ.6,500 కోట్ల నష్టాలతో మెట్రో రైళ్లు నడుస్తున్నాయని అనధికార సమాచారం. ప్రస్తుతం రూ.10, గరిష్టంగా రూ.60 వరకు ఛార్జీలు ఉన్నాయి.

20 శాతం పెంచితే అప్పుడు టికెట్ ఛార్జ్ మినిమం అప్పుడు రూ.15 కానుంది. గరిష్ట ఛార్జి రూ.75 కానుంది. అయితే ఛార్జీలు ఏ మేరకు పెరగనున్నాయి అనేదానిపై ఈ వారంలో స్పష్టత రానుంది. ఛార్జీల పెంపు వల్ల ఇప్పుడున్న నష్టాలను అధిగమించేందుకు సహాయ పడుతుందని అంటున్నారు. ఛార్జీల పెంపు సామాన్యుడిపై ప్రభావం చూపనుంది.

ALSO READ: పోలీసు స్టేషన్ ముందే భూకబ్జా, రంగంలోకి మినిస్టర్

ఎల్ అండ్ టీ వర్గాలు ఏం చెబుతున్నాయి? మెట్రో కార్యకలాపాలు, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం, మాల్స్‌లో అద్దెల ద్వారా సంస్థకు ఏటా సుమారు రూ. 1500 కోట్ల వరకు ఆదాయం వస్తోందని అధికారుల లెక్కలు. మెట్రో రైలు నిర్వహణ, బ్యాంకు రుణాలపై చెల్లించే వడ్డీలు, ఇతర ఖర్చులు కలిపి ఏడాదికి దాదాపు రూ. 2 వేల కోట్ల వరకు వ్యయం అవుతోందన్నది అంచనా.

2024-25 ఏడాది రూ. 625 కోట్ల మూటగట్టుకుని అధికారుల లెక్కలు. 2017లో నుండి ఇప్పటివరకు నష్టం రూ.6,598 కోట్లకు చేరుకుందని అంచనా. కరోనా మహమ్మారి సమయంలో ప్రయాణికుల సంఖ్య తగ్గడం వల్ల ఈ పరిస్థితికి కారణమని అంటున్నారు.

మహాలక్ష్మి కూడా..

దీనికితోడు కొన్నాళ్లు ప్రయాణికుల రాకపోకల్లో తేగాలు కనిపిస్తున్నాయి. మెట్రో ద్వారా 4 నుంచి 5 లక్షల వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నట్లు అధికారుల మాట.  ముఖ్యంగా మహాలక్ష్మి పథకం నేపథ్యంలో మహిళలు ఉచిత ప్రయాణం వైపు మళ్లారు. విద్యార్థినులు, ఉద్యోగినులు సైతం మెట్రో నుంచి సిటీ బస్సుల వైపు మళ్లినట్లు ఎల్ అండ్ టీ అంచనా.

ఒకప్పుడు ఎల్‌బీనగర్‌-మియాపూర్, నాగోల్‌- రాయదుర్గం కారిడార్‌ల్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉండేది. జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మార్గంలో ట్రావెలర్లు సంఖ్య రోజు రోజుకూ పడిపోతోంది. ఈ నేపథ్యంలో నష్టాలను ఎదుర్కొనేందుకు ఛార్జీల పెంపు మినహా మరో దారి లేదని అంటున్నారు. మెట్రో ప్రారంభించిన నుంచి ఇప్పటినుంచి చార్జీలు పెంచలేదు. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ నగరాల్లో రెండు లేదా మూడుసార్లు ఛార్జీలు పెంచినట్లు చెబుతున్నారు.

 

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×