Roja Allegations: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. నామినేషన్లకు వేయడానికి వెళ్తున్న వైసీపీ అభ్యర్థులపై కూటమి నేతలు దాడులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దీంతో అలా చేసిన వారిని మాజీ మంత్రి రోజా తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కూటమి హింసా రాజకీయాలు చేస్తున్నారని అఫైర్ అయ్యారు.
రెండుసార్లు ఎంపీగా గెలిచిన మిథున్ రెడ్డిపై దాడి దురదృష్టకరం అని, మిథున్ రెడ్డిపై దాడి పోలీసు వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం అంటూ ఫైర్ అయ్యారు. సీఎం సొంత జిల్లాలోనే దాడులు జరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వం దాడులకు పాల్పడిన వారిపై న్యాయస్థానాలు సుమోటోగా స్పందించాలని రొజా డిమాండ్ చేశారు. దాడులకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రోజా డిమాండ్ చేశారు.
నామినేషన్లకు వెళ్లే అభ్యర్థులు, నాయకులకు తక్షణమే రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అభ్యర్థుల భద్రతపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. రాష్టంలో ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రోజా కూటమి ప్రభుత్వానికి ఇటు ఎన్నికల అధికారలను డిమాండ్ చేశారు.
Also read: శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!