Peddi : మా వాడి ఫంక్షన్ లో మీ హీరో గోలెంటి బ్రదర్. ఈ డైలాగ్ ఎక్కడ విన్నట్లు ఉంది కదా. అంత ఈజీగా ఎవరైనా మర్చిపోతారా. మెగా ఫ్యాన్స్ అసలు మర్చిపోరు. సరైనోడు సినిమా సక్సెస్ ఈవెంట్లో కొంతమంది అభిమానులు పవర్ స్టార్ పవర్ స్టార్ (Power star) అని అరుస్తుంటే. అల్లు అర్జున్ (Allu Arjun) చెప్పను బ్రదర్ అని అంటారు. ఆ మాట అనిన వెంటనే అక్కడితో అల్లు అర్జున్ చాలామంది మెగా అభిమానులకు టార్గెట్ గా మారిపోయాడు. అక్కడినుంచి అల్లు వర్సెస్ మెగా అని ఒక కొత్త స్లోగన్ పుట్టుకొచ్చింది. అయితే అల్లు అర్జున్ చేసిన కొన్ని విషయాలు, కొన్ని స్పీచ్ లు మెగా ఫ్యాన్స్ మెగా హీరోలకు అన్వయించుకుని కూడా అల్లు అర్జున్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప (Pushpa) సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించుకున్నాడు. ఇక ఉన్నపలంగా అల్లు అర్జున్ డైలాగ్ ఎందుకు గుర్తొచ్చింది? సెప్టెంబర్ 12న విడుదలకు సిద్ధమవుతున్న కిష్కిందపురి సినిమా లాంచ్ ఈవెంట్ దీనికి కారణం అని చెప్పాలి. ఈ ఈవెంట్ కు దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu) హాజరయ్యారు. బుచ్చిబాబు హాజరయ్యాడు అంటే ఖచ్చితంగా ప్రేక్షకులు ఏ సినిమా గురించి అరుస్తారో విధితమే.
పెద్ది బాగుంటుంది
బుచ్చిబాబు టాలెంట్ ప్రత్యేకించి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతోనే 100 కోట్ల మార్కెట్లోకి అడుగు పెట్టాడు. వాస్తవానికి ఇది ఒక నిబ్బా, నిబ్బి లవ్ స్టోరీ అనేది కొంతమంది అభిప్రాయం. ఇంకొంతమంది మాత్రం అద్భుతమైన కాన్సెప్ట్ అంటుంటారు.
ఏదేమైనా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా సక్సెస్ అయి 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది కాబట్టి అది అచీవ్మెంట్. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా పెద్ది అనే సినిమాను చేస్తున్నాడు బుచ్చి.
కిష్కిందపురి (kishkindhapuri) సినిమా ఈవెంట్లో చాలామంది పెద్దిపెద్ది అని అరవడం మొదలుపెట్టారు. దానికి పెద్ది బావుంటుంది అంటూ సమాధానం ఇచ్చాడు బుచ్చిబాబు.
ఒకప్పుడు ఏ ఫంక్షన్ కు వెళ్లినా కూడా పవర్ స్టార్ పవర్ స్టార్ అని అనడం కామన్ అయిపోయింది. ఈ విషయం పైన ఒక మనసు (Oka manasu audio function) సినిమా ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ… మీరు అలా పదేపదే పవర్ స్టార్ అని అరవడం. దీనికి కొంతమంది హీరోలు నాతో అన్న మాటను మీకు చెబుతున్నాను.
మా ఫంక్షన్ లో మీ హీరో గోలేంటి బ్రదర్ అని. ఇప్పుడు కిస్కిందపురి సినిమా ఈవెంట్ లో కూడా పెద్ది పెద్ది అని అరుస్తుంటే. అల్లు అర్జున్ చెప్పిన అదే డైలాగ్ గుర్తొస్తుంది.