E-Paper
Advertisement

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?
Advertisement

El Niño Alert: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎల్‌నినో ప్రభావం గట్టిగానే ఉంది. పసిఫిక్ మహాసముద్రంలో వస్తున్న ఈ వాతావరణ మార్పుల వల్ల మనకు రావాల్సిన నైరుతి రుతుపవనాలు సరిగ్గా పడలేదు. దీనివల్ల ఎక్కడ చూసినా భారీగా వర్షపాత లోటు కనిపిస్తోంది. వాతావరణ నిపుణుల లెక్కల ప్రకారం.. ఈ ఎల్‌నినో దెబ్బ 2027 ఫిబ్రవరి వరకు పీక్ స్టేజ్‌లో ఉండేలా కనిపిస్తోంది.

సీఎం రేవంత్ రెడ్డి..

భూగర్భంలో నీళ్లు అడుగంటిపోవడం, చెరువులు, ప్రాజెక్టుల్లో నీరు తగ్గిపోవడం వల్ల రాబోయే ఎనిమిది నెలలు చాలా డేంజర్ అని వాతావరణ శాఖ గట్టిగానే హెచ్చరిస్తోంది. ఈ విపత్కర పరిస్థితిని చూసి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటికే అలర్ట్ అయ్యాయి. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి మీటింగ్ పెట్టి యాసంగిలో వరి సాగును వాయిదా వేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. అటు ఏపీలో సీఎం చంద్రబాబు తాగునీటికే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ఏం చేయాలి?..

Advertisement

మరి ఈ కష్టకాలంలో మనమంతా ఏం చేయాలి? రైతు సోదరులు కాస్త జాగ్రత్త పడాలి. ఎక్కువ నీరు తాగే వరి పంటకు బదులుగా, తక్కువ నీటితో పండే చిరుధాన్యాలు, ఆరుతడి పంటల వైపు మళ్లడం మంచిది. సాధ్యమైనంత వరకు డ్రిప్, స్ప్రింక్లర్ పద్ధతులు వాడి నీటిని వృథా చేయకుండా చూడాలి. వదంతులు నమ్మకుండా వ్యవసాయ అధికారుల సలహాలు మాత్రమే తీసుకోవాలి.

రీసైకిల్ చేసి..

ఇక సామాన్య ప్రజలు కూడా ఇప్పటి నుంచే నీటిని పొదుపుగా వాడటం అలవాటు చేసుకోవాలి. ఇళ్లలో కుళాయిలు లీక్ కాకుండా చూసుకోవడం, రీసైకిల్ చేసిన నీటిని మొక్కలకు పోయడం చేయాలి. ఎల్‌నినో దెబ్బకు ఎండలు పెరిగి కరెంట్ వినియోగం కూడా విపరీతంగా పెరుగుతోంది. అందుకే అవసరం లేకపోతే ఫ్యాన్లు, లైట్లు ఆపేసి కరెంట్ సేవ్ చేయాలి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంచినీళ్లు, ఓఆర్ఎస్, మజ్జిగ తాగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రకృతి మనకు విసురుతున్న ఈ సవాల్‌ను ఎదుర్కోవాలంటే ప్రభుత్వాలతో పాటు ప్రజలందరూ బాధ్యతగా కలిసి నడవాల్సిందే!

Advertisement

Also read: డేంజర్ బెల్స్.. ఏఐతో భారీగా పర్యావరణం విధ్వంసం.. ఎలానో తెలుసా..?

Tags

Related News

బెంగళూరు టూ విజయవాడ.. రూ. 11 లక్షల డ్రగ్స్‌తో దొరికిపోయిన విద్యార్థిని..?

ఏపీ స్థానిక పోరులో సీట్ల రచ్చ.. కూటమి హైకమాండ్‌ చర్యలు ఫలిస్తాయా..?

పుంగనూరు ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం.. నామినేషన్ పత్రాలు చింపివేత!

ఓడిపోతామనే భయంతో కూటమి హింసా రాజకీయం.. మాజీ మంత్రి రోజా ఫైర్!

ఏపీలో పంచాయతీ రాజ్ చట్టం సవరణ.. ఇద్దరికంటే ఎక్కువ పిల్లలున్నా పోటీకి అర్హులే!

నామినేషన్ల తొలిరోజు సీమలో టెన్షన్.. రాయచోటిలో టీడీపీ-వైసీపీ మధ్య దాడులు, తగలబెట్టిన కార్లు

పుంగనూరులో నామినేషన్ల తొలిరోజు.. టీడీపీ-వైసీపీ మధ్య రాళ్ల దాడులు, వాహనాలు ధ్వంసం-పలువురికి గాయాలు

Big Stories

Advertisement
×