MGNREGS: స్వేచ్చ బ్యూరో: ఉపాధి హామీ పథకంలో అక్రమాలను నిరోధించేందుకు ప్రవేశపెట్టిన టెక్నాలజీ అక్రమార్కులకు వరంగా మారింది. దొంగ మస్తర్లు ద్వారా పథకం అసలు ఉద్దేశాలకు గండి కొడుతున్నారు. ఏప్రిల్ 1 నుంచి కొత్తగా ప్రవేశపెట్టిన కూలీల ముఖ ఆధారిత హాజరు విధానాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గడిచిన రెండు నెలల్లో పలు చోట్ల చోటుచేసుకున్న అక్రమాలను చూసి అధికారులు సైతం అవాక్కయ్యారు.
కేటిదొడ్డి మండలంలో 2026-27ఆర్థిక సంవత్సరంలో ప్లాంటేషన్ పనులు, రోడ్ల నిర్మాణం, నీటి కుంటల నిర్మాణం, పశువుల పాక నిర్మాణం తదితర పనుల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా కూలీల సంతకాలు లేకుండా వేతనాల చెల్లింపు, పనుల కొలతల్లో తేడాలు భారీగా బయటపడ్డాయి. నిబంధనలకు తూట్లు పొడిచి అడ్డగోలుగా చెల్లింపులు జరిపారు. కేటిదొడ్డి మండలం గువ్వలదిన్నె గ్రామ పంచాయతీలో కూలీలకు పని కల్పించడానికి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ ఒక్కో కూలీ నుంచి వారానికి రూ.200 వసూలు చేసినట్లు ఆరోపిస్తూ గ్రామస్తులు ఎంపీడిఓకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడం కలకలం రేపింది.
Also read: Almond House లో స్వీట్స్ కొంటున్నారా.. అయితే ఒక్కసారి ఇది చూడండి?
కేటిదొడ్డి మండలంలోని గువ్వలదిన్నె పంచాయితీలో ఉపాధి హామీ పథకంలో జరిగిన అక్రమాలపై, అధికారులు గ్రామానికి వచ్చి విచారణ నిర్వహించారు. విచారణ సందర్భంగా ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్, ఫామ్ ఫండ్స్ లను పరిశీలించారు. అయితే ఫీల్డ్ అసిస్టెంట్ వెనుకాల టిఏ, ఏపీఓల హస్తం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫామ్ ఫండ్ తొవ్వడంలో కూలీల బదులు జేసిబీలు వాడినట్లు, ఇతర కూలీలల పేర్లు మీద డబ్బులు జమ అయినట్లు గ్రామస్తులు ఆరోపించారు. ఫీల్డ్ అసిస్టెంట్, మేట్ల అక్రమ వసూళ్లపై మండల స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడంలేదని కూలీలు ఆరోపిస్తున్నారు.
కొన్ని చేయని పనులకు ఎంబీలు చేసి డబ్బులు డ్రా చేసిన కూడా కేటిదొడ్డి ఏపీఓ అలాంటిది ఏమి జరగలేదని చెబుతున్నారు. లక్షలలో అక్రమాలు జరిగిన కూడా ఎంపీడిఓ, ఏపీఓలు తమకేమి పట్టన్నట్లు మేమోలు జారి చేసి తూతూ మంత్రంగా విచారించినట్లు తెలుస్తోంది. కార్యాలయంలో ఏపీఓ, టిఏలు ఆడిందే ఆటగా మారిందని, ఉపాధి లో అక్రమాలు, తప్పుడు రికార్డులకు ఆజ్యం పోస్తున్నది అధికారులే అని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లా ఉన్న తాధికారులు మండలంలో జరిగే ఉపాధి పనుల అక్రమాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
Also read: ఇదెక్కడి పోలిక రా నాయనా.. బిగ్ బాస్ 10 కంటెస్టెంట్స్ మహాభారతంలో ఏ పాత్రకు సరిపోతారంటే?