E-Paper
Advertisement

432 కి.మీ రేంజ్.. అరగంటలో ఛార్జింగ్.. 11 వేల కి.మీ నడిపిన తర్వాత క్రెటా EV రివ్యూ!

432 కి.మీ రేంజ్.. అరగంటలో ఛార్జింగ్.. 11 వేల కి.మీ నడిపిన తర్వాత క్రెటా EV రివ్యూ!
Advertisement

Hyundai Creta EV Review After 11,000 KM: భారత మార్కెట్లో క్రెటాకు స్పెషల్ క్రేజ్ ఉంది. పెట్రోల్, డీజిల్ వెర్షన్లతో ఈ SUV ఇప్పటికే ఫుల్ సక్సెస్ అయ్యింది. అయితే, అదే క్రెటా ఎలక్ట్రిక్ మాత్రం అమ్మకాల విషయంలో అంతగా దూసుకెళ్లడం లేదు. తాజాగా 11,000 కిలోమీటర్లు నడిపిన తర్వాత రివ్యూ విడుదల అయ్యింది. ఈ నివేదికలో ఎలాంటి విషయాలు వెల్లడయ్యాయంటే..

ఫ్యామిలీ SUVగా మంచి కంఫర్ట్

క్రెటా ఎలక్ట్రిక్‌లో కుటుంబ ప్రయాణాలకు అవసరమైన సౌకర్యాలకు కొదవ లేదు. బోస్ సౌండ్ సిస్టమ్, క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వెనుక ప్రయాణికుల కోసం సన్ బ్లైండ్స్, ఫోల్డ్ అవుట్ టేబుల్స్ లాంటి చిన్న చిన్న సౌకర్యాలు కూడా ఇచ్చారు. ముఖ్యంగా వెనుక సీట్లలో స్థలం బాగుండటం ప్లస్ పాయింట్. దాదాపు 5 అడుగుల 11 అంగుళాల ఎత్తున్న ప్రయాణికుడికి కూడా కాళ్లు, మోకాళ్ల దగ్గర ఇబ్బంది లేకుండా కూర్చోవచ్చని లాంగ్ టర్మ్ ఎక్స్ పీరియెన్స్ చెబుతోంది.

మోషన్ సిక్‌నెస్ ఉన్నవారికీ ప్లస్

Advertisement

క్రెటా ఎలక్ట్రిక్ రైడ్ కంఫర్ట్ కూడా ఆకట్టుకునేలా ఉంది. బ్యాటరీ బరువును దృష్టిలో పెట్టుకుని సస్పెన్షన్‌ ను కొంత దృఢంగా ట్యూన్ చేశారు. దీంతో కారు ఎక్కువగా ఊగకుండా స్టేబుల్ గా ఉంటుంది. ముఖ్యంగా మోషన్ సిక్‌నెస్‌కు ఇబ్బంది పడేవారికి ఇది ఉపయోగకరంగా మారింది. వెనుక సీటులో కూర్చున్నప్పుడు బయట వ్యూ స్పష్టంగా కనిపిస్తుంది.

స్పీడ్ విషయంలోనూ తగ్గేదేలే!

క్రెటా ఎలక్ట్రిక్‌లోని లాంగ్ రేంజ్ వెర్షన్ 51.4kWh బ్యాటరీతో వస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 171hp పవర్, 255Nm టార్క్ అందిస్తుంది. 0 నుంచి 100kph వేగాన్ని కేవలం 8.2 సెకన్లలో అందుకోవడం దీని సామర్థ్యాన్ని చూపిస్తుంది. స్పోర్ట్స్ SUVలా కాకపోయినా.. కుటుంబ అవసరాలకు మాత్రం సరిపడేంత వేగం ఉంది. హ్యాండ్లింగ్ కూడా బాగుంటుంది.

రేంజ్ విషయంలో మంచి పనితీరు

Advertisement

లాంగ్ టర్మ్ టెస్ట్‌ లో క్రెటా ఎలక్ట్రిక్ 432 కిలోమీటర్ల రేంజ్ అందించింది.  ARAI వెల్లడించిన 473 కిలోమీటర్ల రేంజ్‌కు చాలా దగ్గరగా ఉంది. టెస్ట్ సమయంలో సుమారు 9.45km/kWh సామర్థ్యం నమోదైంది. సాధారణ డ్రైవింగ్‌లో కూడా 8km/kWh కంటే ఎక్కువ సామర్థ్యం కనిపించింది.

ఛార్జింగ్‌ లో భారీ అప్ డేట్

హ్యుందాయ్ ఇచ్చిన సాఫ్ట్‌ వేర్ అప్‌డేట్ తర్వాత క్రెటా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పనితీరులో పెద్ద మార్పు కనిపించింది. అప్‌డేట్‌కు ముందు DC ఫాస్ట్ ఛార్జింగ్‌లో గరిష్టంగా సుమారు 46kW మాత్రమే నమోదయ్యేది. అప్‌డేట్ తర్వాత గరిష్టంగా 72kW, సగటున సుమారు 67kW ఛార్జింగ్ వేగం వచ్చింది. దీంతో 20 నుంచి 80 శాతం ఛార్జ్ చేయడానికి పట్టే సమయం 50 నిమిషాలకు పైగా ఉండటం నుంచి దాదాపు 30 నిమిషాలకు తగ్గింది.

కొన్ని మైనస్ లు కూడా..

అన్ని విషయాల్లో క్రెటా ఎలక్ట్రిక్ పర్ఫెక్ట్ కాదు. పవర్డ్ టెయిల్‌గేట్ లేకపోవడం, HVAC కోసం టచ్ కంట్రోల్స్ ఉండటం కొంత అసౌకర్యంగా అనిపించవచ్చు. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే లేకపోవడం మైనస్.

మరి అమ్మకాలు ఎందుకు తక్కువ?

ఇన్ని మంచి విషయాలున్నప్పటికీ క్రెటా ఎలక్ట్రిక్ అమ్మకాలు నెలకు సుమారు 500 యూనిట్ల స్థాయిలోనే ఉన్నాయి. అదే సమయంలో కొన్ని ప్రత్యర్థి EVలు నెలకు 2,000 యూనిట్లకు పైగా సేల్ అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ధరతో పాటు కస్టమర్ల ఆలోచనా విధానం కావచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Read Also: ఆగస్టులో అదరగొట్టిన టాప్ 5 కార్లు.. నంబర్ వన్‌ ఏదంటే?

Tags

Related News

జావా 42 బాబర్‌కు అదిరిపోయే లుక్.. ఆల్ స్టార్స్ ఎడిషన్ ఏముంది భయ్యా!

ఆగస్టులో అదరగొట్టిన టాప్ 5 కార్లు.. నంబర్ వన్‌ ఏదంటే?

టాటా ఈవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు.. హారియర్ పై ఏకంగా రూ.2.75 లక్షల తగ్గింపు!

మహీంద్రా పేరు వెనుక ఇంత పెద్ద కథ ఉందా? కంపెనీ అసలు పేరు ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

మారుతి కస్టమర్లకు షాక్.. మళ్లీ ధరలు పెంపు, ఈసారి ఎంతంటే?

కార్నివాల్ హైబ్రిడ్ To న్యూ సోనెట్.. కియా నుంచి రాబోతున్న 10 క్రేజీ కార్లు ఇవే!

కొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లు.. బాలెనో ఫేస్‌లిఫ్ట్ ఏముంది గురూ!

Big Stories

Advertisement
×