RTC Conductor: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగుచూసింది. అశ్వాపురం మండలం మిట్టగూడెం సమీపంలో ప్రయాణిస్తున్న ఒక ఆర్టీసీ బస్సులో దారుణం జరిగింది. టికెట్ విషయమై చెలరేగిన చిన్న వివాదం చివరకు ప్రాణాల మీదికి తెచ్చింది.
అసలేం జరిగిందంటే?
మిట్టగూడెం వద్ద బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళకు, లేడీ కండక్టర్‌కు మధ్య టికెట్ తీసుకోవడంపై మాటమాట పెరిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రమవడంతో పరిస్థితి తోపులాట వరకు వెళ్లింది. ఈ క్రమంలో కోపంతో ఆ ప్రయాణికురాలు కండక్టర్‌ను బస్సు తలుపుల వద్ద నుంచి బయటకు నెట్టేసింది.
కాళ్లపై నుంచి వెళ్లిన బస్సు టైరు
మహిళ గట్టిగా తోసివేయడంతో బస్సు కదులుతున్న సమయంలోనే కండక్టర్ ప్రమాదవశాత్తు రోడ్డుపై పడిపోయారు. దురదృష్టవశాత్తు బస్సు వెనుక టైరు ఆమె కాళ్లపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు. రక్తం మడుగులో ఉన్న కండక్టర్‌ను చూసి బస్సులోని ప్రయాణికులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
Also Read: ORRపై ఘోర ప్రమాదం.. వాటర్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన వాహనం.. ఇద్దరు దుర్మరణం!
అత్యవసర చికిత్స
ప్రమాదాన్ని గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే స్పందించి, తీవ్ర గాయాల పాలైన కండక్టర్‌ను భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సాధారణ టికెట్ వివాదం ఈ స్థాయిలో కండక్టర్ ప్రాణాల మీదికి తీసుకురావడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కండక్టర్‌ను బస్సులో నుంచి తోసేసిన ప్రయాణికురాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెం వద్ద ఆర్టీసీ బస్సులో టికెట్ విషయంలో ప్రయాణికురాలికి, కండక్టర్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ తోపులాటలో ప్రయాణికురాలు నెట్టేయడంతో కండక్టర్ రోడ్డుపై పడిపోగా, బస్సు టైరు ఆమె… pic.twitter.com/oycYmaT4Ss
— BIG TV Breaking News (@bigtvtelugu) October 25, 2026