Affordable 4×4 SUVs in India: దసరా పండుగకు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? సిటీ రోడ్లతో పాటు కొండలు, బురద రోడ్లు, రాళ్లతో కూడిన మార్గాల్లోనూ దూసుకెళ్లే SUV కావాలనుకుంటున్నారా? అయితే, 4×4 కెపాసిటీ ఉన్న వెహికల్స్ ను చెక్ చేయండి. అదీ రూ.20 లక్షల లోపు బడ్జెట్ లో 4 క్రేజీ మోడళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఆఫ్‌రోడ్ ప్రయాణాలను ఇష్టపడేవారికి మారుతి సుజుకి జిమ్నీ మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. చిన్న పరిమాణం ఉండటంతో ఇరుకైన దారుల్లోనూ ఈజీగా నడిపే అవకాశం ఉంటుంది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 103 PS పవర్, 134 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ALLGRIP PRO 4×4 సిస్టమ్, లో రేంజ్ గేరింగ్, 210 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ దీని ప్రత్యేకతలు. దీని ధరలు సుమారు రూ.12.59 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.
రఫ్ అండ్ రగ్గడ్ లుక్‌తో ఆకట్టుకునే మహీంద్రా థార్ ఆఫ్ రోడ్ ప్రియుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇందులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్ 162 PS వరకు, డీజిల్ ఇంజిన్ 152 PS వరకు పవర్‌ను అందిస్తాయి. 4WD సిస్టమ్, లో రేంజ్ గేరింగ్, 232 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ గుంతల రోడ్డుల్లో ప్రయాణానికి ఉపయోగపడతాయి. దీని ధరలు సుమారు రూ.15.60 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.
ఆఫ్‌రోడ్ సామర్థ్యానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే SUV ఫోర్స్ గుర్ఖా. ఇందులో 2.6 లీటర్ డీజిల్ ఇంజిన్ 140 PS పవర్, 320 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అందుబాటులో ఉంది. మూడు డోర్లు, ఐదు డోర్ల వెర్షన్లలో లభించే ఈ SUV ధరలు సుమారు రూ.16.52 లక్షల నుంచి మొదలవుతాయి.
ఆఫ్ రోడ్ సామర్థ్యంతో పాటు కుటుంబ ప్రయాణాలకు సరిపోయే విశాలమైన SUV కావాలనుకునేవారికి స్కార్పియో N బెస్ట్ ఆప్షన్. దీని 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ 175 PS పవర్, 400 Nm టార్క్ ను అందిస్తుంది. 4×4 డ్రైవ్ మోడ్‌లు కఠినమైన రోడ్లపై అదనపు ట్రాక్షన్‌కు సాయపడుతాయి. Z4 డీజిల్ 4WD మాన్యువల్ వేరియంట్ ధర సుమారు రూ.18.02 లక్షలుగా ఉంది.
ఇరుకైన దారులకు జిమ్నీ, రగ్గడ్ ఆఫ్‌రోడ్ ప్రయాణాలకు థార్, కఠినమైన ట్రయల్స్ కు గుర్ఖా, కుటుంబంతో ప్రయాణిస్తూ 4×4 సామర్థ్యాన్ని కోరుకునేవారికి స్కార్పియో N బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.
Read Also: రెడ్ అండ్ బ్లాక్ లుక్‌లో హ్యుందాయ్ బేయాన్.. ఫీచర్లు అదుర్స్!