E-Paper
Advertisement

ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!

ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!
Advertisement

Delhi Protest: దేశ రాజధానిలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన తిరంగ ర్యాలీని శుక్రవారం ఢిల్లీ పోలీసులు అడ్డుకున్న సంగతి తెలసిందే. తొలుత సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కేను ముందస్తుగా అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆపై నిరసనకు దిగిన ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) చీఫ్ నేహా బోరాను సైతం అదుపులోకి తీసుకున్నారు. అయితే శనివారం ఉదయం నేహా బోరాను పోలీసులు విడుదల చేశారు. అభిజిత్ దీప్కేను మాత్రం ఇవాళ సాయంత్రం స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరుస్తారని తెలుస్తోంది.

అభిజిత్ ఆచూకీపై గందరగోళం

మరోవైపు అభిజిత్ దీప్కే ఆచూకీ తెలియడం లేదని ఆయనను ఎక్కడ ఉంచారో లాయర్లకు కూడా చెప్పడం లేదని సీజేపీ లీగల్ హెడ్ రత్న సింగ్ ఆరోపించారు. ‘అభిజిత్ అరెస్టయ్యారు. కానీ ఆయన ఎక్కడ ఉన్నారో ఇంకా తెలియదు. లాయర్లను కూడా కలవలేకపోయారు’ అని ఆమె ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు.

Advertisement

Also Read: బీజేపీ అగ్రనేతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన ఎల్.కే. అద్వానీ.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

ఇదంతా తమను భయపెట్టడానికే: నేహా బోరా

విడుదలైన తర్వాత నేహా బోరా మీడియాతో మాట్లాడుతూ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి సరైన కారణాలు లేకుండానే గంటల తరబడి కస్టడీలో ఉంచుతున్నారని, సాధారణ ప్రజల్లో భయం సృష్టించేందుకే ఇలాంటి అక్రమ నిర్బంధాలను వాడుతున్నారని మండిపడ్డారు. ‘ఇది నిరసనకారులను భయపెట్టే ప్రయత్నం. కేవలం ఓటు హక్కు కోసం, జవాబుదారితనం కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సామాన్య పౌరులను రాత్రంతా పోలీస్ స్టేషన్లలో ఉంచడాన్ని ఎలాంటి సమర్థనా లేదు’ అని ఆమె అన్నారు. అభిజిత్ దీప్కేతో పాటు అరెస్టైన ఇతర నిరసనకారులందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అభిజిత్ ఇంటికెళ్లి నోటీసులు

Advertisement

ఇదిలా ఉంటే శుక్రవారం అభిజిత్ దీప్కే ఇంటికి వెళ్లిన ఢిల్లీ పోలీసులు.. ఆయనకు నోటీసులు జారీ చేశారు. తిరంగ యాత్రను నిలిపివేయాలని ఆదేశించారు. దీనిపై అభిజిత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాము ఎటువంటి హింసకు పిలుపునివ్వలేదని.. కేవలం చేతుల్లో జాతీయ జెండాను పట్టుకొని శాంతియుతంగా నిరసన ర్యాలీ తీస్తామని చెప్పారు. హింసను ప్రేరేపించినట్లు రుజువైతే ఉరి తీయాలని వ్యాఖ్యానించారు.

Also Read: భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

Tags

Related News

బీజేపీ అగ్రనేతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన ఎల్.కే. అద్వానీ.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

డేంజర్ బెల్స్.. ఏఐతో భారీగా పర్యావరణం విధ్వంసం.. ఎలానో తెలుసా..?

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కే ‘తిరంగా యాత్ర’ అడ్డుకున్న పోలీసులు.. ఇంటికెళ్లి నోటీసులు అందజేత!

అమ్మబాబోయ్.. 75 ఏళ్ల తాతతో 30 ఏళ్ల యువతి పెళ్లి.. నిశ్చితార్థం వీడియో వైరల్!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వేలో 1,688 ఖాళీలు, సాలరీ, దరఖాస్తు పూర్తి వివరాలివిగో

Big Stories

Advertisement
×