Youtuber Nandana: నందూస్ వరల్డ్ నందన ప్రస్తుతం వీసా స్కాం(Visa Scam) ఆరోపణలలో భాగంగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. యూకే లో నివసిస్తున్న నందన మధుకర్ దంపతులు యూట్యూబ్ ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు ఇలా సోషల్ మీడియా ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈ జంట డెస్టినీ కన్సల్టెన్సీ అని ప్రైవేట్ సంస్థ ద్వారా పెద్ద ఎత్తున నిరుద్యోగులను మోసం చేసి కోట్లలో డబ్బు వెనకేసుకున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని వీసా వెరిఫికేషన్ అంటూ ఎంతో మంది నిరుద్యోగ అభ్యర్థులను మభ్యపెడుతూ మోసం చేసినట్లు గతంలో వీరి గురించి ఆరోపణలు వచ్చాయి.
ఈ విధంగా నందన మధుకర్ చేసినటువంటి ఈ మోసాల పట్ల ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాలలో కేసులు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే నందన పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం ఆమె ఇటీవల హైదరాబాద్ రావడంతో పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. ఇక ఇటీవల ఈమె ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో విచారణకు కూడా హాజరైన సంగతి తెలిసిందే. ఈ విచారణలో భాగంగా నందన ఈ స్కామ్ గురించి నాకు ఎలాంటి సమాచారం తెలియదని ఈ వ్యవహారాలన్ని తన భర్త చూసుకుంటారు అంటూ ఈమె ఈ కుంభకోణంలో తన భర్త పేరును కూడా హైలెట్ చేసింది.
ఇకపోతే తాజాగా విచారణ అనంతరం ఈమె బయటకు రావడంతో మీడియా తనని పలకరించే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలోనే నందన మీడియాతో మాట్లాడుతూ మీడియాపై చిందులు వేశారు. ఇప్పటికే ఎంతోమంది బాధితులు కోట్ల రూపాయల మోసం చేశారు అంటూ ఆరోపిస్తున్నారు దానికి మీరేం సమాధానం చెబుతారు అంటూ నందనను మీడియా ప్రశ్నించడంతో ఆమె లాయర్ స్పందిస్తూ ఏ విషయమైనా ఆమె యూట్యూబ్ ఛానల్ ద్వారానే తెలియచేస్తారని చెప్పారు. మీడియా మాత్రం నందనను పదేపదే ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఆమె మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వీసా స్కాం కుంభకోణం పై మీరు ఏమి చెప్పదలుచుకున్నారు అంటూ ప్రశ్నించడంతో ఈ ప్రశ్నకు నందన సమాధానం చెబుతూ… నేనేమి చెప్పదలుచుకోవడం లేదు, నేను ఎలాంటి తప్పు చేయలేదు. అంతా మీరే చేస్తున్నారంటూ ఈమె మీడియాపై చిందులు వేశారు. ఇలా మీడియాని ఉద్దేశించి ఈమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కుంభకోణంలో భాగంగా తదుపరి విచారణ ఈ నెల 16వ తేదీ ఉండబోతుందని ఇబ్రహీంపట్నం సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇక స్కామ్ లో భాగంగా నందన మాత్రమే ఇండియాకి వచ్చారు .ఈమెపై లుక్ ఔట్ నోటీసులు ఉన్నప్పటికీ ఇండియా రావడం వెనక గల కారణం ఏంటనే చర్చ జరుగుతుంది అయితే ఈమె బిగ్ బాస్ వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని అందుకోసమే ఇండియా వచ్చి అడ్డంగా దొరికిపోయారంటూ వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి. ఇక నందన అరెస్ట్ అయినప్పటికీ తన భర్త మధుకర్ మాత్రం అజ్ఞాతంలోనే ఉన్నారని చెప్పాలి.
Also Read: టాక్సిక్ డిజాస్టర్ టాక్.. యశ్ ఫస్ట్ రియాక్షన్ ..ఏమన్నారంటే?