E-Paper
Advertisement

ఆ పాత పెట్టె తెరిస్తే పాతాళానికే… ఇంట్లోనే నరకం చూపించిన దుష్టశక్తి… తెలుగులోనే ఈ హారర్ థ్రిల్లర్

ఆ పాత పెట్టె తెరిస్తే పాతాళానికే… ఇంట్లోనే నరకం చూపించిన దుష్టశక్తి… తెలుగులోనే ఈ హారర్ థ్రిల్లర్
Advertisement

Supernatural Horror Movie: ఇంట్లో అందరూ కలిసి ఉన్నప్పుడు మనకు ధైర్యంగా అనిపిస్తుంది. కానీ అదే కుటుంబం వరుసగా కష్టాలను ఎదుర్కొంటూ, చివరికి ఓ పాడుబడిన పాత రాజభవనంలో ఆశ్రయం పొందితే… అక్కడ తరతరాలుగా తాళం వేసి ఉంచిన ఓ పెట్టె కనిపిస్తే… దాని వెనుక ఉన్న రహస్యం తెలియక ఆసక్తితో తెరిచిన తర్వాత, ప్రాణాలకే ముప్పు వస్తే… కనిపించని దుష్టశక్తిని ఎదుర్కోవడానికి మనం ఎంతవరకు వెళ్లగలం ? కుటుంబంపై ఉండే ప్రేమ, భయంకరమైన శక్తితో చేసే పోరాటానికి మధ్య సాగే కథే ‘దహాన్ ది ఈవిల్ వితిన్’ (Dahaan: The Evil Within). మరి ఈ హారర్ థ్రిల్లర్ కథేంటి ? ఓటీటీలో ఎక్కడ చూడొచ్చు ? తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

తల్లిదండ్రులను కోల్పోవడంతో పాటు ఆర్థికంగా కూడా చితికిపోయిన సింగ్ దేవ్ కుటుంబానికి చెందిన ముగ్గురు తోబుట్టువులు అనిందిత సింగ్ దేవ్, మన్యత సింగ్ దేవ్, సమరేంద్ర సింగ్ దేవ్. జీవితంలో ఎదురైన కష్టాల నుంచి బయట పడేందుకు వీరు ఒడిశాలో ఉన్న తమ పూర్వీకుల రాజభవనానికి తిరిగి వస్తారు. అది పాతకాలపు భవనంలా కనిపించినా, దాని గోడల మధ్య తరతరాలుగా దాచిపెట్టిన ఓ భయంకరమైన రహస్యం ఉంటుంది. ఆ ఇంటి దగ్గరకు వెళ్లడానికే స్థానికులు భయపడుతుంటారు.

Advertisement

ఆ భవనంలో కుటుంబానికి చెందిన పురాతన వస్తువులతో పాటు ఓ రహస్యమైన డిబ్బుక్ పెట్టె ఉంటుంది. దాన్ని ఎందుకు తాళం వేసి ఉంచారో, దాని లోపల ఏముందో మన్యతకు తెలియదు. ఆసక్తితో ఆ పెట్టెను తెరిచి, తన కుటుంబం ఎదుర్కొనబోయే ప్రమాదానికి కారణమవుతుంది. ఎట్టకేలకు పెట్టెలో బంధించబడి ఉన్న పురాతన దుష్టశక్తి బయటకు వస్తుంది. ఆ శక్తి మన్యతను ఆవహించడంతో ఆమె ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది.

తన చెల్లెలిలో వస్తున్న మార్పులను గమనించిన అనిందిత, ఆమెను ఆ దుష్టశక్తి నుంచి కాపాడాలని నిర్ణయించుకుంటుంది. సమరేంద్ర కూడా ఆమెకు అండగా నిలుస్తాడు. కానీ మన్యతను కాపాడాలనే ప్రయత్నం అంత సులభంగా సాగదు. ఆ శక్తి ప్రభావం పెరుగుతున్న కొద్దీ కుటుంబ సభ్యుల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఫాదర్ థామస్ సహాయం కోసం సంప్రదిస్తారు.

Advertisement

అసలు ఆ పెట్టెలో దాగిన శక్తి ఏమిటి ? సింగ్ దేవ్ కుటుంబానికి ఆ రాజభవనంతో ఉన్న సంబంధం ఏంటి ? మన్యతను ఆవహించిన దుష్టశక్తిని ఫాదర్ థామస్, ఆమె తోబుట్టువులు ఎలా ఎదుర్కొంటారు ? కుటుంబాన్ని కాపాడుకోవడానికి వారు ఎలాంటి పోరాటం చేయాల్సి వస్తుంది ? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఓటీటీలో తెలుగులో ఉందా ?

‘దహాన్ ది ఈవిల్ వితిన్’ ఒడియా భాషలో రూపొందిన హారర్ థ్రిల్లర్. ఆహా (Aha)లో అక్టోబర్ 16 నుంచి తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మన్యతగా ఔరోషిఖా మిశ్రా (Aurosikha Mishra), అనిందితగా బర్షా పట్నాయక్ (Barsha Patnaik), సమరేంద్రగా సమ్రాట్ మహాపాత్ర (Samrat Mahapatra) నటించారు. ఫాదర్ థామస్ పాత్రలో పార్థ సారథి రే (Partha Sarathi Ray), విక్రమ్ సింగ్ దేవ్ పాత్రలో నిశాంత్ మజిథియా (Nishant Majithia) కనిపిస్తారు. అనుపమ్ పట్నాయక్ (Anupam Patnaik) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. హర్రర్ మూవీ లవర్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా ఇది.

Read Also: చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

Tags

Related News

అడవిలో ఆపద తెచ్చిన ప్రయాణం… ఆ దారిలో వెళ్తే ప్రాణాలే గాల్లో… టెర్రిఫిక్ తెలుగు థ్రిల్లర్

పూరీ పుణ్యక్షేత్రం రహస్యం… దివ్యశక్తి కోసం విలన్ల ఊచకోత… ఒక్కో సీన్ చూస్తుంటే మతిపోతోంది

ఈజీ మనీ కోసం ఎన్నికల్లో మోసం.. చివరికి ఊరంతా శత్రువులైతే… తెలుగు సినిమానే

దొంగతనానికి వెళ్లి మనుషుల్ని కోసి అమ్ముకునే గ్యాంగ్‌ చేతిలో బుక్… IMDbలో 8.7 రేటింగ్‌

This week OTT Movies : ఓటీటీ లవర్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఏకంగా 25 స్ట్రీమింగ్..!

వేశ్యపై మనసు పడే తాగుబోతు… మనసుకు హత్తుకునే తమిళ రొమాంటిక్ డ్రామా

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×