E-Paper
Advertisement

Intinti Ramayanam Chakradhar: ‘ఇంటింటి రామాయణం’ చక్రధర్ ఒక్కరోజుకు ఎంత తీసుకుంటాడో తెలుసా..?

Intinti Ramayanam Chakradhar: ‘ఇంటింటి రామాయణం’ చక్రధర్ ఒక్కరోజుకు ఎంత తీసుకుంటాడో తెలుసా..?
Advertisement

Intinti Ramayanam Chakradhar:  బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న తెలుగు సీరియల్స్లలో ఇంటింటి రామాయణం ఒకటి.. తాను ప్రేమించిన వ్యక్తిని తనకు కాకుండా చేశారని ఆ ఇంట్లోని అందరి మీద పగను పెంచుకుంటుంది పల్లవి. తనకు ఇష్టం లేకున్నా కక్ష్య సాధించాలి అని ఆ కుటుంబంలోకి అడుగుపెడుతుంది. ప్రేమించిన వ్యక్తిని తనకు కాకుండా దూరం చేసిందని తోడికోడలపై ఏదో ఒకటి చేస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అయితే తన అత్తింటి వారిపై పగ తీర్చుకునేందుకు తండ్రి కూడా తోడుగా ఉండడంతో ఎత్తుకు పైఎత్తులు వేస్తూ వస్తుంది పల్లవి. కొన్నిసార్లు తాను వేసే ప్లాన్లు రివర్స్ అవుతున్నా సరే మళ్లీ ప్రయత్నించి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టే పనిలో ఉంటుంది. ఈ సీరియల్ లో పల్లవికి తండ్రి క్యారెక్టర్ లో చక్రధర్ నటించారు. చక్రధర్ అసలు పేరు రామకృష్ణ.. తెలుగులో ఈయన ఎన్నో సీరియల్స్లలో నటించారు. ఇప్పటివరకు ఈయన నటించిన సీరియల్స్ అన్నీ కూడా విలన్ పాత్రలోనే కనిపించారు.. ఈయన ఇప్పటివరకు ఎన్ని సీరియల్స్లలో నటించారు..? ఒక్క రోజుకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడు అన్నది ఒకసారి తెలుసుకుందాం..

రామకృష్ణ ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

బుల్లితెర విలన్ రామకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.. సినిమాలను మించి వేలనిజం పండించడంలో ఈయన తర్వాతే ఎవరైన ప్రస్తుతం ఇంటింటి రామాయణం సీరియల్ లో చక్రధర్ పాత్రలో నటిస్తున్నాడు. కూతురు సంతోషాన్ని దూరం చేసిన బావమరిది కుటుంబం పై పగ పెంచుకొని, ఎలాగైనా సరే వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేయాలి అని ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ఉంటాడు. అతని మోసాలకు బావమరిది కుటుంబం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. పైకి మంచి వాడిలాగా నటిస్తూనే వెనకాల గోతులు తవ్వుతూ విలన్ పాత్రకు 100% న్యాయం చేస్తున్నాడు. ఈయన తెలుగులో ఎన్నో సీరియల్స్ లో నటించి అవార్డులను కూడా అందుకున్నారు.. సీనియర్ యాక్టర్ అయిన సినిమాల్లో కూడా నటించారు. అయితే సీరియల్ లో నటిస్తున్నందుకు ఒక్క రోజుకి ఈయన రెమ్యూనరేషన్ 20 వేలకు పైగా ఉంటుందని తెలుస్తుంది. మరి నెలరోజులు షూటింగ్ ఉన్న నేపథ్యంలో ఆయనకు బాగానే సంపాదన వస్తుంది.

Advertisement

Also Read : ఇల్లు ఇల్లాలు పిల్లలు పరిస్థితి దారుణం.. కార్తీక దీపం 2 సీరియల్ కు శుభం కార్డు..?

రామకృష్ణ నటించిన సీరియల్స్.. 

సీరియల్ నటుడు రామకృష్ణ సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో ఈయన నటించిన సినిమాలు కూడా మంచి గుర్తింపు నువ్వు తెచ్చిపెట్టాయి. ఈయన ఇప్పటివరకు చాలా తెలుగు సీరియల్స్లలో కూడా నటించారు. అయితే అన్ని సీరియల్ లో విలన్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో విలన్ గా ముద్ర వేసుకున్నాడు. గతంలో ఈయన నటించిన సూపర్ హిట్ సీరియల్స్ విషయానికొస్తే.. చక్రవాకం, శ్రావణ సమీరాలు, మౌన పోరాటం అర్దాంగి లో నటించాడు.. ఈ హిట్ సీరియల్స్ లో విలన్ పాత్రలో నటించాడు. ఈయన స్టార్ మాతో పాటుగా జీ తెలుగులో ప్రసారం అవుతున్న సీరియల్స్ లలో నటిస్తున్నాడు. ఇటీవల పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అందులో తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్స్ చేస్తున్నాడు..

Related News

Gundeninda GudiGantalu Today episode: కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. బాలుకు నిజం తెలుస్తుందా..? ఇది కదా అసలు ట్విస్ట్..

Podarillu Today Episode : గ్రాండ్ గా బర్త్ డే వేడుక.. చక్రీ ప్లాన్ సక్సెస్.. చక్రీకి దిమ్మతిరిగే షాకిచ్చిన మహా..

Nindu Noorella Saavasam Serial Today Episode July 21st ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌కు నిజం చెప్పిన ఎస్సై  

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. నర్మదకు భద్రపై అనుమానం.. వేదవతి ఫుల్ హ్యాపీ..

Intinti Ramayanam Today Episode: పాపం మీనాక్షికి కన్నీళ్లు.. పల్లవి, కమల్ రొమాన్స్.. యోగా టీచర్ ఎంట్రీ అదుర్స్..

Brahmamudi Serial Today Episode July 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వచ్చిన రాజు   

Actress Sirisha : నటి శిరీష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Big Stories

Advertisement
×