E-Paper
Advertisement

Gudivada Amarnath: అనకాపల్లిలో 100 కోట్ల భూ దోపిడీ.. ‘కూటమి’ గుట్టు రట్టు చేసిన అమర్నాథ్!

Gudivada Amarnath: అనకాపల్లిలో 100 కోట్ల భూ దోపిడీ..  ‘కూటమి’ గుట్టు రట్టు చేసిన అమర్నాథ్!
Advertisement

Gudivada Amarnath: అనకాపల్లి జిల్లాలో సంచలనం సృష్టిస్తున్న 100 కోట్ల దేవాదాయ భూమి స్కామ్‌పై మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వివాదాస్పద స్థలాన్ని స్వయంగా పరిశీలించిన ఆయన, ఈ భూ భాగోతం వెనుక కూటమి నాయకుల హస్తం ఉందని ఆరోపిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అనకాపల్లి పట్టణం నడిబొడ్డున ఉన్న విశాఖ కన్యకా పరమేశ్వరి దేవాలయానికి చెందిన ఎకరా 11 సెంట్ల భూమిని కాజేసేందుకు కుట్ర జరుగుతోందని అమర్నాథ్ పేర్కొన్నారు. మార్కెట్ విలువ ప్రకారం దీని ధర కోట్లలో ఉంటుందని ఆయన అంచనా వేశారు.

Advertisement

గతంలో ఎండోమెంట్ భూమిగా రికార్డుల్లో ఉన్న ఈ స్థలాన్ని, కూటమి నాయకుల ఒత్తిడితో అధికారులు జిరాయితీ భూమిగా మార్చేందుకు ఫైళ్లు కదిపారని ఆయన ఆరోపించారు. కౌలుదారులకు భూమిని అమ్మే లేదా దానం చేసే హక్కు లేదని గుర్తు చేస్తూ అధికారుల తీరును తప్పుబట్టారు.

సనాతన ధర్మంపై కూటమి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, తక్షణమే ఈ భూ కుంభకోణంపై సిబిఐ (CBI) ఎంక్వయిరీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. దొంగల ముఠా మాదిరిగా ప్రభుత్వ ఆస్తులను దోచుకుంటున్నారని విమర్శించారు.

Advertisement

అమర్నాథ్ మాట్లాడుతూ.. ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నా దేవాదాయ శాఖ అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ‘మేం చేసిన ఆరోపణలు తప్పయితే కూటమి నాయకులు ముందుకు వచ్చి సమాధానం చెప్పాలి’ అని సవాల్ విసిరారు.

చివరిగా.. ‘కర్మ ఎవరిని వదిలిపెట్టదు’ అని వ్యాఖ్యానిస్తూ, గతంలో తిరుపతి లడ్డూ అంశంపై రాజకీయం చేయాలని చూసిన వారికి ఇప్పుడు అదే శాపంగా మారుతోందని ఎద్దేవా చేశారు. దేవుడి భూములను కాజేయాలని చూస్తే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

Also Read:  సూరారంలో విషాద హోలీ.. చెరువులో మునిగి ఇద్దరు మైనర్ల మృతి

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×