E-Paper
Advertisement

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో రూ. 4 కోట్ల హైడ్రోపోనిక్ గంజాయి పట్టివేత

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో రూ. 4 కోట్ల హైడ్రోపోనిక్ గంజాయి పట్టివేత
Advertisement

Bhogapuram Airport: విజయనగరం జిల్లాలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. విశాఖపట్నం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న హైడ్రోపోనిక్ గంజాయి బయటపడింది.

సింగపూర్ విమానంలో వచ్చి పట్టుబడిన నిందితుడు

Advertisement

కోల్‌కతాకు చెందిన మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ (36) అనే వ్యక్తి బ్యాంకాక్‌లో ఈ గంజాయిని సేకరించాడు. అక్కడి నుంచి సింగపూర్ మీదుగా ‘స్కూట్’ విమానంలో భోగాపురం విమానాశ్రయానికి చేరుకున్నాడు. అయితే, ఇతని రాకపై డీఆర్‌ఐ అధికారులకు ముందే పక్కా సమాచారం అందడంతో ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యేక వల పన్ని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

4 కిలోల సరుకు.. రూ. 4 కోట్ల విలువ

Advertisement

తనిఖీల సమయంలో నిందితుడి వద్ద ఉన్న లగేజీ నుంచి 4 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ దాదాపు రూ. 4 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

హైడ్రోపోనిక్ గంజాయి ప్రత్యేకత ఏమిటి?

సాధారణ గంజాయిలా కాకుండా, మట్టి లేకుండా కేవలం నీరు, కాంతి, ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలో ల్యాబ్‌లలో ఈ రకాన్ని సాగు చేస్తారు. దీనికి మత్తు కలిగించే తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో అంతర్జాతీయంగా భారీ డిమాండ్ ఉంది. ప్రస్తుతం నిందితుడు ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేసిన డీఆర్‌ఐ అధికారులు, ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న మిగతా నెట్‌వర్క్ మరియు ఎవరికి చేరవేసేందుకు తెచ్చారనే కోణంలో తీవ్రంగా విచారిస్తున్నారు.

Also Read: టికెట్ గొడవ.. కండక్టర్‌ను రన్నింగ్ బస్సులోంచి తోసేసిన మహిళ!

Tags

Related News

బుచ్చంపేటలో ఎంపీటీసీ ఏకగ్రీవంపై రచ్చ.. జక్కంపూడి రాజా ఎంట్రీతో మారిన సీన్!

సుప్రీంకోర్టు చెంపదెబ్బ కొట్టినా చంద్రబాబుకి బుద్ధి రాలేదు: కాకాణి గోవర్ధన్ రెడ్డి

కృష్ణానదిలో ఘోర ప్రమాదం.. నాటుపడవ మునిగి ఇద్దరు బాలురు దుర్మరణం!

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. రంగంలోకి సీబీఐ.. విజయవాడ కోర్టులో 102 పేజీల FIR!

ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. జేఈఈ మెయిన్స్-2027 రిజిస్ట్రేషన్ మొదలు, కీలక మార్పులివే

భోగాపురం నుంచి ఢిల్లీకి విమాన సర్వీసు.. పెరుగుతున్న కనెక్టివిటీ, ప్రయాణికుల్లో ఒకటే ఆనందం

విజయనగరం జిల్లా పరిషత్ ఎన్నికలు.. బొత్స వర్సెస్ చిన్న శ్రీను, సిరి సహస్ర నామినేషన్‌పై కొత్త వివాదం

Big Stories

Advertisement
×