E-Paper
Advertisement

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు
Advertisement

Ambati Rambabu: గుంటూరు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వైసీపీ మేయర్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా మాజీ మంత్రి, వైసిపి ముక్కుసూటి నాయకుడు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. స్థానిక పోలీసుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. భవిష్యత్ రాజకీయ పరిణామాలపై సంచలన కామెంట్స్ చేశారు.

పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం

Advertisement

గుంటూరులో మేయర్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసే సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. అధికార పార్టీకి కొమ్ము కాస్తూ తమ పార్టీ కార్యకర్తలను, నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. చట్టాన్ని రక్షించాల్సిన వారే ఏకపక్షంగా వ్యవహరించడం సరైంది కాదని హితవు పలికారు.

మొదటి ఆరు నెలలు నేనే హోంమంత్రిని!

Advertisement

ఈ సందర్భంగా అంబటి రాంబాబు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ‘మరో రెండేళ్లలో రాష్ట్రంలో మళ్లీ మా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. వచ్చే వైసిపి ప్రభుత్వంలో మొదటి ఆరు నెలల పాటు నేనే రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపడతాను. ఆ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి, కక్షసాధింపులకు పాల్పడిన ప్రతి ఒక్కరి లెక్క తేలుస్తాను. ఎవరినీ వదిలిపెట్టే ప్రసంగే లేదు’ అని స్పష్టం చేశారు.

Also Read: నీళ్లు, నిధులు, నియామకాలు కేసీఆర్ ఇంట్లోనే : ఎంపీ చామల

అధికార మార్పిడి సహజమని, పోలీసులు చట్ట పరిధిలోనే పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అంబటి చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు స్థానిక నాయకుల్లోనూ, పోలీసు వర్గాల్లోనూ తీవ్ర కలకలం రేపాయి. గుంటూరు నామినేషన్ వేదికగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Tags

Related News

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. వైసీపీ దూరమంటూ పెద్దిరెడ్డి ప్రకటన, షాకైన కేడర్

సిగ్గు లేని రాజకీయాలు ఇంకెంత కాలం.. కాక్రోచ్‌కు వైసీపీ మద్దతు, టీడీపీ అలా అంటూ సాయిరెడ్డి కామెంట్స్

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీ కొన్న రెండు ట్రావెల్ బస్సులు.. నంద్యాల జిల్లాలో ఘటన

Big Stories

Advertisement
×