Boycott IND vs PAK : ఆసియా కప్ 2025 (Asia Cup 2025) ప్రస్తుతం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ టీమిండియా (Team India) తొలి మ్యాచ్ యూఈఏ (UAE) తో తలపడుతోంది. ఇక ఆ తరువాత సెప్టెంబర్ 14న దాయాది పాకిస్తాన్ తో జరుగనుంది. అయితే ఆ మ్యాచ్ పై సోషల్ మీడియా లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవలే పాకిస్తాన్ (Pakistan) కి చెందిన కొందరూ ఉగ్రవాదులు పహల్గామ్ లో దాడి చేయగా.. అందులో 26 మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు. దీంతో పాకిస్తాన్ పై భారత్ తీవ్ర వ్యతిరేకత తెలిపింది. మరోవైపు పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో భారత్ ఆపరేషన్ సింధూర్ కొనసాగించింది. దీంతో రెండు దేశాల మధ్య అన్ని సంబంధాలు దాదాపు తెగిపోయాయి.
ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ (IND Vs PAK) మధ్య ఆసియా కప్ 2025 మ్యాచ్ జరుగనుంది. అయితే ఈ మ్యాచ్ ని బాయ్ కాట్ (Boycott) చేయాలని సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేయడం విశేషం. ఇండియా వర్సెస్ పాక్ మధ్య యుద్ధ వాతావరణంతోనే ఈ మ్యాచ్ ని బాయ్ కాట్ చేశారు. ఇటీవలే రిటైర్మెంట్ ఆటగాళ్లు ఆడే మ్యాచ్ ను టీమిండియా రద్దు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ ను మాత్రం ఎందుకు రద్దు చేయడం లేదని.. బీసీసీఐ (BCCI) కి ఈ మ్యాచ్ వల్ల ఎన్నికోట్లువస్తాయని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. బీసీసీఐ మాత్రం భారత ప్రభుత్వ నిర్ణయానికి కట్టబడి ఉంటామని చెప్పడం గమనార్హం.
క్రికెట్ ప్రపంచంలో భారత్-పాకిస్తాన్ (IND-PAK) మధ్య ఉత్కంఠభరితమైన పోటీ ఉండనున్న విషయం తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ తరువాత తొలి మ్యాచ్ జరుగనుండటంతో కొందరూ టీమిండియా అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రెండు జట్ల మధ్య జరిగే ప్రతీ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగానే సాగుతుంది. కొన్ని సందర్భాల్లో టీమిండియా (Team India).. మరికొన్ని సందర్బాల్లో భారత్ ఘోర పరాజయాలను చవిచూసింది. కేవలం మ్యాచ్ ఓటమినే కాదు..ఒక దేశానికి అవమానంగా కూడా మారాయి. మరో నాలుగు రోజుల్లో అంటే.. సెప్టెంబర్ 14న ఆసియా కప్ లో మరోసారి భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. భారత్ డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగనుంది. ఈసారి కూడా తమ జట్టు భారీ విజయం సాధించి.. ఈ జాబితాలో మరో మ్యాచ్ ను చేర్చాలని టీమిండియా (Team India) అభిమానులు కోరుతున్నారు. ముఖ్యంగా ఈ రెండు మ్యాచ్ ల్లో భారత్ పాకిస్తాన్ పై భారీ తేడాతో విజయం సాధించింది. మార్చి 22, 1985 లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 125 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ (Pakistan) విజయం ఖాయం అనుకున్నారు అంతా.. కానీ 87 పరుగులకే పాక్ ఆలౌట్ అయింది. సెప్టెంబర్ 10, 2023లో టీమిండియా (Team India) 356 పరుగులు చేయగా.. 128 పరుగులకే పాక్ ఆలౌట్ అయింది.