E-Paper
Advertisement

పుంగనూరులో తగ్గేదేలే.. అన్ని వార్డుల్లోనూ నామినేషన్లు వేయిస్తాం: పెద్దిరెడ్డి

పుంగనూరులో తగ్గేదేలే.. అన్ని వార్డుల్లోనూ నామినేషన్లు వేయిస్తాం: పెద్దిరెడ్డి
Advertisement

Peddireddy: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల వ్యవహారంపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బిగ్ టీవీతో సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు అధికార కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని ఆయన వ్యాఖ్యానించారు. న్యాయస్థానాలు రాజ్యాంగ బద్ధంగా తీర్పులు ఇస్తున్నాయని, న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు.

పోలీసులు, అధికార పార్టీ అడ్డంకులు

Advertisement

పుంగనూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ కేడర్‌ను నామినేషన్లు వేయకుండా కూటమి నాయకులు, పోలీసులు కుట్రపూరితంగా అడ్డుకుంటున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న తమ పార్టీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. అధికార బలాన్ని ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారని విమర్శించారు.

భయం వీడి నామినేషన్లు వేస్తాం

Advertisement

అడ్డంకులు ఎన్ని ఎదురైనా వెనక్కి తగ్గేదే లేదని, పుంగనూరులోని అన్ని వార్డులలో తమ అభ్యర్థులతో నామినేషన్లు వేయిస్తామని ఆయన స్పష్టం చేశారు. ‘మా పార్టీ కేడర్‌కు మేము కొండంత అండగా ఉన్నాం. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు’ అని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేసేందుకు నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Also Read: పెద్దిరెడ్డి, రోజాల కోటల్లో వైసీపీకి బిగ్ షాక్.. పీఠాలన్నీ టీడీపీ ఖాతాలోనే!

Tags

Related News

సుప్రీంకోర్టు తీర్పుతో చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టు: భూమన్ కరుణాకర్ రెడ్డి

రెబెల్స్‌కు చంద్రబాబు లాస్ట్ వార్నింగ్… మాట వినకపోతే క్షమించేదే లేదు!

రప్పా రప్పా అంటూ వేధించేవాళ్లు.. సోషల్ మీడియా సైకోలను వదలొద్దు-సీఎం చంద్రబాబు

పెద్దిరెడ్డి, రోజాల కోటల్లో వైసీపీకి బిగ్ షాక్.. పీఠాలన్నీ టీడీపీ ఖాతాలోనే!

ఏపీ మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు అంశం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు, వాటిపై మాత్రమే

విజయవాడలో భారీగా బంగారం.. విదేశీ నోట్ల కట్టలు, అధికారులకు చిక్కిన ఐదుగురెవరు? దీని వెనుక

సిక్కోలులో టీడీపీకి ఊహించని షాక్.. రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే లక్ష్మి, ధర్మాన వ్యూహం సక్సెస్

Big Stories

Advertisement
×