BigTV English

White Paper Release : వైసీపీ భూ దందాలు, వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల

White Paper Release : వైసీపీ భూ దందాలు, వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల

CM Chandrababu Naidu Released White Paper on YSRCP Land Scams : వైఎస్సార్సీపీ భూ దందాలు, సహజ వనరుల దోపిడీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు. ఇప్పటికే పోలవరం, అమరావతి, విద్యుత్ పై శ్వేతపత్రాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా విడుదల చేసిన శ్వేతపత్రంలో.. వైసీపీ హయాంలో జరిగిన భూ దందాలు, సహజ వనరుల దుర్వినియోగం గురించి సీఎం చంద్రబాబునాయుడు వివరించారు.


రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదులు వినూత్న పద్ధతిని ఎంచుకున్నారని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గత ప్రభుత్వం అడవులను ధ్వంసం చేసిందన్నారు. ఇళ్ల స్థలాల పేరుతో భూ దోపిడీకి పాల్పడ్డారని దుయ్యబట్టారు. రీసర్వే పేరుతో భూముల హద్దుల్ని మార్చేశారన్నారు. ముఖ్యంగా విశాఖలో మాజీ ఎంపీ హయగ్రీవ భూముల్ని కాజేశారని తెలిపారు. భూదందాతో పాటు.. ఖనిజ సంపదను సైతం దోచేశారని విమర్శించారు. రామానాయుడు స్టూడియోకు ఇచ్చిన ల్యాండ్ ను జిల్లాస్థాయిలో నివాసస్థలంగా చూపించి బెదిరించారన్నారు.

విశాఖ, ఒంగోలు, చిత్తూరు జిల్లాల్లో గత ప్రభుత్వ పాలకులు భూ కబ్జాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. ఇళ్ల నిర్మాణం పేరుతో వైసీపీ నేతలు భూ కబ్జాలకు పాల్పడ్డారని తెలిపారు. ఒంగోలులో రూ.101 కోట్ల విలువైన భూముల్ని లాక్కున్నారు. తిరుపతిలో రూ.207 కోట్ల విలువైన భూముల్ని, చిత్తూరులో రూ.99 కోట్ల విలువైన భూముల్ని కాజేశారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కార్యాలయాల నిర్మాణాల పేరుతో భూముల అక్రమాలకు తెరలేపారన్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలకు గత ప్రభుత్వం అసైన్డ్ భూములను అప్పగించిందని తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు.


గత ప్రభుత్వంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు ఫేక్ డాక్యుమెంట్లను సృష్టించి స్థలాలను ఆక్రమించుకున్నారని శ్వేతపత్రంలో తెలిపారు. ఖనిజ సంపదను దోచుకుని.. రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు. 22 A ను ఉపయోగించి తిరుపతి భూముల్ని కబ్జా చేశారని ఆరోపించారు.

Tags

Related News

Pawan Kalyan: రాయలసీమ అభివృద్ధిపై.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

CM Chandrababu: సీఎం చంద్రబాబు సూపర్ న్యూస్.. వారికి దసరా రోజున అకౌంట్లలోకి రూ.15వేలు

Jagan: మళ్లీ దొరికిపోయిన జగన్.. అప్పుడలా, ఇప్పుడిలా అంటూ నిజాలు బయటపెట్టిన టీడీపీ

AP Dasara Holidays 2025: విద్యార్ధులకు అలర్ట్.. దసరా సెలవుల్లో మార్పులు

Minister Lokesh: రియల్ టైమ్ గవర్నెన్స్‌లో మంత్రి లోకేష్.. నేపాల్‌లో తెలుగువారితో వీడియో కాల్

AP Govt Plan: ప్రజలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఇకపై నో ఆఫీసు, నేరుగా ఇంటికే

Big Stories

×