Navratri Recipes: నవరాత్రి తొమ్మిది రోజులు పూజలతో పాటు ఉపవాసాలు, ప్రత్యేక పిండి వంటలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిరోజూ పూజ ముగిశాక ఏదో ఒక కొత్త రకం నైవేద్యం లేదా ఫలహారం చేసుకోవడం మన సంప్రదాయం. అయితే ఉపవాస సమయాల్లో ఎలాంటి వంటలు చేసుకోవాలి, రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే వంటకాలు ఏమున్నాయా అని చాలామంది ఆలోచిస్తుంటారు. ప్రతిసారీ ఒకే రకమైన రొటీన్ పదార్థాలు కాకుండా.. ఈసారి పండుగ వాతావరణానికి తగినట్లుగా కాస్త కొత్తగా, ప్రముఖ చెఫ్లు సూచించిన ప్రత్యేక వంటకాలను ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు. తీపి, కారం కలగలిపిన ఈ మూడు ప్రత్యేక వంటకాలు నవరాత్రి విందును మరింత ప్రత్యేకంగా మారుస్తాయి.
తూర్పు భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ తీపి వంటకాన్ని చాలా తేలికగా చేసుకోవచ్చు. బియ్యప్పిండిని వేడి నీటితో తడుపుకుని మెత్తటి ముద్దలా కలుపుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి తురుము, బెల్లం, యాలకుల పొడిని స్టవ్ మీద కాస్త వేయించి రసవత్తరమైన పూర్ణం తయారుచేసుకోవాలి. బియ్యప్పిండి ముద్దను చిన్న పూరీలా ఒత్తి, అందులో ఈ కొబ్బరి పూర్ణం పెట్టి గుజియా లేదా నచ్చిన ఆకారంలో చుట్టుకోవాలి. వీటిని ఆవిరిపై ఒక 20 నిమిషాల పాటు ఉడికిస్తే ఎంతో రుచికరమైన ఆవిరి పిఠా సిద్ధమవుతుంది. ఉడికిన వెంటనే వీటిపై కాస్త చల్లటి నీళ్లు చల్లితే ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా వస్తాయి.
Also Read: బ్యాచిలర్స్ కేవలం 15 నిమిషాల్లో చేసుకునే దాబా స్టైల్ పెప్పర్ చికెన్!
ఉపవాస రోజుల్లో శరీరానికి శక్తిని, చలువను అందించే అద్భుతమైన వంటకం సొరకాయ హల్వా. ముందుగా బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి తురిమిన సొరకాయను పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఆ తర్వాత పాలు పోసి, సొరకాయ మెత్తగా ఉడికే వరకు మరిగించాలి. మిశ్రమం కాస్త దగ్గరపడ్డాక చక్కెర, కోవా వేసి బాగా కలపాలి. కోవా కరిగి హల్వా చిక్కబడిన తర్వాత యాలకుల పొడి, జీడిపప్పు, బాదం, పిస్తా ముక్కలు చల్లుకుంటే ఎంతో రుచికరమైన సొరకాయ హల్వా రెడీ అవుతుంది. వేడివేడిగా తింటే దీని రుచి అద్భుతంగా ఉంటుంది.
సాంప్రదాయ వంటకాలకు కాస్త ఆధునిక స్పర్శ జోడించాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. వేయించిన మఖానా పొడి, ఉడకబెట్టిన బంగాళాదుంప, రాజ్గిరా పిండి, సైంధవ లవణం కలిపి టార్ట్ బేస్ తయారుచేసి బేక్ చేసుకోవాలి. మరోవైపు నెయ్యిలో అల్లం, పచ్చిమిర్చి, టమాటో ప్యూరీ, జీడిపప్పు పేస్ట్ వేసి వేయించాలి. అందులోనే పనీర్ ముక్కలు, ఫ్రెష్ క్రీమ్, మసాలాలు వేసి చిక్కటి మఖానీ గ్రేవీ తయారుచేసుకోవాలి. ఇప్పుడు బేక్ చేసిన క్రిస్పీ టార్ట్ కప్పులలో ఈ వేడివేడి పనీర్ కూరను నింపి, పైన కొద్దిగా మఖానా పొడి, కొత్తిమీరతో గార్నిష్ చేసి వడ్డిస్తే నవరాత్రి ప్రత్యేకమైన కారంగా ఉండే డిష్ సిద్ధమవుతుంది.
Also Read: సాయంత్రం వేళ వేడివేడిగా ముంబై పావ్ భాజీ.. పర్ఫెక్ట్ రుచి కోసం ఈ టిప్స్ ఫాలో అయిపోండి!