BigTV English

Bigg Boss 9 Promo: లత్కోర్ హరీష్.. ఇచ్చి పడేసిన నాగ్.. ఇకనైనా మారండ్రా బాబు!

Bigg Boss 9 Promo: లత్కోర్ హరీష్.. ఇచ్చి పడేసిన నాగ్.. ఇకనైనా మారండ్రా బాబు!

Bigg Boss 9 Promo:బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ ఊహించని రేటింగ్ సొంతం చేసుకుంటున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అటు హిందీలో 19వ సీజన్ నడుస్తూ ఉండగా.. ఇటు కన్నడలో కూడా 8 సీజన్లు పూర్తి చేసుకుంది. అంతేకాదు తమిళ్, మలయాళం భాషల్లో కూడా ఈ షో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇక తెలుగు విషయానికి వస్తే.. 8 సీజన్లు పూర్తికాగా ఇప్పుడు 9వ సీజన్ కూడా ప్రారంభం అయిపోయింది. అందులో భాగంగానే మూడవ వారం చివరి దశకు కూడా చేరుకుంది.


సందడి చేసిన నాగార్జున..

సాధారణంగా వీకెండ్స్ లో హోస్ట్ నాగార్జున వచ్చి సందడి చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఎప్పటిలాగే ఈ మూడో వారానికి సంబంధించి వీకెండ్ లో కూడా నాగార్జున వచ్చేసారు. కంటెస్టెంట్స్ తప్పులను ఎత్తి చూపిస్తూ వారిని మార్గంలో పెట్టే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే హరిత హరీష్ మాట్లాడిన పదాల గురించి సీరియస్ అయ్యారు నాగార్జున. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

కంటెస్టెంట్స్ కి ఇచ్చి పడేసిన నాగార్జున..


తాజాగా 20వ రోజుకు సంబంధించిన మొదటి ప్రోమోని మేకర్స్ విడుదల చేశారు. ప్రోమో మొదలవగానే ఎప్పటిలాగే తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న నాగార్జున.. ఆ తర్వాత హౌస్ మేట్స్ ని పలకరించారు. అందులో భాగంగానే దమ్ము శ్రీజతో మాట్లాడుతూ.. సంచాలక్ గా మీరు చేసింది కరెక్టేనా అని ప్రశ్నించగా.. నేను చేసింది కరెక్ట్ సార్ అంటూ శ్రీజ కామెంట్లు చేస్తోంది. అయితే అది నువ్వు అనుకుంటే సరిపోదు.. ఆడియన్స్ చెప్పాలి అంటూ కౌంటర్ వేశారు నాగార్జున. అలాగే నాగార్జున మాట్లాడుతూ..” బిగ్ బాస్ హౌస్ లో ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అనుకున్నాము. కానీ ఆ డిఫరెన్సే కనిపించడం లేదు”. అని నాగార్జున చెప్పగానే పవన్ మాట్లాడుతూ.. ఓనర్స్ అందరూ కలిసి కలెక్టివ్ డెసిషన్ తీసుకున్నాము అని కామనర్ చెప్పగా.. ఆ కలెక్టివ్ డెసిషన్ తప్పని.. ఆడియన్స్ చెబుతున్నారు అంటూ నాగార్జున తెలిపారు.

ALSO READ:OG Child Artist: ఓజీ కూతురు బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా.. ఆదాయం కూడా అదే రేంజ్‌లో!

హరీష్ కి స్ట్రాంగ్ కౌంటర్..

ఇక తర్వాత హరిత హరీష్ గురించి మాట్లాడుతూ.. లత్కోర్ హరీష్ అంటూ కౌంటర్ ఇచ్చారు నాగార్జున. ఇలాంటి పదాలు వాడకూడదని మీకు అనిపించలేదా అంటూ అడిగాడు. దానికి హరిత హరీష్ మాట్లాడుతూ.. అందులో తప్పేముంది క్యాజువల్ గా మాట్లాడే మాట కదా అని అనగా.. ఇప్పుడు హౌస్ మేట్స్ అందరూ నిన్ను లత్కోర్ హరీష్ అనే మాట్లాడుతారు. దానికి మీ సమాధానం ఏంటి అంటూ అడిగారు నాగార్జున. ఇలాంటి పదాలు వాడకూడదని గట్టిగా స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఏది ఏమైనా ఇది చూసిన ఆడియన్స్ ఇకనైనా మారండ్రా బాబు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related News

Bigg Boss 9: సంజన బయటికి వెళ్లిపోయిందా? గుక్క పెట్టిన ఇమ్మానియేల్, బిగ్ బాస్ మెంటల్ మాస్ ప్లాన్

Bigg Boss 9: హౌస్ మేట్స్ క్యారెక్టర్స్ బయటపెట్టిన దివ్య, అందరినీ పకడ్బందీగా అబ్జర్వ్ చేసింది

Bigg Boss 9 Promo: అమాయకుడు కాస్త అపరిచితుడు అయ్యాడు, తనుజను లోపలికి పిలిచిన సుమన్ శెట్టి

Bigg Boss 9 Promo: కట్టగట్టుకొని మరీ ఆమెను పంపించేశారుగా.. ఇది మిడ్ వీక్ ఎలిమినేషనా?

Bigg Boss9 Promo: ఉత్కంఠ రేకెత్తిస్తున్న కెప్టెన్సీ టాస్క్.. వర్షంలో హీట్ పుట్టిస్తూ!

Bigg Boss 9 : ఇవి టాస్క్ లా? కుస్తీ పోటీలా? అంత దారుణంగా కొట్టుకుంటున్నారు

Bigg Boss 9: చెప్పినా వినలేదు.. ప్రియా శెట్టి పేరెంట్స్ ఆవేదన.. ఏమైందంటే?

Big Stories

×