Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన 5 సంవత్సరాల బాలుడి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కన్న తల్లే హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. కే సముద్రం మండలం నారాయణపురం గ్రామంలో పందుల శిరీష(25) ఉపేంద్ర అనే వ్యక్తిని ప్రేమించి 7 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. కొంత కాలం సజావుగా సాగింది వాళ్ల సంసారం. వీళ్లకి ఇద్దరు కుమారులు మనీష్(5), నిహాల్(2)ఉన్నారు.
ఉపేంద్ర మద్యానికి బానిస అవ్వడంతో గొడవలు మెుదలయ్యాయి. దీంతో పిల్లలను, శిరీష ను పట్టించుకునేవాడు కాదు. శిరీష పై అనుమానంతో ఉండేవాడు. దీంతో శిరీష ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. పిల్లల్ని చంపి తాను కూడా చనిపోదామని అనుకుంది.
అనుకున్న ప్రకారం జనవరి 15న నిహాల్‌ను నీటి సంపులో పడేసి చంపింది. సెప్టెంబర్ 24వ తేదీన మనీష్ మెడకు నైలాన్ తాడును బిగించి అతి కిరాతకంగా హత్య చేసింది. సమాచారం తెలుసుకున్న తండ్రి ఘటన స్థలికి వచ్చాడు. కొడుకు మెడపై ఉరి ఆనవాలు కనిపించాయి. అనుమానంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వారి శైలిలో విచారణ చేపట్టగా శిరీష చేసినట్టు తేలింది. పోలీసులు శిరీషపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.