E-Paper
Advertisement

ఒకేసారి 5 భాషల్లో బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభం.. ఏ హోస్ట్ రెమ్యూనరేషన్ ఎంతంటే?

ఒకేసారి 5 భాషల్లో బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభం.. ఏ హోస్ట్ రెమ్యూనరేషన్ ఎంతంటే?
Advertisement

Bigg Boss Host Remuneration:గతంలో ఎన్నడూ లేనంతగా 2026 సెప్టెంబర్ 6వ తేదీన సాయంత్రం 7:00 గంటలకు దేశవ్యాప్తంగా ఘనంగా ఒకేసారి 5 భాషల్లో ఈ బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభించారు. తెలుగు, తమిళ్ ,కన్నడ, మలయాళం, హిందీ ఇలా మొత్తం 5 భాషల్లో కొత్త సీజన్ చాలా గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది. ఇకపోతే ఎవరికి వారు అటు సీరియల్స్ , సోషల్ మీడియా , సినిమాలు ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సెలబ్రిటీలను ఎంపిక చేశారు. ముఖ్యంగా తెలుగులో అగ్నిపరీక్ష అంటూ 6 మంది కామనర్స్ ని ఈ షో ద్వారా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అలా తెలుగులో మొత్తం 16 మంది హౌస్ లోకి అడుగుపెట్టారు.

ఒకేసారి 5 భాషల్లో బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభం..

ఇదంతా బాగానే ఉంది.. ఏకంగా 5 భాషల్లో కొత్త సీజన్ ప్రారంభం అయింది. మరి ఏ భాషలో ఏ సీజన్ నడుస్తోంది? ఏ సీజన్ కి ఎవరు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు? ఏ బాషా షో హోస్ట్ రెమ్యూనరేషన్ ఎంత? మొత్తంగా ఇండియాలో ప్రారంభమైన ఈ 5 భాషల షోలలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న బిగ్ బాస్ హోస్ట్ ఎవరు? ఇలా ఎన్నో ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

తెలుగు బిగ్ బాస్ సీజన్ 10 హోస్ట్ నాగార్జున రెమ్యూనరేషన్..

Advertisement

ముందుగా తెలుగు విషయానికి వస్తే.. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 10 ఘనంగా ప్రారంభం అయింది. ఈ సీజన్ కి ఎప్పటిలాగే హోస్ట్ గా టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున (Nagarjuna) వ్యవహరిస్తున్నారు. ఈయన గతంలో కంటే ఈసారి ఏకంగా రూ.35 నుండి రూ.40 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

తమిళ్ బిగ్ బాస్ 10 హోస్ట్ విజయ్ సేతుపతి రెమ్యూనరేషన్…

అటు తమిళ్ విషయానికి వస్తే.. తమిళంలో కూడా బిగ్ బాస్ సీజన్ 10 ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఈయన ఈ సీజన్ కోసం ఏకంగా రూ.75 నుండి రూ.80 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నట్లు సమాచారం.

మలయాళం బిగ్ బాస్ 8 హోస్ట్ మోహన్ లాల్ రెమ్యూనరేషన్..

Advertisement

మలయాళం విషయానికి వస్తే.. మలయాళంలో 8వ సీజన్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సీజన్ కి మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohan Lal) హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈయన సుమారుగా రూ.30 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

ALSO READ:సూరి, సుహాస్ ‘మండాడి’ ట్రైలర్ రిలీజ్!

కన్నడ బిగ్ బాస్ 13 హోస్ట్ కిచ్చా సుదీప్ రెమ్యూనరేషన్..

కన్నడ విషయానికి వస్తే.. బిగ్ బాస్ సీజన్ 13 చాలా ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈయన సుమారుగా రూ.20 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

హిందీ బిగ్ బాస్ 20 హోస్ట్ సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్..

హిందీ విషయానికి వస్తే.. ఇక్కడ బిగ్ బాస్ సీజన్ 20 ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎప్పటిలాగే సల్మాన్ ఖాన్ (Salman Khan) హోస్ట్గా బాధ్యతలు చేపట్టారు. పైగా ఆయన రూ.125 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

బిగ్ బాస్ చరిత్రలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హోస్ట్..

ఇలా మొత్తానికైతే బిగ్ బాస్ పలు భాషలలో ప్రేక్షకులను అలరిస్తోంది. అంతేకాదు వివిధ భాషలలో ఆయా భాషా స్టార్ హీరోలు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.. వీరందరిలో ముఖ్యంగా బిగ్ బాస్ హిస్టరీ లోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హోస్ట్ గా కూడా రికార్డ్ సృష్టించారు సల్మాన్ ఖాన్

Related News

మాధురి రాథోడ్ సూసైడ్ నోట్ లో బయటపడ్డ పేర్లు!

Bigg Boss 10 Telugu : బెంగాలి బ్యూటీకి ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

బిగ్ బాస్ 10 లోకి విలన్ ఎంట్రీ.. కన్నీళ్లు తెప్పించే స్టోరీ..

Karthika Deepam 2 Serial Today Episode September 7th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: కార్తీక్‌ ను ఇంట్లోంచి వెళ్లిపోమ్మన్న శివనారాయణ

Gundeninda GudiGantalu Today episode: రోహిణి మాస్టర్ ప్లాన్.. గుణకు షాకిచ్చిన రోహిణి.. శృతి పై ప్రభా సీరియస్..

Podarillu Today Episode : చక్రిని ఆడుకున్న మహా.. శైలు ఫుల్ హ్యాపీ.. పెద్ది పెళ్లి జరుగుతుందా..?

Illu Illalu Pillalu Today Episodes: రామరాజు మాటతో వేదవతి కన్నీళ్లు.. ధీరజ్ VS ప్రేమ.. శ్రీవల్లి పై అనుమానం..

Big Stories

Advertisement
×