E-Paper
Advertisement

రైల్లో క్యాన్సర్ పేషెంట్ మృతి.. 12 గంటల పాటు మృతదేహంతో ప్రయాణికుల అవస్థలు!

రైల్లో క్యాన్సర్ పేషెంట్ మృతి.. 12 గంటల పాటు మృతదేహంతో ప్రయాణికుల అవస్థలు!
Advertisement

Tragedy on Geetanjali Express: ముంబై నుంచి హౌరాకు వెళ్తున్న గీతాంజలి ఎక్స్‌ ప్రెస్‌ లో విషాద ఘటన జరిగింది. క్యాన్సర్‌ కు చికిత్స తీసుకుని సొంతూరుకు తిరిగి వెళ్తున్న 45 ఏళ్ల వ్యక్తి రైలులోనే మరణించాడు. అయితే, అతడి మృతదేహాన్ని రైలు నుంచి దించడానికి.. దాదాపు 12 గంటలు పట్టింది. మృతదేహం కోచ్‌లోనే ఉండటంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు.

రైలులోనే ప్రాణాలు కోల్పోయిన క్యాన్సర్ రోగి

బెంగాల్‌ లోని భట్‌ పారాకు చెందిన బినోద్ పాశ్వాన్ (45) ముంబైలోని టాటా మెమోరియల్ ఆసుపత్రిలో క్యాన్సర్‌కు చికిత్స పొందాడు. అనంతరం స్వస్థలానికి వెళ్లేందుకు గీతాంజలి ఎక్స్‌ ప్రెస్ (12859) ఎక్కాడు. అక్టోబర్ 24, శనివారం ప్రయాణిస్తుండగా ఎం-2 కోచ్‌లో అతడు ప్రయాణించాడు. ప్రయాణాన్ని ప్రారంభించిన కాసేపటికే అతడు చనిపోయాడు.  శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలోనే ఈ ఘటన గురించి టికెట్ ఎగ్జామినర్‌ (టీటీఈ)కు ప్రయాణికులు సమాచారం అందించారు. అయితే, మరణాన్ని నిర్ధారించేందుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని సిబ్బంది చెప్పారు. అయితే, చాలా గంటలు గడిచినా మృతదేహాన్ని కోచ్‌ నుంచి తొలగించలేదని ఆరోపించారు. రైలు సుమారు 12 గంటలు ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.

సోషల్ మీడియాలో ఫిర్యాదు.. రాత్రికి మృతదేహం తరలింపు!

Advertisement

సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో ఓ ప్రయాణికుడు రాత్రి 7 గంటల ప్రాంతంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశాడు. రైల్వే శాఖకు చెందిన ‘రైల్ మదద్’ ద్వారా కూడా మరికొంత మంది ఫిర్యాదు చేశారు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో రైలు జార్ఖండ్‌లోని టాటానగర్ జంక్షన్‌కు చేరుకుంది. అక్కడ వైద్యుడు పరీక్షించిన అనంతరం ప్రయాణికుడు మరణించినట్లు ప్రకటించారని రైల్వే అధికారి తెలిపారు. అనంతరం మృతదేహాన్ని రైలు నుంచి దించారు.

ప్రయాణికుల ఆరోపణలను ఖండించిన రైల్వే అధికారి

చక్రధర్‌ పూర్ రైల్వే డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఆదిత్య చౌదరి ఈ ఘటనపై స్పందించారు. రైలులో ఓ ప్రయాణికుడు అపస్మారక స్థితిలో ఉన్నట్లు రాత్రి 7.45 గంటలకు సమాచారం అందిందని తెలిపారు. టాటానగర్‌లో వైద్యుడు పరీక్షించిన తర్వాతే మరణాన్ని నిర్ధారించినట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు.

Advertisement

ఈ ఘటనతో రైల్వే సిబ్బందికి సమాచారం ఎప్పుడు అందింది. రైల్వే అధికారుల స్పందనలో ఎందుకు జాప్యం జరిగిందనే అంశాలపై ప్రశ్నలు తలెత్తాయి. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. త్వరలో అసలు వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి.

Read Also: గోల్డెన్ చారియట్ రైలులో తక్కువ ధరకే ప్రయాణం? ప్రభుత్వం అదిరిపోయే ప్లాన్!

Tags

Related News

గోల్డెన్ చారియట్ రైలులో తక్కువ ధరకే ప్రయాణం? ప్రభుత్వం అదిరిపోయే ప్లాన్!

ఢిల్లీలో కొత్త రూల్స్.. నవంబర్ 1 నుంచి ఆ వెహికల్స్ కు నో ఎంట్రీ!

లోకో పైలట్లకు జీరో ఆల్కహాల్ రూల్.. రైల్వే బోర్డు షాకింగ్ డెసిషన్!

బాబోయ్.. ఇది రైలా? హోటలా? ఇండియన్ రైల్వేపై ఫారిన్ కఫుల్ ప్రశంసలు!

జియో IPO వస్తే ఫ్రీగా కుల్ఫీ పార్టీ.. గోల్డెన్ అంకుల్ అదిరిపోయే ఆఫర్!

భోగాపురం నుంచి ఢిల్లీకి విమాన సర్వీసు.. పెరుగుతున్న కనెక్టివిటీ, ప్రయాణికుల్లో ఒకటే ఆనందం

హిమాలయాల్లో రైల్వే రూట్.. ఏకంగా 80 శాతానికి పైగా భూగర్భంలోనే!

Big Stories

Advertisement
×