E-Paper
Advertisement

బొత్స చైతన్యకు షాక్.. జడ్పీటీసీ నామినేషన్ తిరస్కరణ!

బొత్స చైతన్యకు షాక్.. జడ్పీటీసీ నామినేషన్ తిరస్కరణ!
Advertisement

Botsa Chaitanya: మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడి కుమారుడు బొత్స చైతన్యకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఊహించని షాక్ తగిలింది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం జడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఆయన దాఖలు చేసిన నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు.

జనసేన ఫిర్యాదు.. ఆర్‌ఓ నిర్ణయం

Advertisement

పూసపాటిరేగ జడ్పీటీసీ స్థానానికి పోటీ చేసేందుకు బొత్స చైతన్య నామినేషన్ వేశారు. అయితే, ఆయనకు పూసపాటిరేగ మండలంలో కాకుండా విజయనగరం నగరంలో ఓటు ఉందంటూ జనసేన నాయకులు ప్రాదేశిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి కి ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం స్థానిక మండల పరిధిలో ఓటు లేకపోవడం చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించిన రిటర్నింగ్ అధికారి, పరిశీలన అనంతరం చైతన్య నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

కలెక్టర్‌కు వైకాపా అప్పీల్

Advertisement

రిటర్నింగ్ అధికారి తీసుకున్న ఈ నిర్ణయంపై వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారి ఏకపక్షంగా నామినేషన్‌ను రద్దు చేశారని ఆరోపిస్తూ వైకాపా జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ రంగంలోకి దిగారు. పార్టీ న్యాయవాదులతో కలిసి ఆయన ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌కు అప్పీల్ చేశారు. నిబంధనలకు అనుగుణంగానే తమ అభ్యర్థి నామినేషన్ వేశారని, ఆర్‌ఓ నిర్ణయాన్ని సమీక్షించి న్యాయం చేయాలని వారు కోరారు.

ముఖ్యమైన నాయకుడి కుటుంబ సభ్యుడి నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో విజయనగరం జిల్లా రాజకీయాల్లో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కలెక్టర్ ఇచ్చే తీర్పుపైనే ఇప్పుడు చైతన్య పోటీ భవితవ్యం ఆధారపడి ఉంది.

Also Read: AI వల్ల జాబ్స్ పోవడం కాదు.. రూ. 1 కోటి ప్యాకేజీ ఇచ్చే ఈ కొత్త జాబ్స్ గురించి తెలుసా?

Tags

Related News

వీడి టార్గెట్ గ్యాస్ సిలిండర్లు.. వామ్మో దొంగతనం ఇలా కూడా చేస్తారా..?

జగన్ ప్రాణాలకు ముప్పా..? అందుకే అక్కడ పెళ్లి వద్దంటున్నారా?

ఎస్‌ఐ ప్రియాంక వేటుపై.. సోషల్ మీడియాలో విడదల రజిని సంచలన పోస్ట్?

కాకినాడలో మైండ్ బ్లాకింగ్ చోరీ.. 204 కాసుల బంగారం, 85 తులాల వెండి మాయం!

ఎమ్మెల్యే, ఎంపీ రేసు నుంచి జెడ్పీటీసీ బరిలోకి.. యువ నేతల మాస్టర్ ప్లాన్ ఇదేనా?

మాజీ మంత్రి విడదల రజినీపై చేయిచేసుకున్న.. ఎస్‌ఐ ప్రియాంక సస్పెండ్!

‘వైసీపీది క్రిమినల్ పాలిటిక్స్.. జగన్ మనస్తత్వం రాష్ట్రానికే ప్రమాదం’.. సీఎం చంద్రబాబు సంచలనం

Big Stories

Advertisement
×