E-Paper
Advertisement

AI వల్ల జాబ్స్ పోవడం కాదు.. రూ. 1 కోటి ప్యాకేజీ ఇచ్చే ఈ కొత్త జాబ్స్ గురించి తెలుసా?

AI వల్ల జాబ్స్ పోవడం కాదు.. రూ. 1 కోటి ప్యాకేజీ ఇచ్చే ఈ కొత్త జాబ్స్ గురించి తెలుసా?
Advertisement

AI Jobs: ఏఐ వచ్చింది మా జాబ్స్ ను తీసేసింది అని చాలా మంది ఫీల్ అవుతుంటారు. నిజానికి ఏఐ వల్ల చాలా మంది ఉద్యోగాలు ఇప్పటికే పోయాయి కూడా. బట్ అదే ఏఐ వల్ల కూడా ఇప్పుడు జాబ్స్ క్రియేట్ అవుతున్నాయని అది కూడా కోటి రూపాయల వరకు జీతాలు చెల్లించే జాబ్స్ ఉన్నాయని మీకు తెలుసా? అసలు ఏంటి ఈ జాబ్స్..? కోటి జీతం ఇచ్చేంత డిమాండ్ ఎందుకు వచ్చింది..? మీరు లేదా మీ ఫ్రెండ్స్ ఈ జాబ్ లోకి ఎలా మారొచ్చు?

ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం..

Advertisement

ఒక కంపెనీ తన కస్టమర్ల ప్రశ్నలకు ఆటోమేటిక్ గా సమాధానాలు చెప్పే ఏఐ టూల్ ను తీసుకొచ్చింది అనుకుందాం. ఏఐ మోడల్ తయారు చేయడం ఒక పని. కానీ, దాన్ని కంపెనీ డేటాతో కనెక్ట్ చేయాలి. ఇప్పటికే ఉన్న సాఫ్ట్‌వేర్ తో ఇంటిగ్రేట్ చేయాలి. కస్టమర్ల ప్రశ్నలకు కరెక్ట్ గా సమాధానాలు వచ్చేలా చూడాలి. ఏదైనా సమస్య వస్తే పరిష్కరించాలి. అంటే ఏఐ ని తయారు చేయడం మాత్రమే కాదు అది రియల్ వరల్డ్ లో పని చేసేలా చేయాలి. వీరినే ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్ అంటారు. నార్మల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోడ్ రాస్తారు. ఏఐ ఇంజనీర్ మోడల్స్ ఏఐ అప్లికేషన్ల పైన పని చేస్తారు. కానీ ఎఫ్డిఈ మాత్రం టెక్నాలజీ, బిజినెస్, కస్టమర్ అవసరాలు ఈ మూడింటిని మిక్స్ చేయడమే ఎఫ్డిఈ పని. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఏఐ ని ల్యాబ్ నుంచి బయటకి తీసుకొచ్చి బిజినెస్ లో పని చేయించే ఇంజనీయర్. ఇప్పుడు ఇలాంటి ఎఫ్డి ఇంజనీర్స్ కు ఫుల్ డిమాండ్ ఉంది.

ఆ స్కిల్స్ ఉన్నవాళ్లకు డిమాండ్ ఫీక్స్…

Advertisement

అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఇండియాలో 80% కంపెనీలు తమ బిజినెస్ లో జెన్ ఏఐ ని వాడాలని చూస్తున్నాయి. కానీ దారుణమైన విషయం ఏంటో తెలుసా మార్కెట్ లో ఇలాంటి స్కిల్స్ ఉన్న వాళ్లు జస్ట్ 7% మంది మాత్రమే. ఇక రియల్ వరల్డ్ లో ఆ ఏఐ ని డిప్లాయ్ చేసే సామర్థ్యం ఉన్న వాళ్లు 19% మాత్రమే. చూసారా ఎంత పెద్ద గ్యాప్ ఉందో కంపెనీల దగ్గర. కోట్లాది రూపాయల బడ్జెట్ ఉంది కానీ ఆ ఏఐ మోడల్స్ ని కస్టమర్ కి ఉపయోగపడేలా మార్చే ఇంజనీర్లు లేరు. అందుకే ఎఫ్డిఐ స్కిల్స్ ఉన్నవారికి డిమాండ్ పీక్స్ లో ఉంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 37% మంది ఇంజనీర్లు కస్టమర్లతో నేరుగా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ లేకపోవడంతో ఈ రోల్స్ లోకి మారడానికి ఒక అడ్డంకి అనుకుంటున్నారు.

