Lyricist Chandrabose:చిత్ర పరిశ్రమలో కొంతమంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుంటే.. మరికొంతమంది సెలబ్రిటీల వారసులు పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) తన కూతురు జననీ బండ్ల (Janani Bandla) వివాహం అంగరంగ వైభవంగా జరిపించారు. ఇప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ లిరిసిస్ట్ గా , ఆస్కార్ గ్రహీతగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న చంద్రబోస్ (Chandrabose) కూడా తన కొడుకుకు అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
గేయ రచయితగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న చంద్రబోస్.. కొరియోగ్రాఫర్ సుచిత్రల కుమారుడు నంద వనమాలి (Nanda Vanamali) అలియాస్ నందు వివాహం శృతి (Shruthi) అనే అమ్మాయితో హనుమకొండలో అత్యంత వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సినీ సెలబ్రిటీలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ముఖ్యంగా ఈ పెళ్లి వేడుకల్లో చంద్రబోస్ దంపతులు సంతోషంతో డాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:ఐబ్రోస్ నచ్చలేదని నామినేషన్ చేస్తానంటున్న రామ్ ప్రసాద్..ఇదెక్కడి గోల రా మావా!
ఇదిలా ఉండగా.. సెప్టెంబర్ 6న హైదరాబాద్ వేదికగా నంద వనమాలి , శృతి దంపతుల రిసెప్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో నవ దంపతులను ఆశీర్వదించడానికి టాలీవుడ్ ప్రముఖులు పెద్ద ఎత్తున నందు, శృతి రిసెప్షన్ కు హాజరయ్యారు. ఈ వేడుకలలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravindh), డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar) దంపతులతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ , డైరెక్టర్ సందీప్ రాజు తదితరులు ఈ రిసెప్షన్ వేడుకకు హాజరయ్యి కొత్త దంపతులను ఆశీర్వదించారు. మొత్తానికి చంద్రబోస్ కొడుకు పెళ్లి వేడుకలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఇక నూతన జంటకు సెలబ్రిటీలు, నెటిజన్స్ , అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
వరంగల్ జిల్లా చిట్యాల మండలం చల్లగరిగే అనే గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి నరసయ్య ఉపాధ్యాయుడు కాగా, తల్లి మదనమ్మ గృహిణి. మొత్తం నలుగురు సంతానం కాగా, వారిలో చంద్రబోస్ ఆఖరివాడు. డిప్లొమా పూర్తి చేసి ఇంజనీరింగ్ చదివిన ఈయన.. చదువు పూర్తయ్యే సమయంలో పాటలపై అమితమైన ఆసక్తి కలిగింది. స్నేహితుల సహాయంతో సినీ ప్రముఖుల దగ్గరకు వెళ్లేవారు. అలా తొలిసారి ముప్పలనేని శివ.. చంద్రబోస్ పాటలు నిర్మాత రామానాయుడు కి చూపించడంతో తాజ్ మహల్ సినిమాలో “మంచు కొండల్లోన చంద్రమా” అనే పాట రాయడానికి అవకాశం లభించింది. ఆ తర్వాత వరుసగా సినిమాలలో అవకాశాలు లభించాయి. అలా ఇప్పటివరకు ఎనిమిది వందల సినిమాలలో 3300 పాటలకు ఆయన సాహిత్యం అందించారు .అంతేకాదు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో నాటు నాటు పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు..