E-Paper
Advertisement

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!
Advertisement

2026 Audi Q3: ఆడి ఇండియా కొత్త 2026 క్యూ3 లగ్జరీ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ. 51.99 లక్షలుగా నిర్ణయించింది. ఈ ఎస్‌యూవీ నోవా, జెనిత్ అనే రెండు వేరియంట్లతో అందుబాటులో ఉంటుంది. టాప్ వేరియంట్ జెనిత్ ధర రూ. 55.99 లక్షలుగా ఫిక్స్ చేసింది. కొత్త క్యూ3లో డిజైన్ మార్పులతో పాటు అధునాతన ఫీచర్లు, డిజిటల్ డిస్‌ ప్లేలు, పనోరమిక్ సన్‌ రూఫ్ ఉన్నాయి. ఇందులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు క్వాట్రో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను అందించారు.

కొత్త డిజైన్‌తో ఆడి క్యూ3

న్యూ జెనరేషన్ ఆడి క్యూ3 క్రేజీగా ఆకట్టుకునేలా రూపొందించారు. ఇందులో స్ప్లిట్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, డిజిటల్ మ్యాట్రిక్స్ ఎల్‌ఈడీ లైటింగ్, హనీకోంబ్ డిజైన్‌తో కూడిన పెద్ద ఫ్రంట్ గ్రిల్ ఉన్నాయి. 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, సన్నని రూఫ్ రైల్స్, క్రోమ్ విండో లైన్ దీనికి మరింత అందాన్ని తీసుకొస్తున్నాయి. వెనుక భాగంలో స్ప్లిట్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు, వాటిని కలిపే సన్నని లైట్ బార్, లైటింగ్ ఆడి లోగో వావ్ అనిపిస్తున్నాయి.

ఇంటీరియర్, ఫీచర్ల గురించి.. 

Advertisement

క్యాబిన్‌ లో రెండు డిజిటల్ స్క్రీన్లు ఆకట్టుకుంటున్నాయి. ఇందులో 12.8 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌ స్క్రీన్, 11.9 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. నాలుగు స్పోక్‌ల హెక్సాగనల్ స్టీరింగ్ వీల్, వైర్‌ లెస్ ఫోన్ ఛార్జింగ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ లాంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. పనోరమిక్ సన్‌రూఫ్, 3 జోన్ క్లైమేట్ కంట్రోల్, 12 స్పీకర్ల సోనోస్ ఆడియో సిస్టమ్, హెడ్‌అప్ డిస్‌ప్లే, పవర్డ్ టెయిల్‌ గేట్ ఉన్నాయి. ముందు సీట్లకు పవర్ అడ్జస్ట్‌ మెంట్, హీటింగ్ సదుపాయాలను అందిస్తున్నారు. సేఫ్టీ కోసం తొమ్మిది ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ కెమెరా, హిల్ అసిస్ట్ ఫీచర్లు, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) అందించారు.

ఇంజిన్, పనితీరు గురించి..

2026 ఆడి క్యూ3లో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 204 హెచ్‌పీ పవర్, 320 ఎన్ఎం టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ను 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ తో యాడ్ చేశారు. క్వాట్రో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా 4 వీల్స్ కు పవర్ ను అందిస్తుంది. ఈ ఎస్‌యూవీ కేవలం 7.1 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్ఠ వేగం గంటకు 229 కిలోమీటర్లుగా ఉంటుంది.

బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ కార్లకు పోటీ

Advertisement

కొత్త ఆడి క్యూ3 భారత్ లోనే అసెంబుల్ అవుతోంది. ఈ మోడల్ బీఎండబ్ల్యూ ఎక్స్1, మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌ఏ వంటి లగ్జరీ ఎస్‌యూవీలకు పోటీగా నిలుస్తుంది.

Read Also: ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

Tags

Related News

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

కారులో రాకెట్ టెక్నాలజీ.. స్పేస్‌ ఎక్స్‌ తో టెస్లా కొత్త ప్రయోగం చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా XUV 3XO సరికొత్త రికార్డు.. 5 లక్షలు దాటిన సేల్స్!

మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ. 1.65 లక్షల తగ్గింపు!

Big Stories

Advertisement
×