AP Panchayat: పంచాయతీరాజ్ చట్ట సవరణ అమలుపై అధికారిక ఉత్తర్వులను కూటమి ప్రభుత్వం జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పేరిట నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏపీ పంచాయతీరాజ్ చట్ట సవరణకు సంబంధించి ప్రభుత్వం కీలక గెజిట్ నోటిఫికేషన్లో ఏపీ పంచాయతీరాజ్ చట్ట సవరణ చట్టం–2024కు 2025లో చట్టరూపం దాల్చింది. ఫిబ్రవరి 11, 2025 నుంచి చట్ట సవరణ అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది. దీంతో మార్చి 4, 2025న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన పంచాయతీరాజ్ శాఖ జీఓ ఎంఎస్ నంబర్ 19 ద్వారా చట్టం అమలుకు తేదీ ఖరారు చేసింది.
పంచాయతీరాజ్ చట్ట సవరణ అమలుపై అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పేరిట నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నా అనర్హతను ప్రభుత్వం తొలగించింది. దీంతో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న అభ్యర్థులకు ఊరట కల్పిస్తూ చట్ట సవరణ చేశారు.
ఏపీ పంచాయతీరాజ్ చట్ట సవరణకు 2025 మార్చి 4న గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. దీంతో ఫిబ్రవరి 11, 2025 నుంచి చట్ట సవరణ అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వ ప్రకటన చేసింది. జీఓ ఎంఎస్ నంబర్ 19 ద్వారా చట్ట అమలు తేదీని పంచాయతీరాజ్ శాఖ ప్రకటించిది. ఇద్దరి పిల్లల నిబంధనపై స్థానిక ఎన్నికల్లో అమలవుతున్న అనర్హత నిబంధనకు ముగింపుపలికింది. ఇకపై ఇద్దరికన్నా ఎక్కవ పిల్లలున్నవారు కూడా స్థానికి ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులుగా పేర్కోంది.
Also read: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. రైల్వేలో 1,688 ఖాళీలు, సాలరీ, దరఖాస్తు పూర్తి వివరాలివిగో