Virender Sehwag On Asia Cup 2026 : ఆసియా కప్ 2026 మహిళల టోర్నమెంట్ చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఈ టోర్నమెంట్ పై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) హాట్ కామెంట్స్ చేశారు. ఈ టోర్నమెంట్ లో టీమిండియా మహిళల జట్టు ఆడటం తనకు ఏ మాత్రం ఇష్టం లేదని బాంబు పేల్చారు. ఇందులో ఆడి టైం వృథా చేసుకోవడం తప్ప, ప్రయోజనం ఏమీ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు వీరేంద్ర సెహ్వాగ్. ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ గెలిచినా కూడా ట్రోఫీ టీమిండియాకు దక్కకపోవచ్చు అని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ… ACC చైర్మన్ గా ఉన్న నేపథ్యంలో మనవాళ్లు టైటిల్ గెలిచినా కూడా వాడే దొంగలించడం గ్యారంటీ అని చురకలు అంటించారు. ఆ మాత్రం దానికి దుబాయ్ వెళ్లి మ్యాచ్ లు ఆడడం దేనికి ? శుద్ధ దండగ అంటూ హేళన చేస్తూ మాట్లాడారు వీరేంద్ర సెహ్వాగ్.
ఆసియా కప్ 2026 టోర్నమెంట్ చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే టీమిండియా సెమీ ఫైనల్ కు దూసుకెళ్లింది. మొన్న శనివారం రోజున పాకిస్తాన్ ఉమెన్స్ టీంను కూడా దుబాయ్ వేదికగా చిత్తు చేసింది టీమిండియా. ఏకంగా 7 వికెట్ల తేడాతో ఓడించింది. అయితే ఈ మ్యాచ్ లో టీం ఇండియా గెలిచిన సందర్భంగా ఫ్యాన్స్ అందరు ఖుషి గా ఉంటే.. వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం బాంబు పేల్చారు. ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో టీమిండియా ఆడడం శుద్ధ దండగ అంటూ పేర్కొన్నారు.
ఈ టోర్నమెంట్ లో ట్రోఫీ గెలిచినా కూడా టీమిండియా కు అన్యాయమే జరుగుతుందన్నారు. మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా టైటిల్ తీసుకునేందుకు హర్మన్ ప్రీత్ కౌర్ ముందుకు రాబోదని… దాన్ని అలుసుగా తీసుకొని మొహ్సిన్ నఖ్వీ ట్రోఫీని తన ఆఫీసులోనే పెట్టుకుంటాడని ఫైర్ అయ్యారు. ట్రోఫీ గెలిచిన తర్వాత ఛాంపియన్ జట్టుకు ఇచ్చే ధైర్యం… మంచితనం మొహ్సిన్ నఖ్వీ దగ్గర లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఈ టోర్నమెంట్ లో టీమిండియా ఆడకపోయి ఉంటే బాగుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వీరేంద్ర సెహ్వాగ్.
2025 పురుషుల ఆసియా కప్ ఛాంపియన్ గా కూడా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలోని టీమిండియా అప్పట్లో టైటిల్ గెలిచింది. కానీ పహాల్గామ్ సంఘటన నేపథ్యంలో మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని అందుకునేందుకు నిరాకరించాడు సూర్య కుమార్ యాదవ్. దీంతో ఆ ట్రోఫీని తన కార్యాలయంలోనే మొహ్సిన్ నఖ్వీ ఇప్పటికీ పెట్టుకున్నాడు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు ఎదురు అవుతాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు వీరేంద్ర సెహ్వాగ్.