Youtuber Nandana: యూట్యూబర్ నందన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు .నందూస్ వరల్డ్ (Nandu’s World)అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా లక్షలాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈమె యూకే లో నివసిస్తున్నారు అయితే సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నందన (Nandana) మధుకర్ (Madhukar) దంపతులు ఎంతోమంది నిరుద్యోగులను విదేశాలలో స్థిరపడాలనుకునే వారిని పెద్ద ఎత్తున మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వీసా స్కామ్(Visa Scam) లో భాగంగా కోట్లాది రూపాయలు దోచుకున్నారంటూ వీరిపై పలు కేసులు నమోదు అయ్యాయి.
కొంతకాలంగా వీరిపై ఈ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నందన ఇండియా రావడంతో పోలీసులు ఈమెను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇలా ఈ వివాదాల అనంతరం నందన పై లుక్ అవుట్ నోటీసులు ఎత్తి వేయడంతో ఈమె తిరిగి యుకె వెళ్లిపోయారు. ఇలా యూకే వెళ్లిన ఈమె తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ గత 28 రోజులుగా ఈమె ఇండియాలో ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. మొదటిసారి వీసా స్కామ్ గురించి సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు.
ఈ వీడియోలో భాగంగా నందన మాట్లాడుతూ.. నాలుగు నెలల తర్వాత మిమ్మల్ని బాగున్నారా అని అడుగుతుంటే తనకు చాలా ఎమోషనల్ గా ఉందని తెలిపారు. గత4 నెలలుగా మా మీద తప్పుడు ప్రచారాలను చేస్తూ ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. వీసా స్కాం ఆరోపణల ద్వారా మాపై ఎంతో మంది బురద చల్లారని, ఈ అంశం గురించి తాను వందల వీడియోలు పెట్టినప్పటికీ మాపై దుష్ప్రచారం చేస్తూ వేల సంఖ్యలో వీడియోలు వందల సంఖ్యలో మీడియా వాళ్ళు మమ్మల్ని టార్గెట్ చేశారని నందన ఎమోషనల్ అయ్యారు. ఇప్పటికే ఈ విషయంపై తాము కోర్టులో కేసు వేసామని న్యాయం కోసమే ఎదురుచూస్తున్నామని తెలిపారు.
ఈ వీసా స్కాం ఆరోపణలలో భాగంగా కొన్ని వందల మంది మాకు పర్సనల్గా మెసేజ్లు చేసి ప్రశ్నిస్తున్నారని అయితే వాళ్ళు ఎవరో మాకు తెలియకుండా మేము వారికి సమాధానం చెప్పక సైలెంట్ అయ్యామని ఈమె తెలిపారు. ఇక ఈ విషయం గురించి ఇంతకు మించి తానే ఏమి మాట్లాడనని ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉన్న నేపథ్యంలో నేనేం చెప్పదలుచుకోలేదని తెలిపారు. మా గురించి దుష్ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్లు చేసిన వారిని నేను తప్పు పట్టను, ఎందుకంటే మా గురించి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చిందో నాకు తెలియదు అంటూ నందన తెలిపారు. మా గురించి ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోనని అసలు నిజం ఏంటి అనేది మాకు మాత్రమే తెలుసు అంటూ ఈమె షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ విభిన్న రీతిలో ఈ వీడియో పై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read: పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో తప్పు మాదే: సాయి ధరమ్ తేజ్