డిప్లాయ్ చేసే ఇంజనీర్లకే అసలైన డిమాండ్

ఎందుకంటే క్లైంట్ ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకోవాలి. టెక్నికల్ సమస్యను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం ఎట్ ది సేమ్ టైం సిస్టం లో సమస్య వస్తే దాన్ని పరిష్కరించడం ఇవన్నీ కూడా ఈ జాబ్ లో భాగమే. అందుకే ఇది కేవలం కోడింగ్ జాబ్ కాదు, టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు కమ్యూనికేషన్ ప్రాబ్లంమ్ సాల్వింగ్ బిజినెస్ అవగాహన కూడా అవసరం. మరి ఇప్పటికే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్న వాళ్లు ఏఐ లేదా మిషన్ లెర్నింగ్ నేర్చుకుంటున్న వాళ్లు ఎఫ్డియులుగా మారగలరా అంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. బట్ మీ స్కిల్స్ ను అప్గ్రేడ్ చేసుకోవాలి. మీరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయితే ఏఐ అప్లికేషన్లు ఏపిఐ ఇంటిగ్రేషన్లు, క్లౌడ్ డేటాబేస్లు ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ పై ఫోకస్ చేయాలి. ఏఐ లేదా ఎమఎల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మీ మోడల్ ను నిజమైన అప్లికేషన్ లో ఎలా ఉపయోగించాలి, అది సరిగ్గా పని చేసేలా ఎలా చూడాలి అనే విషయాలు నేర్చుకోండి. కస్టమర్ సపోర్ట్ లేదా సొల్యూషన్స్ ఇంజనీరింగ్ లో ఉన్న వాళ్లు కూడా తమ టెక్నికల్ స్కిల్స్ ని పెంచుకొని ఈ రోల్స్ కు ట్రై చేయొచ్చు.

కొత్త సాఫ్ట్‌వేర్ రోల్ ఇదే!

58% ఇంజనీర్‌లు ఎఫ్డి లేదా ఇలాంటి రోల్స్ లోకి మారడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ, ప్రత్యేక ఎఫడి లెర్నింగ్ ప్రోగ్రామ్ల గురించి అవగాహన ఉన్నవారు కేవలం 10% మాత్రమే ఉన్నారు. అందుకే సరైన స్కిల్స్ నేర్చుకొని ప్రాజెక్టులతో మీ
సామర్థ్యాన్ని నిరూపించుకునే వారికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది.

Also Read: అమెరికాలో లక్ష డాలర్ల జీతం.. ఇండియాలో ఎంత సంపాదనతో సమానం?

కోటి రూపాయల జీతం గురించి ఇప్పుడు చూద్దాం..

పక్కగా ఎఫ్డిఈ రోల్స్ లో పనిచేస్తున్న 80% మంది ఇంజనీర్లు సంవత్సరానికి 40 లక్షల నుంచి కోటి రూపాయల వరకు సంపాదిస్తున్నారు. సాధారణ డెవలపర్లతో పోలిస్తే వీరికి 30% వరకు ఎక్కువ జీతం వస్తుంది. అయితే ఒక చిన్న క్లారిటీ. ఇది కాలేజీ నుంచి బయటక వచ్చే ఫ్రెషర్లకు ఇచ్చే స్టార్టింగ్ జీతం కాదు. ఏఏ టెక్నాలజీ ప్లస్ బిజినెస్ క్లైంట్ ను హ్యాండిల్ చేయగల అనుభవం ఉన్న ఎక్స్పర్ట్స్ కే ఈ లెవెల్ ప్యాకేజీలు వస్తాయి. బాటం లైన్ ఏంటంటే మీరు ఇప్పటికే కోడింగ్ చేస్తున్న ఏఐ నేర్చుకుంటున్న లేదా కొత్త టెక్ కెరియర్ కోసం చూస్తుంటే మూడు విషయాలు గుర్తుంచుకోండి. ఒకటి ఏఐ నేర్చుకోండి. రెండు దాని నిజమైన సిస్టమ్స్ లో డిప్లాయ్ చేయడం నేర్చుకోండి. మూడు.. మీరు పరిష్కరించే సమస్య వల్ల బిజినెస్ కు ఏం ప్రయోజనం కలుగుతుందో వివరించడం నేర్చుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ కేవలం ఏఐ ని ఎలా బిల్డ్ చేయాలో తెలిసిన వాళ్ళది కాదు ఆ ఏఐ ని బిజినెస్ లో ఎలా సక్సెస్ఫుల్ గా నడపాలో తెలిసిన వాళ్ళదే.

Tags

Related News

రూ.908కే అద్భుతమైన సౌండ్..బడ్జెట్ ధరలో సూపర్ బేస్

గడియారాన్ని ఒక గంట వెనక్కి తిప్పుకుంటున్న యూకే ప్రజలు.. ఇదో వింత చరిత్ర

వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే కుకీస్ యాక్సెప్ట్ చేస్తున్నారా?జాగ్రత్త!

ఇదేం విడ్డూరం యాపిల్ మామా.. వాడిన కొన్ని గంటల్లోనే iPhone Duo స్క్రీన్ ఢమాల్!

రూ.25వేలకే రోబోట్ వాక్యూమ్ క్లీనర్..ఆపర్ ముగిసేలోపే కొనేయండి

Airtel బంపరాఫర్.. రూ. 200 కే 30GB డేటా, ఫ్రీ యూట్యూబ్ ప్రీమియం.. 20పైగా ఓటీటీలు!

క్యాబ్ బుక్ చేసేటప్పుడు లొకేషన్ తప్పుగా చూపిస్తోందా? ఈ ఒక్క సెట్టింగ్ మార్చితే సరి!

Big Stories

Advertisement
×