E-Paper
Advertisement

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. బీఆర్‌ఎస్‌కు చెక్ పెట్టేలా సీఎం స్ట్రాటజీ!

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. బీఆర్‌ఎస్‌కు చెక్ పెట్టేలా సీఎం స్ట్రాటజీ!
Advertisement

Revanth Strategy: స్వేచ్ఛ బ్యూరో: శాసన సభ సమావేశాల్లో సీఎం స్పెషల్ స్ట్రాటజీ ని అనుసరిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు సీఎం సభలో తనదైన స్టైల్ లో ఆటను మొదలు పెట్టారు. అంశాన్ని బట్టి అధికార పార్టీ సభ్యులతో ప్రధాన ప్రతిపక్షంపై ఎటాక్ చేపిస్తున్నారు. వర్షాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం తొలి రోజు జరిగిన సభ తీరును పరిశీలిస్తే సీఎం స్ట్రాటజీ సంపూర్ణంగా స్పష్టమవుతుంది. మండే హాట్ టాఫిక్ గా మారిన స్పీకర్ పై విమర్శల అంశంలో సీఎం చాలా చాకచక్యంగా ఎమ్మెల్యేలతో ఎటాక్ చేయించి బీఆర్ ఎస్ ను ఇరకాటంలో పడేశారు. బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ చేసిన విమర్శలకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలంటూ సీఎం సభ ముందు ప్రతిపాదన ఉంచి, సొంత పార్టీ ఎమ్మెల్యేలతో ప్రాధాన్యత వారీగా మద్ధతు తో పాటు ఎటాక్ చేయించగలిగారు.స్పీకర్ దళిత సామాజిక వర్గానికి చెందిన నేత కావడంలో ఆ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో ఎటాక్ చేయించి తెలంగాణ సమాజంలోకి బలమైన సందేశాన్ని, సంకేతాన్ని పంపగలిగారు.

పార్టీపై ప్రెజర్..

ఎమ్మెల్యేలు వేముల వీరేషం, చిక్కుడి వంశీకృష్ణ, కడియం శ్రీహరి తదితర దళిత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో బీఆర్ ఎస్ పై ఎదురుదాడి చేయించారు. యావత్ దళిత సామాజిక వర్గానికి జరిగిన అన్యాయంగా ఎమ్మెల్యేలు తమదైన శైలీలో సభలో ప్రసంగించారు. ఇది బీఆర్ ఎస్ పార్టీపై ప్రెజర్ పెంచినట్లు అయింది. ప్రతిపక్షాల వ్యూహాలకు చెక్ పెడుతూ,అధికార పక్షం తన ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు ముఖ్యమంత్రి సమయం, సందర్భం బట్టి కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు.సభలో చర్చకు వచ్చే ప్రతి అంశంపైనా ముందస్తు ప్రణాళికతో దాడి చేసేలా ‘పొలిటికల్ గేమ్’ను కూడా డిజైన్ చేసినట్లు తెలిసింది. అసెంబ్లీలో పొలిటికల్ హీట్ పెంచేందుకు సీఎం తనదైన శైలీలో ప్లాన్, మ్యాప్ ను సిద్ధం చేసినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.

ఆసక్తికరంగా డిస్కషన్స్.. ఎవరెవరు ఏం చేయాలంటే..?

