Sada Bainama: తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పటినుంచో లక్షలాది రైతులు ఎదురుచూస్తున్న సాదాబైనామాలపై రెవిన్యూ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సాదాబైనామా క్రమబద్ధీకరణ కోసం 9.89 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. సుమారు 11 లక్షల ఎకరాల భూములకు 13- బీ ప్రొసీడింగ్స్ జారీ అయ్యే అవకాశం ఉంది.
సాదాబైనామా అంటే ఏమిటి..?
గతంలో ఇతరుల నుంచి భూమిని కొనుగోలు చేసినప్పుడు కేవలం కాగితాలపై ఒప్పందాలు, సంతకాలు మాత్రమే చేసుకునేవారు. అయితే ఇవి అధికారికం కాదు కావున, వీటిపై బ్యాంకులు లోన్స్ ఇవ్వవు. ఇలా రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుండా సాగు చేసుకుంటున్న వారికి అప్పటి ప్రభుత్వం సాదాబైనామా అవకాశాన్ని కల్పించింది. సాదాబైనామా అంటే రిజిస్ట్రేషన్ లేకుండా జరిగే భూమి విక్రయ ఒప్పందం. గత కొన్నేళ్లుగా లక్షలాది మంది రైతులు ఈ విధంగా భూములు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ పత్రాలను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
లక్షల మంది రైతులకు లబ్ధి..
రెవిన్యూ శాఖ విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ ద్వారా రైతుల భూమి హక్కులు రక్షించబడతాయి. వివాదాలకు సులభంగా పరిష్కారం దొరుకుతుంది.. రాష్ట్రంలో గత కొంతకాలంగా భూక్రమబద్ధీకరణపై రేవంత్ సర్కార్ ప్రత్యేక దృష్టిని సారిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సాదాబైనామా భూముల వ్యవహారంలో లక్షలాది మంది రైతులకు న్యాయం జరగే ఆస్కారం ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ సమస్యను పరిగణనలోకి తీసుకుని.. సాదాబైనామా భూములను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ చర్యల వల్ల లక్షలాది మంది రైతులు లబ్ధి చేకూరనుంది.
ALSO READ: TamilNadu News: పరోటా కోసం వెళ్లి ప్రాణాలే పొగొట్టుకున్నాడు.. అసలేం జరిగిందంటే..?
పెద్దమనుషుల సంతకంతో..
తెలంగాణ ప్రాంతంలో గత కొన్నేళ్ల క్రితం నుంచి సాదాబైనామా అని వర్డ్ వినిపిస్తూనే ఉంది. ఇది చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ లేకుండా.. కేవలం సాధారణ కాగితాలపై భూమిని కొనుగోలు చేసే సమయంలో పెద్ద మనుషుల సంతకంతో ఉంటుంది. గతంలో పలు కారణాల వల్ల రైతులు భూములను అధికారికంగా రిజిస్టర్ చేయించుకోలేదు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, చట్టాలపై అవగాహన లేకపోవడం వల్ల రిజిస్ట్రేషన్ చేయించుకోలేక పోయారు. ఈ కారణాలన్నింటి వల్లే వారు కొనుగోలు చేసిన భూములు ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం అమ్మిన వారి పేర్ల మీదనే ఉన్నాయి. ఇది తర్వాత కాలంలో భూమి హక్కులపై వివాదాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. అంతేగాకుండా.. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడంలోనూ పెద్ద అడ్డంకిగా మారింది.
ALSO READ: Hyderabad News: గణేష్ ఉత్సవాలు.. మహిళలతో అసభ్య ప్రవర్తన, మొత్తం 1612 మంది అరెస్ట్