Minister Lokesh: నేపాల్ అంతర్గత సంక్షోభంపై పలు దేశాలు దృష్టి సారించాయి. అక్కడ పరిస్థితులు శృతి మించడంతో భారత్ సహా పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. తమ దేశ పౌరులను అలర్ట్ చేశాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఒక్కరూ బయటకు రావచ్చని, స్థానిక ఎంబసీ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరాయి. ఇదిలా ఉండగా నేపాల్‌లో 200 మందికి పైగానే తెలుగువారు చిక్కుకున్నారు. వారికి వీడియో కాల్ చేసి మాట్లాడిన మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు.
బుధవారం ఉదయం సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్‌లో అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. తొలుత ఢిల్లీ ఏపీ భవన్ అధికారులతో మాట్లాడారు. నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారి గురించి సమాచారం సేకరించారు.
వారికి సంబంధించిన ఫోన్ నెంబర్లు తీసుకున్నారు. అక్కడి సమాచారం మేరకు దాదాపు 215 తెలుగువారు నేపాల్‌లో చిక్కుకున్నట్టు ప్రాథమిక అంచనా. వారిలో కొందరికి వీడియో కాల్ చేసి మాట్లాడారు మంత్రి నారా లోకేష్. ముక్తినాథ్ దర్శనానికి వెళ్ళి ఓ హోటల్‌లో ఉన్నట్లు సూర్య ప్రభ తెలిపారు.
వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. హోటల్ నుండి బయటకు రావొద్దని, ప్రతి రెండు గంటలకు ఒకసారి మీతో సంప్రదింపులు చేస్తామని చెప్పారు మంత్రి నారా లోకేష్. కేంద్ర ప్రభుత్వం సహాయంతో అందరినీ సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొస్తామని భరోసా ఇచ్చారు.
ALSO READ: ఏపీ ప్రజలకు శుభవార్త.. ఇకపై ఇంటిని నేరుగా పత్రాలు
అధికారిక సమాచారం మేరకు నేపాల్‌లోని నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో ఏపీ వాసులున్నారు. బఫల్‌లో 27 మంది, సిమిల్ కోట్‌లో 12 మంది ఉన్నారు. పశుపతి ప్రాంతం సమీపంలోని మహాదేవ్ హోటల్‌లో 55 మంది, గౌశాలలోని పింగళస్థాన్‌లో 90 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
మొత్తం 187 మందిని గుర్తించామని, ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని వారు వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం నేపాల్‌లోని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవను అప్రమత్తం చేసింది. బాధితులను వేగంగా తరలించేందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేసేందుకు రాయబార కార్యాలయంతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు అధికారులు.
నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ ప్రజల కోసం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ప్రభుత్వం హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్రానికి చెందినవారు అత్యవసర సహాయం కోసం 91 9818395787 చేయవచ్చు. APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్లు 0863 2340678, వాట్సప్ నెంబర్ 8500027678, ఈ-మెయిల్ helpline@apnrts.com, info@apnrts.com ద్వారా సంప్రదించవచ్చు. మరోవైపు ఖాట్మాండ్‌లోని భారత రాయబార ఆఫీసులో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. +977-980 860 2881 /+977- 981 032 6134 నెంబర్లను సంప్రదించాలని కోరారు.
షెడ్యూల్ ప్రకారం మంత్రి లోకేష్ అనంతపురంలో బుధవారం జరగనున్న ‘సూపర్‌సిక్స్-సూపర్‌హిట్’ సభకు హాజరుకావాల్సి ఉంది. అయితే ఆయన హాజరుకావడం లేదని టీడీపీ వర్గాలు తెలిపాయి. నేపాల్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఏపీవాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంపై దృష్టి పెట్టారు ఆయన.
నారా లోకేష్ Monitoring :
ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు నేపాల్ లో చిక్కుకుపోయి ఏదైనా అత్యవసర సహాయం లేదా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, ఢిల్లీలోని
ఏపీ భవన్ : +91 9818395787, రియల్ టైమ్ గవర్నెన్స్: 08632381000, EXT : 8001, 8005 మరియు APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్లు: 0863 2340678,… pic.twitter.com/XylGjYiE5W
— 𝗧𝗗𝗣 𝗧𝗿𝗲𝗻𝗱𝘀 (@Trends4TDP) September 10, 2025