E-Paper
Advertisement

వీడి టార్గెట్ గ్యాస్ సిలిండర్లు.. వామ్మో దొంగతనం ఇలా కూడా చేస్తారా..?

వీడి టార్గెట్ గ్యాస్ సిలిండర్లు.. వామ్మో దొంగతనం ఇలా కూడా చేస్తారా..?
Advertisement

Gas Cylinder: దొంగతనం చేయడంలో కూడా ఇంత క్రియేటివిటీ ఉంటుందా అనిపిస్తుంది వీడిని చూస్తే.. గల్లీలో ఎంత దర్జాగా నడుచుకుంటూ వస్తున్నాడో చూడండి. వీడి వేషం చూసి గ్యాస్ ఏజెన్సీ డెలివరీ బాయ్ అనుకుంటున్నారా? కానే కాదు. వీడొక దొంగ. వీడి స్పెషాలిటీ ఏంటంటే.. ఇళ్లకు తాళం వేసి ఉంటే ఆ ఇంటివైపు కన్నెత్తి కూడా చూడడు. ఇంట్లో వాళ్లు అందరు చూస్తుండగానే చోరీ చేయడం వీడి స్టైల్.. బీరువాలో బంగారాన్ని టచ్ చేయడు. నగదును అస్సలే ముట్టుకోడు. వీడి టార్గెట్ ఏంటో తెలుసా వంటింట్లో మూలకు ఉన్న ఖాళీ సిలిండర్..

గ్యాస్ సిలిండర్ మాయం..

గుంటూరు జిల్లా మంగళగిరిలో వీడు ఎవరి ఇంటి కాలింగ్ బెల్ కొడితే ఆ వంటింట్లోని గ్యాస్ సిలిండర్ మాయం అయినట్లే. ఈ ఏరియా గ్యాస్ డెలివరీ బాయ్‌ని అంటూ పచ్చి అబద్ధం చెబుతాడు. ఖాళీ సిలిండర్ ఉంటే ఇవ్వండి గంటలో ఫుల్ సిలిండర్ రిటర్న్‌ చేస్తానని నమ్మిస్తాడు. డెలివరీ బాయ్‌ కదా అని నమ్మి ఇస్తే.. భుజంపై మోసుకుంటూ జంప్ అవుతాడు. రోజులు గడిచినా అడ్రస్ ఉండదు. వారం గడిచినా తిరిగి రాడు. అప్పుడు అసలుసిసలు డెలివరీ బాయ్‌ని ఆరా తీస్తే.. తమకేం సంబంధం లేదనగానే షాక్‌ అవ్వడం బాధితుల వంతు అవుతుంది.

Advertisement

Also read: ఎస్‌ఐ ప్రియాంక వేటుపై.. సోషల్ మీడియాలో విడదల రజిని సంచలన పోస్ట్?

తండ్రీ కూడా అదే పని..

ఈ గ్యాస్ సిలిండర్‌ దొంగ పేరు చెరుకూరి ప్రవీణ్. వీడి తండ్రి అదే గ్యాస్ కంపెనీలో 30ఏళ్లు పని చేసి రిటైర్ అయ్యారు. దీంతో ప్రవీణ్‌కు లోకల్ డెలివరీ బాయ్స్‌తో మంచి దోస్తీ ఏర్పడింది. వాళ్లతో కలిసి తిరగడం.. ఏరియా అంతా గాలించడం ఇతని రొటీన్ వర్క్. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. తన ఫ్రెండ్స్ దగ్గర ఏజెన్సీ యూనిఫామ్‌ తీసుకొని వీధుల్లోకి ఎంట్రీ ఇస్తాడు. కస్టమర్ల దగ్గరికి వెళ్లి.. సార్.. అర్జెంట్‌గా ఖాళీ సిలిండర్ ఇవ్వండి, నిండు సిలిండర్ ఇప్పుడే తెచ్చిస్తానంటూ నమ్మిస్తాడు. నమ్మి సిలిండర్ చేతిలో పెడితే.. అంతే సంగతీ.

మాకు తెలీదు..

Advertisement

కస్టమర్లు ఫోన్ చేసి ప్రశ్నిస్తే.. వాడి బిల్డప్ లెవల్స్ మామూలుగా ఉండవు. ఇప్పుడే వస్తున్నా.. ఆటో ఎక్కి వచ్చేస్తున్నా.. జస్ట్ ఫైవ్ మినిట్స్ సార్ అంటూ దొంగ కబుర్లు చెబుతూ రోజులు దాటేస్తాడు. తీరా చూస్తే.. ఆ సిలిండర్లను వేరే వాళ్లకు అమ్మేసి జల్సాలు చేస్తుంటాడు. కస్టమర్లు ఏజెన్సీకి వెళ్లి ప్రవీణ్ గురించి అడిగితే.. వాళ్ల ఆన్సర్లు మరింత మండిపోయేలా ఉంటాయి. అతను ఎవరో మాకు తెలియదు. మాకూ దానికి సంబంధం లేదు.. కంప్లైంట్ ఇచ్చుకోండి అంటూ కస్టమర్ల మొఖం మీదే తలుపులు వేసేస్తారు. వీళ్ల నిర్లక్ష్యం చూస్తుంటే.. ఏజెన్సీ వాళ్లకు తెలిసే ఈ దందా నడుపుతున్నారనే డౌట్ గట్టిగా వస్తోంది. ఈ దొంగను లైట్ తీసుకుంటే.. మంగళగిరిలో ఏ ఇంటి వంటగదిలో పొయ్యి వెలగదు బాసూ..

Also Read: డిన్నర్‌ పార్టీలో బయట పడే రహస్యాలు… ఇలాంటి భార్యభర్తలను ఎక్కడా చూసుండరు మావా

Tags

Related News

బొత్స చైతన్యకు షాక్.. జడ్పీటీసీ నామినేషన్ తిరస్కరణ!

జగన్ ప్రాణాలకు ముప్పా..? అందుకే అక్కడ పెళ్లి వద్దంటున్నారా?

ఎస్‌ఐ ప్రియాంక వేటుపై.. సోషల్ మీడియాలో విడదల రజిని సంచలన పోస్ట్?

కాకినాడలో మైండ్ బ్లాకింగ్ చోరీ.. 204 కాసుల బంగారం, 85 తులాల వెండి మాయం!

ఎమ్మెల్యే, ఎంపీ రేసు నుంచి జెడ్పీటీసీ బరిలోకి.. యువ నేతల మాస్టర్ ప్లాన్ ఇదేనా?

మాజీ మంత్రి విడదల రజినీపై చేయిచేసుకున్న.. ఎస్‌ఐ ప్రియాంక సస్పెండ్!

‘వైసీపీది క్రిమినల్ పాలిటిక్స్.. జగన్ మనస్తత్వం రాష్ట్రానికే ప్రమాదం’.. సీఎం చంద్రబాబు సంచలనం

Big Stories

Advertisement
×