E-Paper
Advertisement

సీజేపీ నిరసనకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. వ్యాపారుల పిటిషన్ కొట్టివేత.. పోలీసులకు కీలక ఆదేశాలు!

సీజేపీ నిరసనకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. వ్యాపారుల పిటిషన్ కొట్టివేత.. పోలీసులకు కీలక ఆదేశాలు!
Advertisement

Delhi Protest: దేశ రాజధానిలోని కన్నాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్‌లో శుక్రవారం (అక్టోబర్ 16) కాక్రోచ్ జనతాపార్టీ తలపెట్టిన నిరసన ప్రదర్శనకు ఢిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిరసనలకు అనుమతి నిరాకరించాలంటూ వీధి వ్యాపారుల సంఘం చేసిన పిటిషన్ ను తిరస్కరించింది. మరోవైపు నిరసనల వేళ ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేయనున్నట్లు హైకోర్టుకు ఢిల్లీ పోలీసులు తెలియజేశారు.

ఢిల్లీలో సీజేపీ చేపడుతున్న వరుస నిరసనల వల్ల వర్తకులు, వ్యాపారుల హక్కులకు భంగం కలుగుతుందని పేర్కొంటూ వ్యాపార సంఘం అయిన పలికా బజార్ వ్యాపారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దసరా వేళ వీకెండ్ లో నిరసనలు చేపట్టడం వల్ల తమ వ్యాపారాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి అక్టోబర్ 15న సీజేపీ పిలుపునిచ్చిన నిరసనలు జరగకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్ నితిన్ వాసుదేవ్ సాంబ్రే, జస్టిస్ సంజయ్ శర్మలతో కూడిన ధర్మాసనం.. నిరసనలను నిరోధించడానికి చట్టపరమైన ఆదేశాలు జారీ చేయలేమని పేర్కొంది. అయితే, ఈ విషయంలో ఇప్పటికే తగిన సూచనలు, ఆదేశాలు ఇచ్చామని కోర్టు తెలిపింది.

Advertisement

మరోవైపు సీజేపీ నిరసనల నేపథ్యంలో తీసుకోనున్న భద్రతా చర్యల గురించి దిల్లీ పోలీసులు హైకోర్టుకు వివరణ ఇచ్చారు. నిరసనల సందర్భంగా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు కోర్టుకు తెలియజేశారు. అవసరమైతే సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కోర్టుకు వివరించారు. కాగా శుక్రవారం ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ వద్ద ఉన్న సెంట్రల్ పార్క్ లో ‘లెహ్రా దో తిరంగా’ పేరుతో నిరసన తెలపనున్నట్లు అభిజిత్ దీప్కే ప్రకటించారు. దీని కోసం కార్యకర్తలు, దేశ భక్తులు జాతీయ జెండాలతో రావాలని పిలుపునిచ్చారు.

Also Read: రిపోర్టర్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. రూ.12 లక్షలు ఇచ్చి ఆదుకున్న బిగ్ టీవీ ఛైర్మన్.. సర్వత్రా ప్రశంసలు!

Advertisement

అంతకుముందు ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో సీజేపీ చీఫ్ అభీజిత్ దిప్కే మాట్లాడుతూ.. గత పదిహేను రోజులుగా ఢిల్లీ వీధుల్లో విద్యార్థులను, యువతను ఈడ్చుకెళ్లారని ఆరోపించారు. వారికి మద్దతుగా నిలిచిన ప్రతిపక్ష నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌ను రక్షించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అలాగే, జంతర్ మంతర్ వద్ద జాతీయ జెండా ఎగురవేసినందుకు సీజేపీ సభ్యులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా ప్రస్తుతం జైలులో ఉన్నారని దిప్కే తెలిపారు.

Also Read: తప్పుడు అకౌంట్‌కు యూపీఐ మనీ ట్రాన్స్‌ఫర్ అయిందా? డబ్బులు వెనక్కి రావాలంటే ఇలా చేయండి!

Tags

Related News

చెన్నైలో డేంజర్ బెల్స్.. భారీగా పడిపోయిన తాగు నీటి నిల్వలు!

జంతర్ మంతర్‌ వ్యవహారం.. కేంద్రానికి-ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు

భార్యపై భర్త పైశాచికత్వం.. నచ్చిన కూర వండలేదని.. శరీరంపై పలుమార్లు కొరికి, బండరాయితో దాడి!

భర్త లేని సమయం చూసి దారుణం.. ప్రేయసిని హత్య చేసి.. పరారైన ఏసీ టెక్నీషియన్!

మత మార్పిడి రిజర్వేషన్లు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, వారికి నో బీసీ కోటా

నాలుగేళ్లు రిలేషన్ షిప్.. ఉదయం పెళ్లి సాయంత్రం విడిపోయారు, పెళ్లికొడుకు అసలు రూపం

జర్మనీలో షాకింగ్ కేసు కలకలం.. 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకిన రోబో!

Big Stories

Advertisement
×