OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ ఇష్టపడేవాళ్లకి ఒక మలయాళం సినిమా టెన్స్ రైడ్ ని ఇస్తోంది. ఈ సినిమా ఆడియన్స్‌ని బాగా ఎంగేజ్ చేస్తోంది. ఇందులో ఒక కిల్లర్ ప్రెగ్నెంట్ మహిళలను టార్గెట్ చేస్తుంటాడు. ఈ కిల్లర్ హంటింగ్ ఆడియన్స్ కి సీట్ ఎడ్జ్ థ్రిల్ ని ఇస్తుంది. అతను ఎందుకు వెంట పడుతున్నాడనేది క్లైమాక్స్ వరకు సస్పెన్స్ గా ఉంటుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? స్టోరీ ఏమిటి ? ఎందులో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
జాన్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, తన గర్భవతి భార్య మేరీ, వాళ్ల ఇద్దరు చిన్న పిల్లలు కలిసి ఒక ఫ్యామిలీ రోడ్ ట్రిప్‌కి బయల్దేరతారు. ఊటీ సమీపంలోని ఒక హిల్ స్టేషన్ రోడ్డులో, చీకటి రాత్రిలో వాళ్ల కారు ఒక లోన్లీ స్ట్రెచ్‌లో ఉంటుంది. హఠాత్తుగా వాళ్లను ఒక సైకో సీరియల్ కిల్లర్ టార్గెట్ చేస్తాడు. అతను వీళ్లను ట్రాక్ చేసే విధానం భయంకరంగా ఉంటుంది. జాన్, మేరీ, పిల్లలు ప్రాణాలతో ఎస్కేప్ చేయడానికి ఒక పాత, శిథిలమైన చర్చ్‌లో ఆశ్రయం తీసుకుంటారు. ఈ చర్చి చుట్టూ గ్రామస్థులు చెప్పే భయంకరమైన పుకార్లు ఉన్నాయి. దాని బెల్ రాత్రిళ్లు రింగ్ అవుతుందని, దానికి ఒక డార్క్ సీక్రెట్ ఉందని పుకార్లు. జాన్ తన ఫ్యామిలీని కాపాడాలని డెస్పరేట్‌గా ట్రై చేస్తాడు. కానీ చర్చి లోపల కూడా వింత శబ్దాలు, నీడలు కనిపిస్తాయి.
కిల్లర్ హంటింగ్ సీట్ ఎడ్జ్‌లో ఉండేలా చేస్తాయి. ఇక ఈ చర్చిలో దాక్కున్నాక, సీరియల్ కిల్లర్ ఈ ఫ్యామిలీని హంట్ చేయడం కొనసాగిస్తాడు. మేరీ గర్భవతి అయినప్పటికీ, తన పిల్లలను, జాన్‌ను కాపాడటానికి అసాధారణ ధైర్యం చూపిస్తుంది. ఆమె తన ఫీయర్‌ని సైడ్ పెట్టి, కిల్లర్‌ని ఎదిరించే ప్లాన్ వేస్తుంది. ఈ ప్రాసెస్‌లో, చర్చి బెల్ ఒక కీలక రోల్ ప్లే చేస్తుంది. దాని రింగ్ ఒక సిగ్నల్ లాంటిది, కానీ దాని వెనుక ఒక డీప్ సీక్రెట్ ఉంది. ఇది కిల్లర్ గతంతో ముడిపడి ఉంటుంది. కిల్లర్ ఎందుకు ఈ ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నాడు? చర్చి హిస్టరీలో ఏమిటి ఆ డార్క్ ట్విస్ట్? అనేది సెకండ్ హాఫ్‌లో రివీల్ అవుతుంది. క్లైమాక్స్‌లో ఒక మంత్ర గత్తె ఎంట్రీతో సస్పెన్స్‌ని పీక్స్‌కి తీసుకెళ్తుంది. ఈ ఫ్యామిలీ ఎలా సర్వైవ్ అవుతుంది ? కిల్లర్‌ని ఎలా ఎదుర్కొంటారు ? కిల్లర్ గతం ఏంటి ? ఎందుకు ఈ ఫ్యామిలీ వెంట పడ్డాడు ? మంత్ర గత్తె ఇదంతా చెపిస్తుందా ? అనే విషయాలను ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.
‘పళ్ళిమణి’ (Pallimani) అనిల్ కుంబజా దర్శకత్వంలో వచ్చిన మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. దీనిని ఎల్.ఏ. మెనాన్ ప్రొడక్షన్స్ పతాకంపై లేఖ్మి అరుణ్ మెనాన్ నిర్మించారు. ఇందులో కైలాష్ (హస్బెండ్), ష్వేతా మెనాన్ (ప్రెగ్నెంట్ వైఫ్), నిథ్య దాస్, దినేష్ పానిక్కర్, హరికృష్ణన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2023 ఫిబ్రవరి 24న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా 1 గంట 31 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 5.8/10 రేటింగ్ పొందింది.