E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today November 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: నారదుడితో గేమ్స్‌ ఆడిన యముడు, ఆరు

Nindu Noorella Saavasam Serial Today November 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: నారదుడితో గేమ్స్‌ ఆడిన యముడు, ఆరు
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:

ఆరు తాను ఇంద్రజను కాదని యమధర్మరాజు అబద్దం చెప్పారని నారదుడికి చెప్పడంతో నారదుడు కోపంగా యముడి దగ్గరకు వెళ్తాడు. కోపంగా తన వైపు వస్తున్న నారదుడిని చూసిన యముడు షాక్‌ అవుతాడు. నారదుడు దగ్గరకు వెళ్లి సమవర్తి అంటూ పిలవగానే.. యముడు నారదుల వారికి నమస్కారం.. ఏమిటీ నారద మీ దృష్టి మరల మా వైపు మరలినది అని అడగ్గానే.. ఎంత వంచన చేసితివి సమవర్థి నాకే అసత్యం చెప్పితివా..? అని అడగ్గానే.. ఏమిటీ మేము మిమ్ములను వంచించితిమా..? మీతో అసత్యం ఆడితిమా..? ఏమిటి మహర్షి మాతోనే పరిహాసమా..? అని యముడు అడగ్గానే..పరిహాసం ఆడునది తమరా..? మేమా..? న్యాయం అన్యాయ విచారణ అధికారివి మీరు ఇటుల చేయుట అసలు తగదు.. ఒక మానవ కాంత దేవకన్య అని ఇంద్ర కన్య ఇంద్రజ అని చెప్పితివి.. అని నారదుడు చెప్పగానే..

Advertisement

యముడు షాక్ అవుతాడు. అటువంటిది ఏమియూ లేదు మహర్షి మీతో ఎవరు చెప్పిరి అని యముడు అడగ్గానే.. ఇంకెవరో చెబితే మేము ఎందులకు అడిగెదము..? ఆ బాలికే స్వయంగా చెప్పినది.. నీ బండారం బయట పడినది యమధర్మరాజా..? ఇప్పుడే మీ గురించి ముల్లోకములలో చాటింపు వేయించేదను.. మహేంద్రుడి సభలో పంచాయతీ పెట్టి మిమ్మల్ని విచారణకు అక్కడికి పిలిపించి మిగతా దిగ్పాలకుల ముందు మీ పరువు పదవి తీయించెదను అని నారదుడు చెప్పగానే.. యముడు కోపంగా ఆ బాలిక మాకు ఎంతటి సంకటము తెచ్చితివి..మా కిరీటము మా ఆసనమునకే ఎసరు తెచ్చితివా..? ఇప్పుడు ఏమి చేయవలె.. అని మనసులో అనుకుంటుంటాడు. ఇంతలో నారదుడు యమధర్మరాజా..? మీరు చేసిన ఈ తప్పిదమునకు తగిన మూల్యము చెల్లించుటకు సిద్దముగా ఉండుము.. ఇక ఈ రౌరమునకు మీరు ఎంత మాత్రము ప్రభువగా కొనసాగలేరు.. అని నారదుడు చెప్పగానే.. యముడు భయపడుతుంటాడు.

దూరం నుంచి అంతా వింటున్న ఆరు బాధగా పాపం రాజుగారు నన్ను ఎంత బాగా చూసుకున్నారు.. ఇప్పుడు నా వల్ల ఆయన చిక్కుల్లో పడుతున్నారే.. సమయానికి ఆ గుప్త గారు కూడా లేరు.. నా స్వార్థానికి రాజు గారు బలి అవ్వడం ఎందుకు నేనే వెళ్లి  ఆయన్ని కాపాడతాను.. అంటూ ఆరు వాళ్ల దగ్గరకు నవ్వుతూ వెళ్తుంది. యమధర్మరాజుల వారు మీరు ఓడితిరి నేను గెలిచితిని.. అంటూ ఆరు యముడికి సైగ చేస్తుంది. దీంతో యముడు అవును తల్లి మీరే గెలిచితిరి మేము ఓడితిమి.. అని చెప్పగానే.. యమధర్మరాజా ఈ గెలుపు ఓటములు ఏమి..? అని నారదుడు అడగ్గానే.. ఆరు కల్పించుకుని ఏమీ లేదు నారదుల వారు మేము దేవకన్య కాదు మానవ కాంత అని మీతో అసత్యం ఆడినచో మీరు నమ్మరు అని యమధర్మరాజుల వారు అన్నారు..

Advertisement

నమ్మిస్తాను అని నేను పందెం కాసితిని మీరు నమ్మేసిరి నేను గెలిచినట్టే కదా..? అని ఆరు చెప్పగానే.. నారదుడు షాక్‌ అవుతాడు. బలే దానికి బాలిక నారదుల వారు త్రిలోక సంచారి . నువ్వు దేవకన్యవు అని ఇంద్రుడి కుమార్తె ఇంద్రజవు అని వారికి తెలియదా ఏమి. ఏదో నీ సంతోషం కోసం  కాస్త నమ్మినట్టు నటించారు అంతే.. అంతే కదా మహర్షి అని యముడు అడగ్గానే.. అవును అవును మీరు చెప్పినది నేను నమ్మలేదు ఇంద్రజ. నీ దగ్గర నేను నమ్మినట్టు నటించితిని.. ఈ యమధర్మరాజును కాసేపు ఆట పట్టించుచుంటిని.. అని చెప్పగానే.. యముడు నవ్వుతూ మహర్షి రాను రాను ఇంద్రజ అల్లరి పిల్ల అవుతుంది అని చెప్పగానే.. నారదుడు నవ్వుతూ ఇక నేను వెళ్లి వచ్చేదను అంటూ నారదుడు వెళ్లిపోతాడు.  ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×