Big Stories

Avinash Reddy : మరోసారి విచారణకు అవినాష్ రెడ్డి దూరం.. సీబీఐ యాక్షన్ పై టెన్షన్..

Avinash Reddy Latest News(AP breaking news today): వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తు ఉత్కంఠ రేపుతోంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి విచారణ డుమ్మా కొట్టారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండగా.. అవినాష్ రెడ్డి రాలేదు. చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చారు. తల్లి శ్రీలక్ష్మి అనారోగ్యం కారణంగా చూపుతూ హైదరాబాద్ నుంచి పులివెందులకు వెళ్లిపోయారు. ఇదే విషయాన్ని సీబీఐకు లేఖ ద్వారా తెలియజేశారు. తాను విచారణకు రావడంలేదని పేర్కొన్నారు.

- Advertisement -

ఎంపీ తరఫు న్యాయవాదులు సీబీఐ కార్యాలయానికి వెళ్లి లిఖిత పూర్వకంగా సమాచారం ఇచ్చారు. గుండెపోటు రావడంతో తనతల్లిని పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో చేర్చినట్లు లేఖలో అవినాష్‌ తెలిపారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని తన ఇంటి నుంచి సీబీఐ కార్యాలయానికి అవినాష్‌రెడ్డి బయల్దేరగా.. తల్లిని ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం వచ్చిందని ఆయన తరఫు న్యాయవాది మల్లారెడ్డి చెప్పారు. తండ్రి భాస్కర్‌రెడ్ది జైల్లో ఉండటంతో తల్లిని అవినాష్ రెడ్డే చూసుకోవాల్సి ఉందని న్యాయవాది తెలిపారు.

- Advertisement -

మరోవైపు  అవినాష్‌రెడ్డి అనుచరులు విధ్వంసం సృష్టించారు. హైదరాబాద్‌లో ఓ మీడియా సంస్థకు చెందిన వాహనంపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. పులివెందుల వెళ్తున్న అవినాష్‌ వాహనాన్ని మీడియా వాహనం అనుసరించింది. ఈ క్రమంలో ఎంపీ అనుచరులు ఆ వాహనంపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో రిపోర్టర్‌కు గాయాలయ్యాయి. వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి.

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో శుక్రవారం కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయని ముందే వార్తలు వచ్చాయి. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను వెకేషన్‌ బెంచ్‌కి ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ విచారణ తేదీ ఖరారులేదు. దీంతో అవినాష్‌రెడ్డికి దారులు మూసుకుపోయాయని న్యాయనిపుణులు అంటున్నారు. అలాగే వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని సహ నిందితుడిగా కోర్టుకు సమర్పించిన నివేదికలో సీబీఐ పేర్కొంది.

మరోవైపు అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పులివెందుల నుంచి హైదరాబాద్‌కు ఎంపీ అనుచరులు భారీగా తరలివచ్చారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి తిరిగి పులివెందులకు వెళ్లడంతో
సీబీఐ తీసుకునే తీసుకుని స్టెప్ పై ఉత్కంఠ నెలకొంది.

ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని సీబీఐ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీచేసింది. అయితే తనకు ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయని ఆ రోజు అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కాలేదు. పులివెందులకు వెళ్లిపోయారు. విచారణకు హాజరయ్యేందుకు 4 రోజుల గడువు కావాలని సీబీఐకి లేఖ రాశారు. అదే రోజు సీబీఐ మరోసారి అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19న తప్పకుండా విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. జూన్ 30 లోపు వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గడువు విధించింది. ఈ నేపథ్యంలోనే సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News