Ghee With Hot Water: నేటి బిజీ లైఫ్ స్టైల్‌లో, గ్యాస్, అసిడిటీ, ఉబ్బరం, మలబద్ధకం వంటి కడుపు సమస్యలు సర్వసాధారణంగా మారాయి. క్రమరహిత ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఒకే చోట గంటల తరబడి కూర్చోవడం మన జీర్ణవ్యవస్థను బలహీన పరుస్తాయి. దీనివల్ల జీర్ణక్రియ సరిగా లేకపోవడం, నిరంతర కడుపు నొప్పి వంటివి వస్తాయి. ఈ సమస్యల నుంచి బయటపడటానికి, చాలా మంది ఖరీదైన మందులు ,పౌడర్లను ఆశ్రయిస్తారు. ఇవి తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తాయి కానీ సమస్యను పూర్తిగా తగ్గించలేవు.
ఇదిలా ఉంటే మన వంటగదిలో ఉండే నెయ్యిని హోం రెమెడీగా కూడా ఉపయోగించవచ్చు. ఇది జీర్ణ సమస్యలను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. డైలీ ఉదయం పూట ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీటితో కలిపి తీసుకుంటే.. జీర్ణ సంబంధిత సమస్యలు ఈజీగా తగ్గుతాయి.
నెయ్యి జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది:
ఆయుర్వేదం ప్రకారం.. నెయ్యి మన జీర్ణ వ్యవస్థకు అమృతం లాంటిది. ఇందులో బ్యూట్రిక్ యాసిడ్ అనే షార్ట్-చైన్ ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. ఇది మన పేగు కణాలకు ప్రధాన శక్తి వనరు. ఇది పేగు గోడలను బలపరుస్తుంది. అంతే కాకుండా వాపును కూడా తగ్గిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీటితో నెయ్యి కలిపి తాగడం వల్ల జీర్ణ ఎంజైమ్‌ల స్రావం పెరుగుతుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అంతే కాకుండా పోషకాల శోషణను మెరుగు పరుస్తుంది.
ఇమలబద్ధకానికి దివ్యౌషధం:
నెయ్యి సహజ కందెనగా పనిచేస్తుంది. తరచుగా మలబద్ధకంతో బాధపడేవారికి.. ఇది దివ్యౌషధం. ఉదయం గోరు వెచ్చని నీటితో నెయ్యి తీసుకోవడం వల్ల పేగుల్లో పేరుకుపోయిన మలాన్ని మృదువుగా చేస్తుంది అంతే కాకుండా దానిని బయటకు పంపడంలో కూడా సహాయపడుతుంది.
Also Read: 30 ఏళ్లు దాటితే.. ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి ?
ఆమ్లత్వాన్ని సమతుల్యం చేస్తుంది:
నెయ్యి ఆమ్లత్వాన్ని పెంచుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ నిజం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. నెయ్యి కడుపులోని ఆమ్ల ప్రభావాలను సమతుల్యం చేయడంలో సహాయ పడుతుంది. గోరు వెచ్చని నీటితో కలిపి తాగినప్పుడు.. అది కడుపు లోపలి పొరపై పూతను ఏర్పరుస్తుంది. ఆమ్లత్వం, గుండెల్లో మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మేల్కొన్న తర్వాత గుండెల్లో మంటను అనుభవించే వారికి ఈ నివారణ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
దీన్ని ఎలా తీసుకోవాలి ?
ఈ ఆయుర్వేద నివారణ నుంచి ప్రయోజనం పొందే పద్ధతి చాలా సులభం. ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిని తీసుకొని దానికి ఒక టీ స్పూన్ స్వచ్ఛమైన దేశీ నెయ్యి కలపండి. ఉదయం ఖాళీ కడుపుతో, టీ లేదా కాఫీకి ముందు కూడా తాగండి. ఈ సాధారణ అలవాటును మీ దినచర్యలో చేర్చుకోవడం ద్వారా.. మీరు మీ జీర్ణవ్యవస్థను మెరుగు పరచుకోవచ్చు.