Advertisement

సభలో చర్చకు వచ్చే అంశాన్ని బట్టి సబ్జెక్టుపై పట్టు ఉన్న ఎమ్మెల్యేలను ఎంపిక చేసి వారి చేత ప్రసంగాలు చేయిస్తున్నారు.ప్రతిపక్షాలు దాడికి దిగేలోపే,అధికార పక్షం వైపు నుంచి ప్రతి దాడి పెంచేలా సభ్యులకు సభ నాయకుడు దిశానిర్దేశం చేస్తుంటారు.కానీ స్పీకర్ పై బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ చేసిన దురుసు వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు, ఖండించే బాధ్యతను సీఎం సోమవారం దళిత ఎమ్మెల్యేలకు అప్పగించారు.ఈ విషయంలో ఎలా స్పందించాలి,ఏ రకమైన వాదనలు వినిపించాలి అనే అంశంపై సీఎం స్వయంగా ముందస్తుగానే దళిత ఎమ్మెల్యేలకు మార్గదర్శనం చేసినట్లు సమాచారం.ఇక స్పీకర్ ను తిట్టిన అంశంపై సభలో డిస్కషన్ జరుగుతున్న సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలు 22ఏ టాఫిక్ పై నిరసనకు దిగారు. సీఎం, లెజెస్లేటివ్ మంత్రులు ఎన్నిసార్లు చెప్పినా..ఆయా ఎమ్మెల్యేలు తమకు కేటాయించినట్లు సీట్లలో కూర్చోకపోవడం గమనార్హం.

Also read: ఉప్పునీటి సరస్సును చీల్చుకుంటూ దూసుకెళ్లిన వందే భారత్.. చూస్తే కళ్ళు చెదిరి పోవాల్సిందే!

బీజేపీ వ్యవహరించే తీరు..

Advertisement

ఈ నేపథ్​యంలో సభలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)సభ్యుల వ్యూహాలను,నిరసనలను కట్టడి చేసేందుకు సీనియర్ నాయకుడు కడియం శ్రీహరికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ఆయన అనుభవాన్ని ఉపయోగించి బీజేపీ సభ్యుల ప్రతిపాదనలను, విమర్శలను కౌంటర్ చేసేలా ప్లాన్ చేశారు. స్పీకర్ పై విమర్శలు అనేవి చాలా పెద్ద అంశమని, దీన్ని బీజేపీ లెజెస్లేటివ్ పార్టీ ఖండించడం సంతోషమేనని, కానీ ఇలాంటి ఫీక్ సందర్భంలో 22ఏ తెరమీదకు తీసుకువచ్చి హాడావిడి చేయడం వలన దళిత సామాజిక వర్గాలు, సొసైటీల్లో బీజేపీపై రాంగ్ మేస్సేజ్ వెళ్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన వ్యాఖ్యలతో బీజేపీ ఎమ్మెల్యేలు అవాక్కయ్యేలా మాట్లాడారు. దీంతో బీజేపీ శాసన సభ పక్ష నాయకుడు ఏలేటి మహేశ్​వరరెడ్డి అండ్ టీమ్ వెంటనే వెళ్లి తమ స్థానాల్లో కుర్చున్నారు. అంతకంటే ముందు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు చెప్పిన వినని బీజేపీ ఎమ్మెల్యేలు కడియం చెప్పగానే వెళ్లి తమ సీట్లలో కూర్చోవడం గమనార్హం. బీజేపీ వ్యవహరించే తీరును ఆయా ఎమ్మెల్యే అసెంబ్లీ సెగ్మెంట్లలోని దళిత సామాజిక వర్గం పరిశీలిస్తుందని కడియం చిక్కుల్లోకి నెట్టారు.

సెన్సిటివ్ గా సీతక్క.. అప్పటికప్పుడు మద్ధతు..

ఇక స్పీకర్ పై బీఆర్ ఎస్ సభ్యులు చేసిన కామెంట్లతో మంత్రి సీతక్క తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. స్పీకర్ తో తనకు ఉన్న బంధాన్ని గుర్తుచేసుకుంటూ సభలో ఎమోషనల్ అయ్యారు. ఇదే సందర్భంలో స్పీకర్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సంఘటనతో తెలంగాణలో ని దళిత సామాజిక వర్గం అంతా ఏకం అయ్యేలా కనిపిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాల్లోనూ బీఆర్ ఎస్ వైఖరిపై తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. సీఎం ఆదేశాలతో స్పీకర్ పర్మిషన్ తో సీతక్క ఈ అంశంపై మాట్లాడారు. ఇక నుంచి ప్రజల్లోని సున్నితమైన అంశాలపై సభలో మంత్రి సీతక్క అత్యధికంగా ప్రసంగించేందుకు ఆసక్తి చూపనున్నారు. బీఆర్ ఎస్ సభ్యులు చేసిన వ్యాఖ్యలను ఎంఐఎంతో కూడా ఖండిచేలా చేయాలని భావించిన సీఎం..ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను ఆయన సీట్ వద్దకు పంపి విషయాన్ని వివరించారు. అంగీకరించిన ఎంఐఎం ఎమ్మెల్యే బలాలా బీఆర్ ఎస్ సభ్యుల విధానాన్ని తప్పుపట్టారు.

