BigTV English

Devara 2: దేవర 2 వున్నట్టే.. మరి సెట్ పైకి వెళ్ళేదెప్పుడు ?

Devara 2: దేవర 2 వున్నట్టే.. మరి సెట్ పైకి వెళ్ళేదెప్పుడు ?

Devara 2: సరిగ్గా ఏడాది క్రితం జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నటించిన దేవర (Devara) మూవీ విడుదలై బాక్సాఫీస్ ని షేక్ చేసింది. దేవర సినిమాలో ఎన్టీఆర్ నటనకి ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చాయి. ఇందులోని పాటలు, ఎన్టీఆర్ యాక్టింగ్ ప్రతి ఒక్కటి అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొల్పింది. అలా దేవర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి.. దాదాపు 600 కోట్ల కలెక్షన్స్ సాధించింది. అలాగే రాజమౌళి డైరెక్షన్లో చేసిన ఏ హీరో నైనా తర్వాత చేసే ప్రాజెక్టు డిజాస్టర్ అవుతుంది అనే సెంటిమెంట్ కి దేవర మూవీ బ్రేక్ వేసింది. అలా కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ ఆర్ట్స్,యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ లో మిక్కిలినేని సుధాకర్ నిర్మించిన ఈ మూవీ అద్భుతమైన హిట్ కొట్టింది.


దేవర క్లైమాక్స్ లో దేవర 2..

అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో దేవర పార్ట్ -2 కూడా ఉంటుంది అని హింటిచ్చారు. అయితే ఏడాది గడుస్తున్నా కూడా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అనౌన్స్మెంట్ కూడా రాలేదు. చివరికి ఈ సినిమా అటకెక్కినట్లే అని చాలామంది భావించారు కూడా.కానీ దేవర సినిమా విడుదలై ఏడాది పూర్తయిన నేపథ్యంలో తాజాగా దేవర-2కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు చిత్ర యూనిట్. మరి దేవర-2 సినిమా ఉన్నట్టా లేనట్టా అనేది ఇప్పుడు చూద్దాం.. తాజాగా ఎన్టీఆర్ ఆర్ట్స్ అఫీషియల్గా దేవర-2పై ఒక ట్వీట్ చేశారు.

also read:Bigg Boss 9 Promo: లత్కోర్ హరీష్.. ఇచ్చి పడేసిన నాగ్.. ఇకనైనా మారండ్రా బాబు!


దేవర 2 పై బిగ్ అప్డేట్ ఇచ్చిన ఎన్టీఆర్ ఆర్ట్స్..

అందులో ఏముందంటే.. “ప్రతి తీరాన్ని తాకి అలజడి సృష్టించి సంవత్సరం దాటింది. అప్పటినుండి దేవరను ప్రపంచం గుర్తు పెట్టుకుంది. అది సంపాదించిన భయం అయినా ప్రేమ అయినా వీధులు ఎప్పటికీ మర్చిపోలేవు. మ్యాన్ ఆఫ్ మాసెస్ దేవర 2 కోసం రెడీ అవ్వండి..అతి త్వరలో ఈ సినిమా నుండి మరిన్ని అప్డేట్స్ రాబోతున్నాయి” అంటూ ట్వీట్ పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారడంతో చాలామంది ఎన్టీఆర్ అభిమానుల్లో దేవర-2 పై మళ్ళీ ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటికే దేవర-2 కి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ ని కూడా కొరటాల శివ రెడీ చేసి పెట్టుకున్నారట. కానీ ఎన్టీఆర్ డేట్స్ ఇవ్వడమే మిగిలిందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కి డేట్స్ ఇచ్చారు. ప్రశాంత్ నీల్ తో ఆయన డ్రాగన్ మూవీ చేస్తున్నారు.

అప్పుడే షూటింగ్ ప్రారంభం..

ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు కూడా. ఇక ఈ సినిమా షూటింగ్ ముగిసిన వెంటనే.. ఎన్టీఆర్ దేవర -2 షూటింగ్లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది..అలాగే దేవర 2 లో ఎన్టీఆర్,జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, షైన్ టైం చాకో లతో పాటు బాలీవుడ్ స్టార్ హీరోలలోని రణవీర్ సింగ్ లేదా రణబీర్ కపూర్ లలో ఎవరో ఒక హీరో దేవర-2 లో కనిపించబోతున్నట్టు రీసెంట్గా కొరటాల శివ ఒక హింట్ ఇచ్చారు. అలా ఫైనల్గా దేవర-2 రాబోతుంది సిద్ధం కండి అని ఎన్టీఆర్ ఆర్ట్స్ పెట్టిన ట్వీట్ తో ఎన్టీఆర్ అభిమానుల్లో సందడి మొదలైపోయింది.మరి ఈ సినిమా ఈ ఏడాది చివర్లో కల్లా షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చే ఏడాదిలో విడుదలవుతుందా అనేది ముందు ముందు చూడాలి.

Related News

Puri – Sethupathi: పూరి – సేతుపతి మూవీకి వెరైటీ టైటిల్… అసలు ఈ థాట్ ఎలా వచ్చిందో ?

Lokah: Chapter 2: ‘లోకా’ పార్ట్‌ 2 అప్‌డేట్‌ వచ్చేసింది.. సూపర్‌ హీరోగా దుల్కర్‌, విలన్‌గా టోవినో థామస్‌!

Sai Pallavi: ఏది ఇప్పుడు చెప్పండ్రా.. సాయిపల్లవి బికినీ వేసుకుందని..

Allu Arjun: ఏం బన్నీ.. ఓజీ చూడడమేనా.. రివ్యూ ఇచ్చేదేమైనా ఉందా.. ?

OG Child Artist: ఓజీ కూతురు బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా.. ఆదాయం కూడా అదే రేంజ్‌లో!

Ameesha Patel: ఆ హీరో ఒప్పుకుంటే.. ఒక రాత్రి గడపాలని ఉంది

The Paradise: షికంజా మాలిక్ గా మోహన్ బాబు.. ఏం లుక్ రా బాబు.. నెక్స్ట్ లెవెల్ అంతే

Big Stories

×