BigTV English
Advertisement

UAE Vs IND : UAE పై టీమిండియా భారీ విక్టరీ.. నాలుగు ఓవర్ల లోనే మ్యాచ్ ఫినిష్

UAE Vs IND : UAE పై టీమిండియా భారీ విక్టరీ.. నాలుగు ఓవర్ల లోనే  మ్యాచ్ ఫినిష్

UAE Vs IND : ఆసియా క‌ప్ 2025లో భాగంగా ఇవాళ టీమిండియా వ‌ర్సెస్ యూఏఈ మ‌ధ్య తొలి మ్యాచ్   టీమిండియా ఘ‌న విజ‌యం సాధించింది. యూఏఈ నిర్దేశించిన 58 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కేవ‌లం ఒక వికెట్ మాత్ర‌మే కోల్పోయి 4.3 ఓవ‌ర్ల‌లో టీమిండియా ఛేదించింది. దీంతో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.  కేవ‌లం 57 ప‌రుగుల‌కే  యూఏఈ జ‌ట్టు కుప్ప‌కూలిపోయింది. ముఖ్యంగా కుల్దీప్ యాద‌వ్ ఒక్క ఓవ‌ర్ లోనే మూడు వికెట్ల‌ను తీసి కోలుకోలేని దెబ్బ కొట్టాడు. మ‌రోవైపు దూబే కూడా వారిపై రెచ్చిపోవ‌డంతో చేసేది ఏమి లేక‌పోవ‌డంతో యూఏఈ బ్యాట‌ర్లు క్యూ క‌ట్టారు.


Also Read : IND vs UAE, Asia Cup 2025: టాస్ గెలిచిన టీమిండియా…ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే

తొలి బంతినే సిక్స్..అభిషేక్ అదుర్స్..

టీమిండియా బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ తొలి బంతినే సిక్స్ గా మ‌లిచాడు. 16 బంతుల్లో 30 ప‌రుగులు చేసి ఔట్ అయ్యాడు అభిషేక్ శ‌ర్మ‌. వైస్ కెప్టెన్ శుబ్ మ‌న్ గిల్ 9 బంతుల్లో 20 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ 2 బంతుల్లో 7 ప‌రుగులు చేశాడు.టీమిండియా బౌల‌ర్లలో జ‌స్ప్రిత్ బుమ్రా వికెట్ల వేట ప్రారంభించ‌గా.. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, కుల్దీప్ యాద‌వ్, అక్ష‌ర్ పటేల్, శివ‌మ్ దూబె ఇలా వ‌రుస‌గా వికెట్లు తీస్తూ ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును కోలుకోలేని దెబ్బ తీశారు. దీంతో 57 ప‌రుగుల‌కే యూఏఈ జ‌ట్టు ఆలౌట్ అయింది. ముఖ్యంగా టీమిండియా బౌల‌ర్లు కుల్దీప్ యాద‌వ్, శివ‌మ్ దూబే అద్భుతంగా బౌలింగ్ చేశారు. కుల్దీప్ యాద‌వ్ ఒక్క ఓవ‌ర్ లోనే 3 వికెట్లు తీయ‌డం విశేషం. దీంతో ఆ జ‌ట్టు బ్యాట‌ర్ల‌కు తిప్ప‌లు త‌ప్ప‌లేదు. కేవ‌లం ఇద్ద‌రు, ముగ్గురు ఆట‌గాళ్లు మిన‌హా మిగ‌తా బ్యాట‌ర్లు ఎవ్వ‌రూ కూడా రెండంకెల స్కోర్ చేయ‌లేక‌పోయారు.


9 వికెట్ల తేడాతో..

ఓపెన‌ర్ షారూఫ్ 22 ప‌రుగులు చేసి బుమ్రా బౌలింగ్ లో తొలి వికెట్ గా వెనుదిరిగాడు. మ‌రో ఓపెన‌ర్ కెప్టెన్ ముహ‌మ్మ‌ద్ వాసీం 19 ప‌రుగులు చేసి కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్ లో ఎల్బీడ్ల్యూ గా వెనుదిరిగాడు. జోహ‌బ్ 02 ప‌రుగులు చేసి వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బౌలింగ్ లో కుల్దీప్ చేతికి క్యాచ్ ఇచ్చాడు. రాహుల్ చోప్రా(3) కూడా వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బౌలింగ్ లోనే ఔట్ అయ్యాడు. అసిఫ్ ఖాన్ (2), హ‌ర్షిత్ కౌశిక్ (2), ధ్రువ్ ప‌ర్షార్ 1, సిమ్ర‌న్ జిత్ సింగ్ 1, హైద‌ర్ అలీ 1, జునైద్ సిద్దికీ డ‌కౌట్ గా వెనుదిరిగారు. దీంతో UAE జ‌ట్టు 13.1 ఓవ‌ర్ల‌లో 57 ప‌రుగులు చేయ‌గ‌లిగింది. టీమిండియా 4.3 ఓవ‌ర్ల‌లో 60 ప‌రుగులు చేసింది. దీంతో 9 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించ‌డం విశేషం. టీమిండియా ఈ మ్యాచ్ లో ఆల్ రౌండ‌ర్ల‌నే బ‌రిలోకి దించింది. ముఖ్యంగా బౌల‌ర్లు అర్ష్ దీప్ సింగ్, ప్ర‌సిద్ధ్ కృష్ణ వంటి వారిని తీసుకోలేదు. పాకిస్తాన్ మ్యాచ్ లో ఇలా అయితే మాత్రం వ‌ర్క‌వుట్ కాద‌ని కొంద‌రూ నెటిజ‌న్లు పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఇంకొంద‌రూ అయితే యూఏఈకి చుక్క‌లు చూపించారు. దీంతో పాకిస్తాన్ చుచ్చు పోసుకోవాల్సిందే అని కామెంట్స్ చేస్తున్నారు.

Related News

The Ashes 2025: యాషెస్ సిరీస్ కు ముందు ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ‌..రంగంలోకి కొత్త కెప్టెన్‌

Pratika Rawal Injury: సెమీస్ కు ముందే టీమిండియా బిగ్ షాక్‌..గ్రౌండ్ లోనే కాలు విర‌గ్గొట్టుకున్న‌ ప్లేయ‌ర్‌

Rohit Sharma Weight: ఉద‌యం 3.30 లేస్తున్న రోహిత్‌.. మ‌రో 10 కిలోలు త‌గ్గేందుకు ప్లాన్

Rohit Sharma: రోహిత్ శర్మకు భయంకరమైన వ్యాధి.. అందుకే సెంచరీ తర్వాత కూడా హెల్మెట్ తీయలేదా ?

Shreyas Iyer Injury: విరిగిన శ్రేయాస్ అయ్యర్ పక్క బొక్కలు.. ఏడాది దాకా ఆడడం కష్టమే !

Brock Lesnar: బీఫ్ దుకాణం పెట్టుకున్న బ్రాక్ లెస్నర్… షాకింగ్ వీడియో ఇదిగో

Australian women cricketers: ఆస్ట్రేలియా మహిళల జట్టును గెలికిన వాడికి థర్డ్ డిగ్రీ.. కాళ్లు, చేతులు విరగ్గొట్టారు.. నడవలేని పరిస్థితి

Rohit Sharma ODI Ranking: 38 ఏళ్లలో నం.1 ర్యాంక్.. గంభీర్ కాదు, వాడి అమ్మ మొగుడు కూడా రోహిత్‌ ను ఆపలేడు.. 2027 వరల్డ్ కప్ లోడింగ్

Big Stories

×