విప్‌ల ద్వారా కమ్యూనికేషన్ .. స్లిప్‌ల లీకేజ్

సభ జరుగుతున్న సమయంలోనే విప్‌ల ద్వారా సమాచార మార్పిడి శరవేగంగా జరుగుతోంది. సభలో చర్చలు జరుగుతున్నప్పుడే ఒక్కో సభ్యుడిని ఎంపిక చేయడం, వారికి సభలో మాట్లాడేందుకు విప్‌ల ద్వారా సీఎం స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ పంపిస్తున్నారు. స్పీకర్ పై విమర్శల అంశంలో అధికార పార్టీ సభ్యులు మాట్లాడుతున్న సమయంలోనే బీఆర్ ఎస్ గతంలో వ్యవహరించిది? దళిత సామాజిక వర్గం సొసైటీ కోసం ఏం చేసింది? రాజ్యాంగం వంటి అంశాలను ప్రస్తావించేలా సీఎం విప్ ల ద్వారా సభ్యులకు స్లిప్ లు పంపించారు. సభలో చర్చల తీరును సీఎం గమనిస్తూ, తదుపరి ఎవరు మాట్లాడాలి? ఏ విషయమై నిలదీయాలి? అనే అంశంపై సభ్యులను విప్‌ల ద్వారా తక్షణమే అలర్ట్ చేస్తున్నారు.

Also read: సైబర్ ఫ్రాడ్‌లో డబ్బు పోయిందా? ప్రభుత్వ పోర్టల్‌లో ఇలా రిఫండ్ కోసం అప్లై చేసుకోండి!

Tags

Related News

రచ్చ రాజకీయానికి ఆజ్యం పోసిందెవరు? అసెంబ్లీ సెషన్స్‌ను బీఆరెస్‌ బహిష్కరించాలనుకుందా..? ఇదంతా పక్కా ప్లానింగేనా? అసెంబ్లీ ముందు హైడ్రామా..హంగామా అందుకేనా?

కేసీఆర్ డైరెక్షన్‌లోనే స్పీకర్‌పై బూతుల పర్వం.. అసలు మ్యాటర్ అదేనా..?

ఇంకా ఇప్పటికీ అదే అహంకారమా? తప్పు జరిగితే .. మాట దొర్లితే పశ్చాత్తాపమేదీ? బీఆరెస్ నేతల తీరుపై నెగిటివ్ కామెంట్స్..

గ్రాండ్ సక్సెస్ సాధించిన టీపీసీసీ చీఫ్.. మహేష్ కుమార్ గౌడ్ ప్రయాణంలో నిలిచిన టాప్ ప్రోగ్రామ్స్ ఇవే!

ఫామ్‌హౌజ్‌కేదీ ప్ర‌శాంత‌త‌? కేటీఆర్ డైరెక్ష‌న్‌లో కంట్రోల్ త‌ప్పిన స‌భ్యులు..! ద‌ళిత వ్య‌తిరేక‌తను మూట‌గ‌ట్ట‌కున్న వైనం..

నోరు జారిన వైనం.. అనుచిత ప్ర‌వ‌ర్త‌న‌తో అభాసుపాలు..! ద‌ళిత స్పీక‌ర్‌పై ఇదేం వైఖ‌రి? చ‌ర్య‌ల‌కు డిమాండ్..

తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఆల్ రౌండ్ అటాక్.. కాంగ్రెస్‌ను కట్టడి చేసేందుకు 5 ప్రధాన అస్త్రాలు!

Big Stories

Advertisement
×