AP Seat Sharing: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై కూటమిలో క్లారిటీ వచ్చింది. 17 కార్పొరేషన్లలో టీడీపీకి 11, జనసేనకు 4. బీజేపీకి 2 సీట్లు ఖరారయ్యాయి. మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో మొత్తం 123 స్థానాల్లో టీడీపీ 89 జనసేన 25, బీజేపీ 9 చోట్ల పోటీ చేయాలని నిర్ణయించారు. కాకినాడ, ఏలూరు, విజయవాడ, శ్రీకాకుళం వంటి మెయిన్ కార్పొరేషన్లు జనసేనకు దక్కాయి.
పొత్తులో భాగంగా పిఠాపురంలో పరిధిలోని గొల్లప్రోలు చైర్మన్ సీటు జనసేనకు కేటాయించడంతో టీడీపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. అన్ని వార్డుల్లోనూ టీడీపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో టీడీపీ నేత శ్రీధర్ మున్సిపల్ చైర్మన్ సీటును ఆశించారు. కానీ పొత్తులో భాగంగా జనసేనకు ఖరారు చేయడంతో శ్రీధర్ అనుచరులు రోడ్డెక్కారు. శ్రీధర్కు ఛాన్స్ ఇవ్వకపోతే టీడీపికి రాజీనామా చేస్తామని అల్టిమేటమ్ జారీ చేశారు.
వాయిస్: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ సీటును బీజేపీకి కేటాయించడాన్ని స్థానిక జనసేన క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సమన్వయంతో ముందుకెళ్లాలన్నా పార్టీ హైకమాండ్ ఆదేశాలను కాదని కర్రీ ఝాన్సీ జనసేన రెబల్ నామినేషన్ వేశారు. కాకినాడ జిల్లా సామర్లకోట మున్సిపాలిటీ సీటును జనసేనకు కేటాయించడంపై టీడీపీ కార్యకర్తలు రోడ్డెక్కారు. తొలుత పెద్దాపురం మున్సిపాలిటీని జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరగగా.. అక్కడ టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. దీంతో కూటమి పెద్దలు సామర్లకోటను జనసేనకు కేటాయించారు. అయితే సామర్లకోటలో కూడా టీడీపీకే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు తెలుగు తమ్ముళ్లు.
కూటమి అభ్యర్థుల గెలుపుపై చర్చించేందుకు ఏలూరులో నిర్వహించిన టీడీపీ శ్రేణుల సమావేశంలో అంతర్గత పోరు బయటపడింది. ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మాట్లాడుతుండగా కొందరు టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో సమావేశంలో ఉద్రిక్తత ఏర్పడింది. సీఎం చంద్రబాబు అన్నీ గమనిస్తున్నారు.. ఒక్క నిమిషం అండి అంటూ అనురాధ వారిని సముదాయించారు.
శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని జనసేనకు కేటాయించడంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. గతంలో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవికి మేయర్ పదవి దక్కుతుందనే ప్రచారం జరిగింది. అయితే, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు టీడీపీ అధిష్ఠానం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి వైసీపీలో చేరబోతున్నట్లు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. కార్యకర్తలతో కలిసి లక్ష్మీదేవిని గెలిపించుకుందామని ధర్మాన పిలుపునిచ్చారు.
Also read: డేంజర్ బెల్స్.. ఏఐతో భారీగా పర్యావరణం విధ్వంసం.. ఎలానో తెలుసా..?